సబ్ ఫీచర్

గృహిణికి డిప్రెషనా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘గడియా... గవ్వ రాకటలేదు’ ఎప్పుడో విన్న సామెత. గవ్వ రాకటమటుచండి, కుటుంబ సభ్యులలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక మాటంటూనే ఉంటారు. ప్రస్తుత పరిస్థితిలో గృహిణి జీవితం అలాగే ఉంది. ఉదయం అందరికంటే ముందుగానే మేల్కోవడం నుంచి మొదలుకొని రాత్రి అందరూ పడుకునేంతవరకు మెలకువతో ఉండి, తీరిక లేకుండా పనిచేస్తున్న గృహిణి అలసిపోదా..? ఇంటిని చూసి ఇల్లాలు గొప్పతనం చెప్పవచ్చు అని మన తాతయ్య, బామ్మలు చెప్పినట్లుగా గుర్తుంది కదూ.. అది ఒకప్పటి నానుడి. ప్రస్తుతం ఇల్లాలిని గుర్తించే వారి సంఖ్య తగ్గుతోందా..? అవుననే చెప్పాలి. కొద్ది పని చేయగానే నేను పనిచేస్తూనే ఉన్నాను అని గొప్పగా చెప్పుకుంటారు మగవారు. ఎలాంటి గొప్పలు చెప్పుకోని ఒకే ఒక వ్యక్తి గృహిణి.
గృహిణి జీవితం అంత సులభమైనదేం కాదు. గృహిణి అనగానే ఇంటిలోని పనులు చేసే, ప్రతి కుటుంబ సభ్యుని అవసరాలను తీర్చే పూర్తి బాధ్యతను కలిగిన వ్యక్తిగా మాత్రమే భావిస్తూ ఉన్నారు. ఇంటి ఇల్లాలు ఇంటి పనులు సరైన సమయానికి పూర్తిచేయడానికి రోజంతా కష్టపడుతూ ఉంటుంది. గృహిణితోనే కుటుంబంలో సంతోషం, ఆనందం. ఆమే కుటుంబానికి మూలాధారం. ప్రస్తుతం చాలామంది మహిళలు ఈ బాధ్యతలను అన్నింటినీ ఎలాంటి ఒత్తిడి లేకుండా పూర్తిచేస్తున్నారు. కొంతమంది మహిళల్లో మాత్రం గృహిణిగా జీవితాంతం ఇంతేనా.. అనే నిరాశతో, నిస్పృహలతో జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఆందోళన, కుంగుబాటుకు లోనవుతున్న గృహిణుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉంది. ఇది ఇలాగే కొనసాగితే కుటుంబ నిర్వహణ కొనసాగడం చాలా కష్టంగా మారే ప్రమాదం ఉంది.
సమస్యలు
ప్రస్తుత గృహిణుల్లో తరచుగా డిప్రెషన్, ఆందోళనకు గురవుతున్న వారి సంఖ్య పెరుగుతూ ఉంది. ఎందుకు గృహిణులు కుంగుబాటుకు లోనవుతున్నారు.
రోజంతా కష్టపడ్డా తను చేసే కష్టానికి తగ్గ ప్రతిఫలం కుటుంబ సభ్యుల నుండి లభించకపోవడం, కుటుంబ సభ్యులెవరూ గృహిణి శ్రమ విలువను గుర్తించకపోవడం, ప్రశంసించకపోవడంతో ఎక్కువమంది గృహిణులు ఆందోళనకు గురవుతున్నారు.
కుటుంబ సభ్యులు గృహిణి చేసే శ్రమకు విలువను ఇవ్వకపోగా గృహిణిగా తన డ్యూటీయే కదా అని భావించేవారి సంఖ్య ఎక్కువవుతోంది. ఇంటి పనులను, కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడం తన విధిగా భావించడం.. ఆరోగ్యం బాగాలేకున్నా తన పనులలో కుటుంబ సభ్యుల సహకారం లభించకపోవడం మూలంగా వారి మనసు ఆందోళనలను ఎదుర్కొంటోంది.
గృహిణి విశ్రాం తి లేకుండా సంవత్సరంలోని సెలవురోజులతో సహా 365 రోజులూ పనిచేస్తూనే ఉంటుంది. శ్రమ విలువను గుర్తించకపోవడం, ఇంటిలోని పనులతో గృహిణిలో నిరాశ, నీరసం, శక్తిహీనత పెరిగే అవకాశం ఎక్కువవుతోంది.
కుటుంబ సభ్యులు, బంధువులు, ఇరుగుపొరుగు వ్యక్తులు తరచూ గృహిణులను, పనిచేస్తున్న మహిళలతో పోల్చుతూ ఉంటారు. గృహిణులను డబ్బులు సంపాదించడం లేదని వారిని చులకనగా చూసేవారు ఎక్కువవుతున్నారు.
సమయం, తీరిక లేకుండా పనిచేయడం, ఆందోళనలు, తీవ్రమైన ఒత్తిడి దీర్ఘకాలికంగా ఉంటే డిప్రెషన్‌కు లోనయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. డిప్రెషన్‌ను ముందుగానే గుర్తిస్తే దాన్ని సులభంగా జయించవచ్చు. కుటుంబ సభ్యులు గృహిణితో విలువ లేనట్లుగా ప్రవర్తిస్తున్నారనే నిరాశా భావనలు, చిన్న చిన్న సమస్యలకే చికాకు, కోపం రావడం, సామాజిక అంశాలపై ఆసక్తి సన్నగిల్లడం. నిద్ర సరిగా రాకపోవడం, నీరసంగా ఉండడం, కుటుంబ సభ్యులతో గొడవలు, వాగ్వివాదాలకు దిగడం, ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుపు రావడం లాంటివి డిప్రెషన్‌కు ముందస్తు సంకేతాలుగా కనిపిస్తాయి.
పై సంకేతాలు కనిపిస్తే గృహిణులు డిప్రెషన్‌కు లోనయ్యారని అర్థం. అలాంటి వారు కొనిన జాగ్రత్తలు పాటించాలి. అప్పుడే పిచ్చి పిచ్చి ఆలోచనలు రాకుండా ఉంటాయ.
మీ ఆలోచనలను భర్తతో, పిల్లలతో, తల్లిదండ్రులతో పంచుకోండి.
మీరు మీ ఆలోచనలను బాగస్వామి మరియు ఇతర కుటుంబ సభ్యులతో మాటల ద్వారా మంచిగా వివరించండి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఎల్లప్పుడూ తీసుకోవడానికి ప్రయత్నించండి. మీలోని భావనలను, ఆలోచనలను కుటుంబ సభ్యులతో పంచుకోవాలి.
టైం మేనేజ్‌మెంట్
గృహిణిగా రోజూ చేయాల్సిన పనులను ఒక క్రమపద్ధతిలో రాసుకోవాలి. ఏ సమయానికి ఏ పనిని పూర్తిచేయాలో ఆ సమయానికి ఆ పనిని పూర్తిచేయడానికి ప్రయత్నించాలి. ఒక ప్రణాళికను తయారుచేసుకోవాలి. ఇరుగు పొరుగు బంధువులు, కుటుంబ సభ్యులతో గడపడానికి, విశ్రాంతి తీసుకోవడం కోసం కొంత సమయాన్ని కేటాయించుకోవాలి.
సరదాగా..
వారానికి కనీసం ఒకసారైనా సరదాగా గడపడానికి, షాపింగ్ లేదా స్నేహితులను కలుసుకోవడానికి ఇంటినుండి బయటకు వెళ్లాలని గుర్తుంచుకోవాలి. అప్పుడు ఉత్సాహం రెట్టింపు అవుతుంది. మీరు ఇంటి బాధ్యతలను కొంత సమయం పాటు మరచిపోయి ఆనందంగా ఉండడానికి ప్రయత్నించాలి.
వ్యాయామం
రోజూ కొంత సమయం వ్యాయామం చేయడంవలన డిప్రెషన్‌ను సమర్థవంతంగా నివారించవచ్చు. వ్యాయామంతో శారీరక శక్తి పెరగడం, నీరసం స్థాయి తగ్గడం జరుగుతుంది. ప్రతిరోజూ 30 నిమిషాలపాటు నడిస్తే ప్రతిఫలం బాగుంటుంది.
మంచి నిద్ర
ప్రతిరోజూ 6 నుంచి 7 గంటలపాటు ప్రశాంతమైన నిద్రవలన ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. నిద్రవలన మెదడుకు విశ్రాంతి దొరుకుతుంది. మరునాడు చేయాల్సిన పనులను శక్తి వస్తుంది. ధ్యానం, యోగా ద్వారా దీర్ఘ శ్వాస ప్రక్రియ వంటి టెక్నిక్స్ ద్వారా డిప్రెషన్, ఒత్తిడి, ఆందోళన నుండి ఉపశమనం లభిస్తుంది.
డిప్రెషన్ నుండి ఉపశమనం పొందడానికి మరియు పూర్తిగా కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. కానీ ఇది అసాధ్యం మాత్రం కాదు. మీరు మీ జీవితంలో సానుకూల మార్పులను ఆహ్వానించడం, మీ ఇష్టమైన కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు తీసుకోవడం, కౌనె్సలింగ్, సైకోథెరపీల ద్వారా డిప్రెషన్‌ను తరిమికొట్టవచ్చు.

-డా అట్ల శ్రీనివాస్‌రెడ్డి 97039 35321