సబ్ ఫీచర్

ముక్తినిచ్చే మయూర నాథుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్ష ప్రజాపతి తలపెట్టిన యాగానికి దేవతలనందరిని ఆహ్వానించి శంకరుడిని విస్మరించడంతో తండ్రి చేసిన అవమానాన్ని భరించలేక యజ్ఞస్థలాన్ని చేరి తండ్రి దక్షప్రజాపతిని పరుషమైన మాటలతో నిందించి చివరకు తాను కూడా అవమానించబడగా, ఆమె ఆవేశాగ్నికి అక్కడ వున్న ఒక నెమలిపిల్ల భయపడి సచీదేవి ఒడిలో దాగింది. అది గమనించని సచీదేవి అవమానంతో అగ్నిప్రవేశం చేసింది. అప్పుడు ఆమెతోపాటు నెమిలి కూడా దహనమైంది. సచీదేవికి జరిగిన అవమానం తెలుసుకున్న ఆ పరమేశ్వరుడు వీరభద్రుడిని ప్రేరేపించి యజ్ఞవాటికను ధ్వంసం చేశాడు. తనతో పాటు మయూరి కూడా కాలి బూడిదైందని తెలుసుకున్న సచీదేవి మయూర రూపంతో జన్మించి తన పాపాన్ని ప్రక్షాళన చేసుకుంది. ఆ స్థావరంలో ఒక మందిరాన్ని సృష్టించి పార్వతీదేవిగా అవతరించింది. మయూర రూపంలో పార్వతీ సృష్టించిన ఆలయం కనుక మయూరనాధ దేవాలయం అనే పేరు వాడుకలోకి వచ్చిందని పురాణ గ్రంథాలు చెప్తున్నాయి. ఈ ఆలయంలో వున్న శివుడు మయూరనాధుడిగా పూజలు అందుకుంటున్నాడు. ఈ ఆలయంలో అమ్మవారిని అభయాంబికా దేవిగా సేవిస్తారు. చారిత్రాత్మంగా ఎంతో విశిష్టత కలిగిన ఈ పురాతన దేవాలయం తమిళనాడు రాష్ట్రంలో నాగపట్నంలోని మైలాడుతురై (అలనాటి మయూరవరం గ్రామం)లో ఈ మయూరనాధ దేవాలయం వుంది. ఈ ఆలయ ప్రాంగణంలో వున్న మర్రి చెట్టు క్రింద నెమలి రూపంలో పార్వతీదేవి తపస్సు చేసిందని పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ ప్రవహిస్తున్న కావేరి నదికి వృషభతీర్థం అనే పేరు సార్థకమైంది. ప్రతి పౌర్ణమి రోజున గంగా యమున నదులు తమ అంశలతో ఈ కావేరీలో కలుస్తాయి. అందుకే ఈ నదికి దక్షిణ త్రివేణి సంగమం అనే పుణ్యజలంగా భావించి స్నానాలు చేసి భక్తులు తమ పాపాలను ప్రక్షాళన చేసుకుంటుంటారు. ఈ నదీ సంగమాన్ని బ్రహ్మవనంగా పిలుస్తుంటారు. అతి పురాతనమైన ఈ ఆలయం రాజగోపురం తొమ్మిది అంతస్థులతో నిర్మితమైంది. దక్షిణ భారతదేశంలో వున్న అతి పెద్ద దేవాలయాల్లో ఈ మయూరనాధ ఆలయం ప్రసిద్ధి చెందింది. పార్వతీదేవి సృష్టించిన ఆలయం కాబట్టి ఇక్కడ పార్వతీ పరమేశ్వరులను దర్శించి భక్తితో పూజిస్తే మనస్సులోని కోరికలు తప్పక ఫలిస్తాయని భక్తుల నమ్మకం. ప్రతి పౌర్ణమి రోజు భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడి త్రివేణి సంగమంలో స్నానం చేసి దైవదర్శనం చేసుకుంటారు. సాక్షాత్తు పార్వతీదేవి సృష్టించిన ఆలయం కనుక ఈ ఆలయంలో పాదం మోపితే కైలాసం దర్శించినంత అనుభూతి కలుగుతుందని పూజారులు చెప్తుంటారు. ఇక్కడ వున్న మర్రి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే పాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం. మయూర రూపంలో పార్వతీదేవి ఈ చెట్టు క్రిందనే తపస్సు చేసింది కాబట్టి ఆ అమ్మవారు ఇక్కడ ప్రదక్షిణలు చేసిన భక్తుల కోర్కెలు నెరవేరుస్తుంటుందని భక్తుల నమ్మకం. ఈ ఆలయాన్ని ఆ దర్శించిన భక్తులకు ముక్తి లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. మయూరనాథ, అభయాంబికాదేవి వీరిద్దరిని స్మరించినా పుణ్యప్రదం అని అమ్మవారి భక్తులు అంటారు.

కుఠువాడ మురళీధర్