సబ్ ఫీచర్

పండుగవేళల్లో.. బుట్టబొమ్మల్లా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంప్రదాయ వేడుకల్లో ఈతరం అమ్మాయిలు నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలనుకుంటారు. పండుగలు, శుభకార్యాలు వస్తే చాలు.. అప్పటివరకూ జీన్స్, కుర్తాలు వేసుకునేవాళ్లు కాస్తా.. పదహారణాల తెలుగమ్మాయిల్లా మారిపోతారు. సంప్రదాయంగా కనిపించాలంటే పరికిణీ, ఓణీలను మించినవేముంటాయి? అలాగని నేటితరం పాతతరం బట్టలను వేసుకుంటారా? లేదు.. ఏది ధరించినా కొత్తగా, అందంగా కనిపించాలి. అవి వేసుకుంటే బుట్టబొమ్మల్లా మారిపోవాలి.. రాబోయేది దసరా.. నవరాత్రుల్లో ప్రతిరోజూ కొత్తగా, సంప్రదాయంగా కనిపించాలంటే భిన్నంగా ఉండే లెహెంగా, ఓణీలను వేసుకుని సంప్రదాయంగా, అందంగా బుట్టబొమ్మల్లా ఎలా మారాలో చూద్దాం..
* కంచి, బెనారస్‌లలో లభించే లెహెంగాలు భారీ పనితనంతో ఉంటాయి. పట్టు బుటాలతో కనువిందు చేస్తాయి. ఒకప్పుడు పట్టుపరికిణీ, రవిక ఒకే రంగులో ఉండేవి. ఓణీ దానికి మ్యాచింగ్‌గా ఉండేది. ఇప్పుడు మూడూ భిన్నమైన రంగుల్లో వస్తున్నాయి. అదే నేటి ట్రెండ్.
* ఈ నవరాత్రుల్లో పరికిణీ అంచుల్ని హైలెట్ చేసేలా లెహెంగాలను ఎంచుకోవచ్చు. లెహెంగా వస్త్రం అంతా ఏ డిజైన్ లేకుండా చేసి, అంచు మాత్రం భారీగా ఉండేలా చూసుకోవాలి. అంచు వస్త్రంతోనే రవికను కూడా తయారుచేసుకోవచ్చు. ఓణీకి కూడా సన్నని అంచును జత చేసుకోవచ్చు. ఇంకా భిన్నంగా కావాలంటే ఓణీపై అదనంగా వర్క్ చేయించుకోవచ్చు. ఈ పట్టు వాటిపైనే మగ్గం పనితనంతో జర్దోసి, సీక్వెన్ల వర్క్‌ను ప్రయత్నించవచ్చు.
* ఇవే కాదు బడ్జెట్ ఫ్రెండ్లీ లెహెంగాలను కూడా ప్రయత్నించవచ్చు. అంటే నెట్ వస్త్రంపై బుటీలు, ఎక్కువ కుచ్చిళ్లతో లెహెంగా వీలైనంత వెడల్పుగా ఉండేలా చూసుకోవాలి. అంచు లేకపోయినా అదనపు పనితనం వల్ల అందం మరింత రెట్టింపు అవుతుంది. దీనికి మేళవింపుగా భిన్నమైన రంగులో ఓణీ ఉండేలా చూసుకుంటే బాగుంటుంది.
* పండుగలకు ఎంపిక చేసుకునే లెహెంగా కాస్త ఆడంబరంగా కనిపించాలంటే కంచిపట్టు, బెనారస్ వస్త్రాలను ప్రయత్నించవచ్చు. లేదంటే ఏ డిజైన్ లేని పట్టు వస్త్రాన్ని ఎంచుకుని దానిపై భారీగా మగ్గం పనితనం చేయించుకోవచ్చు. ఇంకా భిన్నంగా కావాలంటే బుటీలను కూడా ప్రయత్నించవచ్చు. బుటీలయితే లెహెంగా అంతా వచ్చేలా చూసుకోవాలి.
* లెహెంగాపై భారీ అంచు వద్దనుకునేవారు ఓ తీగలా సన్నగా కనిపించేలా కూడా డిజైన్ చేయించుకోవచ్చు. టీనేజీ అమ్మాయిలకైతే నెట్ ఓణీలు బాగుంటాయి. కాస్త పెద్దవారికి మాత్రం అంతగా నప్పవు. కాబట్టి జార్జెట్, షిఫాన్ రకాలను ప్రయత్నించవచ్చు. ఇవి సాదాగా ఉంటేనే బాగుంటుంది. ఓణీ భారీ పనితనంతోనే కావాలనుకుంటే నెట్ దుపట్టాలు బాగుంటాయి.
* ప్యూర్ రా సిల్క్‌పై మగ్గం పనితనం చాలా బాగుంటుంది. కాబట్టి రా సిల్క్‌తోనూ లెహెంగాలను కుట్టించుకోవచ్చు. వీటిపై షిఫాన్, జార్జెట్, నెట్ దుపట్టాలు నప్పుతాయి.
* పట్టు, నెట్, రా సిల్క్‌లోనే కాకుండా ఆర్గాంజా, క్రేప్‌లతో కూడా లెహెంగాలను కుట్టించుకోవచ్చు. వీటిపై జాకెట్ సాదాగా కాకుండా క్రాప్ టాప్ తరహాలో ఉండేలా చూసుకోవాలి.
* ఓణీలు కూడా భారీగా కనిపించాలంటే కంచిపట్టు, ఇకత్, నెట్, షిఫాన్, జార్జెట్లు బాగుంటాయి.