సబ్ ఫీచర్

దాన విశేషం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముఖంపై చేదుగా మాట్లాడేవారు , అంతగా ఎపుడూ మోసం చేయరు. బయటపడవల్సింది తియ్యగా మాట్లాడేవారితోనే మనసులో అసూయను పెంచుకొంటారు. సమయం వచ్చినపుడు మారిపోతారు. అద్దం చాలా పెళుసైనది. పలుచనైనది. చేయిజారితే ముక్కలైపోతుంది. కానీ ఎప్పుడూ నిజాన్ని చెప్పడానికి జంకదు. మనిషి కూడా ఏ ఆలోచనలనైనా అద్దం లాగా చూడాలి. ఇతరులతో వ్యవహరించేటపుడు అద్దం వలె ఉండాలి. కర్ణుడికి దాన కర్ణుడని పేరు. ఒకనాడు శ్రీకృష్ణుడు ఉదయానే్న కర్ణుడి దగ్గరకు వెళ్లాడు. అపుడు కర్ణుడు అభ్యంగన స్నానానికి వెళ్లుతున్నాడు. తలకు నూనె రాసుకొంటున్నాడు. అపుడు కృష్ణుడు వచ్చాడు. వస్తూనే కర్ణుడు నూనె రాసుకోవడానికి పెట్టుకొన్న గినె్న ను చూచాడు. అది చాలా అందంగా ఉంది. ‘కర్ణా! నీ దగ్గర ఉన్న ఆగినె్న చాలా బాగుంది. నాకిస్తావా ’అన్నాడు. ఆ గినె్న కర్ణుడికి ఎడమ చేతి వైపున ఉంది. వెంటనే ‘అంతకంటే నా భాగ్యమేముంది. తీసుకో గినె్న కృష్ణా!’ అంటూ ఎడమచేతితోనే ఇచ్చివేశాడట. అక్కడున్నవారు అయ్యో ఎడమ చేతితో కాకుండా కుడిచేతితో ఇస్తే బాగుండు కదా అన్నారట. దానికి కృష్ణుడు ఇలా చెప్పాడు.. మనసు చాలా చంచలమైనది. క్షణంలో ఏదైనా జరుగవచ్చు. పైగా మనచేత చేయించేవాడు పరమాత్మ కదా. నేను బాగా ఆలోచించి ఈ గినె్నను మంచి ప్లేటులో పెట్టి కుడిచేతితో దానం ఇవ్వడానికి నేను స్నానపానాదులు చేసి వచ్చి అప్పుడు ఇద్దామనుకొంటే నా మనసు అప్పటికే విధంగా మారుతుందో. ఇపుడు కృష్ణుడు అడిగాడు. నా మనసు ఇవ్వు అంది. ఎడమచేతికి అందుబాటులో గినె్న ఉంది. వెంటనే ఎడమ చేతితోనే ఇచ్చేసాను. ఎప్పుడైనా ఇవ్వాలనుకొన్న తరువాత వెంటనే ఆ పనిని చేయాలి. కాని దానిని నానబెట్టకూడదు. అంతలో మనసు మారవచ్చు. లేదా విధి దేనినైనా నాచేత చేయించవచ్చు. మంచిపనులకు ఎపుడు మీనమేషాలు లెక్కపెట్టకూడదు. చెడు తలంపులు వస్తే వాటిని కాస్త నిదానంగా ఆలోచించాలి అని కర్ణుడు వారికి చెప్పాడట. అంతా విన్న కృష్ణయ్య చిరునవ్వు నవ్వాడట.
దానం విషయంలో సదా సాత్వికమే ప్రధానం. చేయాలనే సంకల్పం కలుగగానే ఆదరణతో భగవదర్పణ బుద్ధితో ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా రెండవ చేతికి కూడా తెలియనంత గుప్తంగా దానం చేసేయాలి. దానం చేసి నేను అంత చేశాను, ఇంత చేశాను అని గొప్పలు చెప్పుకోకూడదు. అనవసర దానం చేయకూడదు. దానం పుచ్చుకున్నవారికి అది ఉపయోగపడాలి. దాని వల్ల దాన గ్రహీతలకు ఆనందం కలుగాలి. అపుడు దానం చేసినవారికి పుణ్యం, సంతోషం కలుగుతాయి.

కురువ శ్రీనివాసులు