సబ్ ఫీచర్

ఇంకా.. మగాళ్ల ‘చెప్పు’ చేతల్లోనేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధ్యప్రదేశ్‌లోని చంబల్ డివిజన్‌లోని అమేఠ్ గ్రామం..
దాదాపు 1200 మంది జనాభా..
అందులో 500 సంఖ్య కూడా దాటని మహిళలు..
ఉదయానే్న వారి తలలపై నీటి కుండలు..
మరోచేతిలో చెప్పుల జత..
ఇదీ అక్కడి ప్రపంచం..
మరోవైపు ప్రపంచంలో.. మహిళ అంతరిక్షంలోకి దూసుకుపోతుంది.. విమానం నడిపేస్తోంది.. అన్ని పనులనూ ఒంటిచేత్తో చేసేస్తోంది. కానీ కొన్ని ప్రాంతాల్లో మహిళలు దశాబ్దాల క్రితం ఎలా ఉండేవారో ఇప్పటికీ అలాగే ఉన్నారు. అమేఠ్ గ్రామంలోని మహిళలు ఇప్పుటికీ పురుషులు ఎదురైతే చాలు.. చెప్పులు తీసి చేతిలో పట్టుకుని ఉత్తకాళ్లతో నడవాలి. ఆ ప్రాంతంలోని ఆడవారు తెల్లవారగానే నీటికోసం ఖాళీపాత్రలు తీసుకుని గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వాగు వద్దకు వెళ్లి నీళ్లు తీసుకుని రావాలి. ఇంటికి అవసరమయ్యే నీరు తీసుకురావడం కోసం వారు రోజుకు ఏడు, ఎనిమిది గంటలు శ్రమించాల్సి ఉంటుంది. కానీ గ్రామంలో వారికి దక్కాల్సిన కనీస గౌరవం కూడా దక్కదు.
తలపై నీటికుండ లేదా గడ్డిమోపు పెట్టుకుని ఊళ్ళోకి రాగానే చావడిలో కూర్చున్న పెద్దల ముందు నుంచి నడవాలంటే కాళ్లకున్న చెప్పులు విడిచేయాలి. ఒకచేతితో తలపై ఉన్న మూటను పట్టుకుని మరో చేత్తో చెప్పులు పట్టుకుని నడవాలి. ఇది చాలా ఇబ్బందికర అంశం. ఒకవేళ ఆ సమయంలో తలపై నీళ్లకుండ ఉండి, చేతిలో చెప్పులు పట్టుకుని నడుస్తున్నప్పుడు బాలెన్స్ తప్పి కిందపడితే నీళ్లకోసం మళ్లీ రెండు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. ఒకవేళ కొద్దిగా చదువుకున్న అమ్మాయిలను ఈ ఆచారాన్ని మార్చుకోండి.. అని అడిగితే 3ఎన్నో ఏళ్లుగా ఎకొనసాగుతున్న ఈ ఆచారాన్ని మేమెలా మార్చగలం? ఒకవేళ మేం ఈ సంప్రదాయాన్ని మారిస్తే అత్తామామలు, భర్త, మరుదులు.. ఎలాంటి కోడళ్లు ఇంటికి వచ్చారు అంటూ ఎగతాళి చేస్తారు. మాకు మంచి లక్షణాలు లేవని, బుద్ధి లేదని, పెద్దవాళ్లని గౌరవించడం తెలియదని, చెప్పులు తొడుక్కుని నేలమీద నిలవలేక ఎగురుతున్నారని.. సూటిపోటి మాటలతో హింసిస్తారు2 అని చెబుతోంది ఆ ఊర్లోని ఒక కోడలు.
ఆ ఊర్లో ఏ మగవాళ్లను కదిలించినా 3ఇది మా తాత, ముత్తాతల నుంచి వస్తున్న రివాజు. మగవారిని గౌరవించడం కోసం వారి ముందు మహిళలు చెప్పులు తొడుక్కుని నడవకూడదు2 అని చెబుతున్నారు.
అది ఏ కాలమైనా, ఏ కులమైనా సరే.. మహిళలందరూ ఈ ఆచారాన్ని ఇష్టంగా, సంతోషంగా పాటించాలట. వారు ఏమాత్రం విసుక్కున్నట్లు, కష్టపడినట్లు కనిపించినా కూడా వారికి తిట్లు, సూటిపోటి మాటలు తప్పవు. మగవాడు అల్లంత దూరంలో కనిపించినా సరే.. అతన్ని చూడగానే మహిళ తన వేసుకున్న చెప్పులను తీసి చేతిలో పెట్టుకోవడమో.. లేక చెప్పులను వదిలి పక్కన నేలపై నిల్చోవడమో చేయాలి. వర్షాకాలంలో బురదతో నిండిన వీధుల్లో నడవాలన్నా, గడ్డ కట్టుకుపోయే చలిలోనైనా, మండే ఎండల్లోనైనాప్రతి సీజన్‌లోనూ మహిళలు ఈ ఆచారాన్ని పాటించాల్సిందే. 3మా గ్రామంలోనే కాదు, చుట్టుపక్కల గ్రామాలన్నింట్లోనూ ఈ ఆచారం కొనసాగుతోంది. దీన్ని ఎందుకు అంత విచిత్రంగా చూస్తున్నారు. మగవారికి, మహిళలు ఆ మాత్రం గౌరవం ఇవ్వలేరా.. ఇది అంత పెద్ద విషయం కాదు కదా.. ఎందుకు మీరు ఇన్ని ప్రశ్నలు వేస్తారు2 అని అడుగుతారు ఆ ఊరి మగవారు.
మొదటల్లో ఈ కట్టుబాటు కేవలం కింది కులాలకు మాత్రమే ఉండేదట. కింది కులాల మహిళలు అసంతృప్తిగా మాట్లాడటంతో దీన్ని అగ్రకులాలకు కూడా వ్యాపింపచేశారు. దీంతో ఆ మహిళలు కూడా చెప్పులు లేకుండా నడవడం మొదలుపెట్టారు. ఎవరైనా మహిళ చెప్పులు తొడుక్కుని మగవారి ముందు నడిస్తే ఫలానా ఇంటి కోడలు అవమానకరంగా, తప్పుగా ప్రవర్తించిందని ఊరంతా చెప్పుకుంటారు. ఒకవేళ మీడియా ద్వారా కానీ, ప్రభుత్వం ద్వారా కానీ ఈ విషయం బయటకు తెలిస్తే.. ఈ విషయంపై పెద్ద చర్చ మొదలై ఈ కట్టుబాటు లేకుండా పోతుందేమోనని ఆ ఊరి పెద్దలు ఎవరికైనా ఈ విషయం చెప్పడానికి సంకోచిస్తారు. ఆ ఊరిలోని ఆదివాసీ యువకులు మాత్రం 3 ఇది పెద్దలను, మగవారిని గౌరవించే సంప్రదాయం. మేం మా మహిళలను ఇంట్లో, బయటా చెప్పులు తొడుక్కోవడానికి అనుమతిని ఇవ్వం2 అని ఆవేశంగా చెబుతున్నారు.
జిల్లా కలెక్టర్ పన్నాలాల్ సోలంకి మాత్రం ఇలాంటి కట్టుబాటు ఒకటి అమలులో ఉందనే విషయం తనకు తెలియదని, దీని గురించి తెలుసుకుంటానని, ఒకవేళ ఈ ప్రాంతంలో ఇది అమలులో ఉన్నట్లయితే దానిని ఆపేందుకు ప్రయత్నం చేస్తాను2 అని చెప్పారు. ఏది ఏమైనా మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నట్లు అనిపిస్తున్నా.. చాలా ప్రాంతాల్లో మహిళలు.. మగవారి స్వార్థానికి, కుసంప్రదాయాలకు బలవుతూనే ఉన్నారు. ఇవన్నీ మారాలంటే మనుషుల్లో, సమాజంలో మార్పు తప్పనిసరి.

- ఎస్.ఎన్. ఉమామహేశ్వరి