సబ్ ఫీచర్

అమూల్యమూ ఉత్తమమూ.. (ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంజరంలో సమయానికి ఆహారం, శత్రువుల నుంచి రక్షణ లభించడంతోపాటు బయట జరిగే అనవసర విషయాల తలనొప్పులు లేకపోవడం పంజరంలోని చిలుకకు హాయిగానే ఉంటుంది. పైగా, అది బంగారు పంజరం కూడా. ఏ చిలుకకు దక్కుతుంది అలాంటి వైభోగం. అందుకే ఆ చిలుకను బయటకు వదిలినా, అది మళ్లీ పంజరంలోకే చేరింది. అధికారులు, సంపదలు, పరువు ప్రతిష్ఠలు- ఇలాంటివన్నీ పంజరాలే. మీ ఆత్మ స్వేచ్ఛగా ఉండాలనుకుంటుంది. కానీ స్వేచ్ఛ చాలా ప్రమాదకరమైనది. దానికి రక్షణ, భద్రత, భీమా సౌకర్యాలుండవు. స్వేచ్ఛ అంటే పదునైన కత్తి అంచుపై నడవడం లాంటిది. ప్రతి కదలిక ప్రమాదకరమే. అనుక్షణం మనకు తెలియని వాటితో ఎదురయ్యే ప్రమాదాలతో సవాలు చేసే పోరాటమే స్వేచ్ఛ. వాతవారణం ఒక్కొక్కప్పుడు చాలా వేడిగానూ, ఒక్కొక్కప్పుడు చాలా చల్లగానూ ఉంటుంది. అలాంటి పరిస్థితులలో మిమ్మల్ని పట్టించుకునేవారెవరూ ఉండరు. కానీ, మీరు పంజరంలో ఉన్నట్లైతే యజమాని మీ పట్ల బాధ్యత వహిస్తాడు. చల్లగా ఉన్నపుడు దుప్పటి కప్పుతాడు, వేడిగా ఉన్నపుడు చల్లనిగాలి తగిలేలా చేస్తాడు. కాబట్టి, స్వేచ్ఛ అంటే మీకు మీరుగా, ఒంటరిగా తీసుకునే మహత్తరమైన బాధ్యత.
నాకు స్వేచ్ఛ కావాలి. కానీ, అది కావాలనుకున్నపుడల్లా నాకు సిగ్గుగా ఉంది.. అని రబీంద్రనాథ్ ఠాగూర్ సరిగానే చెప్పారు. ఎందుకంటే, అది కావాలనుకోవడం కాదు, వీడని బంధాలను తెంచుకోలేని భయం. ప్రమాదాన్ని కోరి తెచ్చుకోలేము కదా!
నా మిత్రుడైన స్వేచ్ఛ ఎంతో అమూల్యమైన, ఎంతో కళాత్మకమైన ఆస్తి అని నాకు తెలుసు. కానీ, ఆడంబరాల తళుకుబెళుకులతో నిండిన మది గదిని తుడిచే హృదయం నాకు లేదు.. అసలైన స్వేచ్ఛను అనుభవించినపుడే అది అమూల్యమైన ఆస్తి అని మీకు కచ్చితంగా తెలుస్తుంది. మీ చిరకాల వాంఛ కూడా అదే అని మీకు తెలుసు. అందుకే ఆ విషయంలో మీరు కచ్చితంగా ఉండాలనుకుంటారు. కానీ, అదెలా కుదురుతుంది? స్వేచ్ఛ ఎప్పుడూ చాలా ఉత్తమమైనదిగా, అమూల్యమైనదిగా ఉండాలి. అంతేకానీ, అది అర్థరహితంగా ఉండకూడదు. అందుకే ఆ విషయంలో మీరు ధైర్యాన్ని కూడగట్టుకునేందుకు కచ్చితత్వాన్ని సృష్టించుకుంటున్నారు. ఎందుకంటే, అప్పుడే మీకు తెలియని దానిలోకి మీరు దూకగలరు.