సబ్ ఫీచర్

మానసిక దృఢత్వం ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి సంతోషంగా జీవించడానికి, ఆనందంగా గడపడానికి మానసికంగా దృఢత్వాన్ని పెంచుకోవడానికి, ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడానికి వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెంటల్ హెల్త్ అక్టోబర్ 10, 1992న స్థాపించడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని అక్టోబర్ 10న జరుపుకుంటాం. ఇటీవల చోటుచేసుకున్న కొన్ని సంఘటనలను చూస్తే నడిరోడ్డుపై దారుణ హత్యలు, కత్తులతో దాడులు, తొమ్మిదవ తరగతిలోనే ఫ్రేమలు చిగురించడం, హత్యలు, ఆత్మహత్యలు, అఘాయిత్యలు, దారుణాలు, లైంగిక దాడులు, ప్రేమోన్మాదం - ఇలా ప్రతిరోజూ ఏదో ఒక సంఘటనను చూస్తూనే ఉన్నాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం భారతదేశంలో 5 కోట్లమందికిపైగా డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. విశ్వంలోని జనాభాలో 12శాతం మంది మానసిక రుగ్మతలతో సతమతమవుతున్నారు. ప్రస్తుత సమాజంలోని యువత శారీరక దృఢత్వంపై కనబరిచే శ్రద్ధ, మానసిక దృఢత్వంపై కనీస అవగాహన లేకపోవడం ఆందోళన కలిగించే అంశం. ఈ సంవత్సరం ఒక మారుతున్న ప్రపంచంలో యువత మరియు మానసిక ఆరోగ్యం అనే ప్రధానోద్దేశ్యంతో ప్రపంచ వ్యాప్తంగా మానసిక ఆరోగ్యంపై కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
వయసు ప్రభావం
యుక్తవయసు ప్రారంభంలో చాలా మార్పులు భౌతిక, శారీరక మార్పులు చోటుచేసుకుంటాయి. పాఠశాలల విద్యను ముగించుకొని ఇంటినుండి దూరంగా వెళ్లి కాలేజీ హాస్టళ్లలో, యూనివర్సిటీ విద్యలోకి అడుగుపెడుతూ ఉంటారు. కొత్త ప్రదేశాలకు వెళ్లడం, కొత్త స్నేహితులు, కొత్త వాతావరణ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తదనుగుణంగా యువతలో మానసికంగా ఒత్తిడి, భయం అనేవి సర్వసాధారణంగా ఏర్పడుతూ ఉంటాయి. ఆధునిక పోకడలతో టెక్నాలజీ వినియోగం, రోజువారీ కార్యక్రమాలలో భాగంగా పడుకునే సమయాలలో మార్పువల్ల ఒత్తిడి ఏర్పడుతోంది. కౌమార దశలో వున్న యువత ప్రకృతి వైపరీత్యాలు, ప్రబలంగా వ్యాప్తి చెందుతున్న అంటురోగాలను ఎదుర్కోవడంలో మానసిక అనారోగ్యానికి గురవుతుంటారు. ప్రపంచ వ్యాప్తంగా కౌమార దశలోని పిల్లలలో 14 సంవత్సరాలకే మానసిక అనారోగ్యానికి సంబంధించిన రుగ్మతలో సగభాగం ప్రారంభం అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఈ మానసిక రుగ్మతలలో చాలావరకూ గుర్తించలేని, చికిత్స అందించలేనివి ఎక్కువగా ఉన్నాయి. కౌమార దశలో వున్న వ్యక్తులలో అనారోగ్యానికి కారణాలలో డిప్రెషన్ మూడవ ప్రధాన కారణం. 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వున్న యువతలో చనిపోవడానికి ఆత్మహత్య రెండవ కారణం. యుక్తవయస్సులో మద్యపానానికి, డ్రగ్స్‌కు బానిసగా మారడం ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న అంశం. యుక్తవయస్సులో హార్మోన్స్ ప్రభావంవల్ల ప్రమాదకరమైన సెక్స్‌లో పాల్గొనడం, తద్వారా అనేక రకాలైన సమస్యలను కొనితెచ్చుకొంటున్నారు. కొత్త కొత్త బైక్‌లపై డ్రైవింగ్ స్పీడ్‌గా వెళ్లడంవల్ల ప్రమాదాలకు గురవుతున్నారు.
బలహీనతను ఎదుర్కొనాలి..
నేటి ప్రపంచంలో ఆధునిక సవాళ్లను ఎదుర్కొనేందుకు యువతలో మానసిక దృఢత్వాన్ని నిర్మించడానికి, కౌమార ప్రారంభ వయస్సునుండే యుక్తవయస్సులోని మానసిక ఆరోగ్యానికి తీసుకోవలసిన జాగ్రత్తలను అవగాహనను మెరుగుపరచడం చేయాలి. యువతను మానసిక ఆరోగ్యం పట్ల సన్నద్ధతను కలిగి ఉండేట్లుగా ప్రోత్సహించాలి. కౌమార దశలో ఉత్పన్నమయ్యే మానసిక అనారోగ్య సమస్యలపట్ల చైతన్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
యువత మానసిక దృఢత్వాన్ని ఏర్పరచుకునేలా ప్రోత్సహించినట్లయితే ఆదర్శవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది. ఇది సమాజానికి ఎంతో ఉపయోగకరం. సమాజంలోని దారుణాలు అడుగంటిపోతాయి. మానసిక అనారోగ్యానికి సంబంధించిన సంకేతాలపట్ల మంచి అవగాహన కలిగివున్నపుడు మాత్రమే నివారణ సాధ్యమవుతుంది. మానసిక అనారోగ్యానికి సంబంధించిన ముందస్తు హెచ్చరిక సంకేతాలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మేధావులు పిల్లలలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
మానసిక ఆరోగ్య డిజార్డర్స్‌ను గుర్తించడంకోసం సైకాలజిస్ట్‌లను, ఆరోగ్య కార్యకర్తలను ప్రతి ఒక విద్యాలయంలో నియామకం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. యువత యొక్క మానసిక ఆరోగ్యానికి సమగ్రమైన కార్యక్రమాలను నిర్వహించడానికి ప్రభుత్వాల పెట్టుబడి మరియు సాంఘిక ఆరోగ్య మరియు విద్యా రంగాల ప్రమేయం అవసరం ఎంతైనా ఉంది.
ప్రపంచంలోని 20 శాతం మంది పిల్లలు, యువత మానసిక రుగ్మతలు లేదా సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 23 శాతం మంది మానసిక మరియు పదార్థాల ఉపయోగ విధాన లోపాలతో వైకల్యానికి ప్రధాన కారణం అవుతున్నాయి. ప్రతి సంవత్సరం 8 లక్షలమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 15-29 సంవత్సరాల వయసులో మరణానికి ఆత్మహత్య అనేది రెండవ ప్రధాన కారణంగా ఉంది. మద్యపాన ఉపయోగం ప్రపంచ వ్యాప్తంగా అనేక ఆత్మహత్యలకు దోహదం చేస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు మానసిక ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతున్నాయి. మానసిక రుగ్మతలో పెరుగుదల రేట్లు అత్యవసర పరిస్థితుల తర్వాత రెట్టింపు అవుతున్నాయి. హెచ్‌ఐవి, హృదయ సంబంధిత వ్యాధి, మధుమేహం వంటి వ్యాధుల విషయంలో మనుషులలో మానసిక రుగ్మతల ప్రభావం ఎక్కువగా చూపుతున్నాయి. మానసిక రుగ్మతలను తగ్గించడానికి సమర్థవంతమైన చికిత్సలు ఉన్నప్పటికీ, మానసిక రుగ్మతల పట్ల అవగాహన లేకపోవడం మూలంగా చికిత్సల కోసం ప్రజలు ఎక్కువగా మొగ్గుచూపడంలేదు. కొన్ని దేశాలలో మాత్రం మానసిక వికలాంగుల హక్కులను పరిరక్షించే విధంగా చట్టాలు పనిచేస్తున్నాయి. మానసిక ఆరోగ్యాన్ని ప్రజారోగ్య అజెండాలో చేర్చకపోవడం, సరిపడా నిధులు కేటాయించకపోవడం, మానసిక ఆరోగ్యాన్ని కాపాడే మానసిక ఆరోగ్య నిపుణుల కొరత తీవ్రంగా ఉండడం, ప్రజల మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి సరైన నాయకత్వం లేకపోవడం.
కౌమార దశలోని వ్యక్తులకు మెంటల్ హెల్త్ యొక్క ప్రోత్సాహాన్ని అందించినట్లయితే ఆదర్శవంతమైన యువతగా ఎదుగుతారు.
యువతలో మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించునట్లుగా పాఠశాల స్థాయినుండే అవగాహన కార్యక్రమాలు రూపొందించాలి. యువతలో భావోద్వేగాల నియంత్రణకు శారీరక వ్యాయామం, యోగా, ధ్యానం లాంటివాటిలో నిమగ్నమయ్యే విధంగా చర్యలు చేపట్టాలి. ప్రభుత్వాలు మానసిక ఆరోగ్యానికి అధిక నిధులు కేటాయించేలా చొరవ చూపాలి. యుక్తవయసులపై లైంగిక హింస యొక్క ప్రభావాలను నిరోధించడానికి కార్యక్రమాలు రూపొందించాలి. ఆత్మహత్యల నివారణకు తగు చర్యలు తీసుకోవాలి. మానసిక ఆందోళనలను తగ్గించుకోవాలి. ఆత్మవిశ్వాసం పెంచుకోండి. మంచి మార్గదర్శకత్వం ఇచ్చే వ్యక్తిని మెంటారుగా స్వీకరించి అంచెలంచెలుగా ఎదగడానికి కృషి చేయాలి. -

డా. అట్ల శ్రీనివాస్‌రెడ్డి 97039 35321