సబ్ ఫీచర్

సంతాలి నాట్య కుసుమం.. బిర్బహ హన్స్‌దా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయ నేపథ్యం వున్న కుటుంబం. నటిగా, నర్తకిగా పలువురు మన్ననల, ప్రశంసలు, అవార్డులు సాధించింది. అయితే తొలిసారిగా రాజకీయ అరంగేట్రం చేసి తండ్రికి తగ్గ తనయగా నిరూపించుకోవాలని ప్రయత్నించిన బిర్భహ హన్స్‌దా ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో ఒటమిపాలయ్యారు. బీర్భహను నటిగా ఆదరించిన జంగల్ మహల్ ప్రాంత ప్రజలు, రాజకీయాలలో ఆమెను ఆదరించలేకపోయారు. మన దేశంలో భిన్నమతాలు, విభిన్న సంస్కృతులతోపాటు, మరెన్నో భాషలు ఉన్నాయి. ఈ భాషలలో ‘సంతాలి’ భాష ఒకటి. పశ్చిమబెంగాల్-జార్ఖండ్ సరిహద్దులోని ప్రాంతాల ప్రజల (గిరిజనుల) మాతృభాష సంతాలి. సంతాలి భాషలో కూడా సినిమాలు నిర్మిస్తారు. బీర్బహ ఇప్పటివరకు ఎనిమిది సంతాలి భాషా సినిమాలలో నటించి, తన అద్భుతమైన నటనకుగాను ఆరు అవార్డులు గెల్చుకొన్నారు. భరతనాట్యంలో నర్తకిగా మంచి గుర్తింపు పొందారు. అనంతరం సంతాలి భాషా సినీనటిగా ఎదిగారు. ఆమె తండ్రి నరేన్ హన్స్‌దా ఈ ప్రాంతంలో అలనాడు తిరుగులేని నాయకుడు. సహజ నటనతో తన కంటూ ఓ సాథనాన్ని సంపాథించుకున్న ఈ నాట్య కసుమం రాజకీయంగా ఎదిగేం దుకు, తండ్రి వారసత్వాన్ని అందుకునేందుకు తన ప్రయాణం సాగుతూనే ఉంటుందని వెల్లడించింది.