సబ్ ఫీచర్

ఇల్లు పెద్దగా కనిపించాలంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి సమాజంలో పెద్ద పెద్ద ఇళ్లను నిర్మించాలంటే చాలా కష్టమైన విషయం. అలాగని మన బడ్జెట్లో చిన్న ఇంటిని నిర్మించుకుని, దాన్ని మన అభిరుచికి తగ్గట్టు అలంకరించుకోవడం అనేది చాలా కష్టమైన పనే. ముఖ్యంగా చిన్న ఇంట్లో మనకు కావలసినవి, అవసరమైనవన్నీ అలంకరించుకోవడానికి, జోడించడానికి, చిన్న ఇల్లును విశాలంగా చూపించడానికి చిన్న చిన్న చిట్కాలను పాటించాలి. అప్పుడే చిన్న ఇల్లు అతి విశాలంగా కనిపించే విధంగా తీర్చిదిద్దుకోవచ్చు. అదెలాగో చూద్దాం..
* ఎటువంటి ఇల్లైనా సరే.. విశాలంగా ఉండాలంటే ముందుగా ఆ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడు ఆ ప్రదేశం విశాలంగా కనిపిస్తుంది.
* చిన్న ఇంట్లో ప్రదేశాన్ని ఆదా చేయడానికి మల్టీ యుటిలిటీ ఫర్నిచర్‌ను ఉపయోగించవచ్చు.
* గోడను ఆనుకుని లేదా గోడ చిరవగా ఫర్నిచర్‌ను అమర్చుకోవడం వల్ల గది విశాలంగా కనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల మధ్యలో ఎక్కువ ఖాళీ ప్రదేశం ఉన్నట్లు కనిపిస్తుంది. దాంతో నడవడానికి, అటు ఇటూ తిరగడానికి ఫ్రీగా ఉంటుంది. కాబట్టి ఫర్నిచర్‌ను గదిలో ఓ పక్కగా అమర్చుకుంటే గదిలో ఎక్కువ స్థలం సేవ్ చేసినట్లు అవుతుంది.
* ఇంటి గోడలకు వేసిన రంగు ఫర్నిచర్‌కు సూట్ అయ్యే విధంగా ఉంటే గది మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. పైగా పెద్దదిగా కనబడుతుంది. గోడకు ఉన్న రంగులాంటి ఫర్నిచర్ దొరకడం చాలా కష్టం. కాబట్టి ఇంచుమించు అలాంటి షేడ్‌లో కనిపిస్తే సరిపోతుంది.
* ఇల్లు పెద్దగా కనిపించాలంటే మరో మార్గాం ఇంట్లో అద్దాలను అలంకరించడం. అద్దాలను ఎక్కడ అమర్చాలో చూసుకుని అలంకరించుకుంటే బాగుంటుంది. గదిలో వెలుగు వచ్చే వైపు అద్దాన్ని అమర్చుకుంటే ఆ గది అంతా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఇంకో చిట్కా కూడా ఉంది. గోడలకు రెండు అద్దాలను ఎదురుబొదురుగా ఉంచడం వల్ల గది ఇంకా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
* ఇంట్లో తక్కువ ఫర్నిచర్‌ను ఉపయోగించుకోవాలి. పెద్ద పెద్ద ఫర్నిచర్‌ను తెచ్చుకోవడం వల్ల అది గదిలోని మొత్తం ప్రదేశాన్ని ఆక్రమించి ఆ గదిని చాలా చిన్నదిగా కనిపించేలా చేస్తుంది. కాబట్టి సైజులోనూ, ఖర్చులోనూ తక్కువగా ఉన్న ఫర్నిచర్‌ను అమర్చుకోవడం ఉత్తమ పద్ధతి. ముఖ్యంగా ఫర్నిచర్ ఆ ఇంటి అవసరానికి మించి ఉండకుండా చూసుకోవాలి. అప్పుడే అవి ఇంట్లో చక్కగా అమరుతాయి.
* ఇంట్లో సాధ్యమైనంత వరకు గ్లాస్‌టాప్స్‌ను ఉపయోగించడం మంచిది. ముఖ్యంగా ఇంట్లో వినియోగించే సెంట్రల్ డైనింగ్ టేబుల్స్‌కి గ్లాస్ టాప్స్‌ను ఉపయోగించడం వల్ల శుభ్రపరచడానికి చాలా సులభంగా ఉంటుంది. అదేవిధంగా గ్లాస్ టాప్‌ను అమర్చుకోవడం వల్ల గ్లాస్ ప్రతిబింబం ఇంట్లో వెలుగులను నింపుతుంది. గ్లాస్‌టాప్స్ ఉన్న ఫర్నిచర్‌ను వినియోగించడం వల్ల గదిలో ఎక్కువ స్థలాన్ని ఆదా చేసుకోవచ్చు. ఎందుకంటే ఉడ్ లేదా ఐరన్‌తో తయారుచేసిన ఫర్నిచర్ ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమిస్తుంది.
* ఇంట్లో ఎంత వెలుగులు నింపితే అంతే స్థలం ఆదా అయినట్లు కనపడుతుంది. కాబట్టి ఇంటి నిండా వెలుగులు నింపడానికి మార్గాలు చూడాలి. ఎక్కువగా లైట్స్‌ను ఎత్తులో అమర్చుకోవడం కంటే గదిలో ఒక మూల కింద వివిధ డిజైన్లలో దొరికే లైట్లను అమర్చుకోవడం మంచిది. అందులో ల్యాంప్ లైట్స్ లేదా టేబుల్ లాంప్స్ లేదా ఫ్లోర్ ఫిక్సింగ్ లైట్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇలాంటివి అమర్చుకోవడం వల్ల గదంతా విశాలంగా కనిపిస్తుంది.
ఇలా చిన్న చిన్న చిట్కాలతో చిన్న ఇంటిని కూడా పెద్దదిగా, విశాలంగా కనిపించేలా చేయవచ్చు.