Others

కాలమా! వొదిగిపో!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాలుగు రోజులు సరదాగా శాన్‌ఫ్రాన్సిస్కో చుట్టిరావాలన్నది దివ్య సంకల్పం. దివ్య ఉంటోన్న దక్షిణ కాలిఫోర్నియా నుండి ఉత్తరాన వున్న శాన్‌ఫ్రాన్సిస్కోకి నాలుగు వందల మైళ్ళ ప్రయాణం. భూమి లోలోతుల.. అగాథంలో విస్తరించుకున్నట్టుగా అనిపించే ఫసిఫిక్ మహాసముద్రాన్ని చూస్తూ మెలికలు తిరుగుతూ వందమైళ్ళ పైగా సాగే ఆకసాన్ని తాకే కొండంచుల ఫసిఫిక్ రూట్ ప్రయాణం ఎనిమిది గంటలు.. పిల్లలతో పది గంటలు.. సమయపాలన ఎరిగినవారికి జిపిఎస్ వరప్రసాదం.. కాలాన్ని కాలక్షేపానికి వదిలేసినవారికి అదే జిపిఎస్ తన కాలాన్ని పెంచుకుంటూ కాలపాశమవుతుంటుంది. మన లేజీనెస్‌కు ట్రాఫిక్ తోడవుతుందని జిపిఎస్‌కు తెలిసినంతగా కాలానికి కళ్లెం వేయటం తెలీని మనకు తెలీదు కాక తెలీదు. కాలయాపనకు కాలక్షేపం సైతం తట్టుకోలేదు.
ప్లాన్ ప్రకారం పిల్లలతో సహా అందరం నాలుగు గంటలకే రెడీ అయినా మా దివ్య కళ్లు విప్పేటప్పటికి అయిదున్నర.. ఆఫీస్ కంప్యూటర్‌ని పలకరించి దాని నోరు నొక్కేప్పటికి, మీ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ ఏడిసినట్టుందంటూ గడియారం ఏడు గంటలు కొట్టింది.
ఆ గంటల సవ్వడిలో ఎఫెక్టివ్‌లీ మేనేజింగ్ టైమ్ ఈజ్ ఎ స్కిల్.. దట్ సో మెనీ డిజైర్ బట్ సో ఫ్యూ హావ్ అన్న నా గుండె సవ్వడి హృదయ లయగా, జీవన శైలిగా నా కళ్లముందు అక్షరీకృతమైంది.
***
కాలాన్ని వొడిసిపట్టుకోవటం నైపుణ్యం. అందరూ జీవన ప్రయాణంలో నిపుణులే కావాలనుకుంటారు.. అయితే కాలం అంచుమీద కొందరే నిష్ణాతులవుతారు. కాలం అంచుమీద తడబడేవారు కాలయాపకులు, కాలయాచకులు అవుతుంటారు. మూడు గంటలకు లేచిన నా సంయమనానికి ఏడు గంటల వరకు సహన పరీక్ష.. ఆ లేట్‌లో దివ్యని చూస్తుంటే అనిపించింది- చేసే పనిని సరళంగాను, సులభంగాను, వేగంగాను చేయటమే కదా సక్సెస్ అని. సింప్లిఫైడ్‌గా, ఈజియర్‌గా, ఫాస్టెస్ట్‌గా టాస్క్ పూర్తిచేసేవారికి స్ట్రెస్ అంటే తెలిసే అవకాశమే లేదు.. స్ట్రెస్ అన్న పదం వినపడ్డా ఉలిక్కిపడాల్సిన అవసరమూ కలగదు. టైమ్ మేనేజ్‌మెంట్, టైమ్ ఫర్ సక్సెస్ అంటే ఇదే కదా!
***
సెలవు పెట్టుకుని ప్రశాంతంగా ఉండక ఆఫీస్ కంప్యూటర్ ముందు దివ్య కూలబడుతుంటే అనిపించింది- అన్ని పనులు నేనే చేయగలననుకోవటం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కాదు.. అలా అని పదహారు గంటల కంప్యూటర్‌కు అతుక్కుపోవటమూ సిన్సియారిటీ కాదు. సమర్థత, సిన్సియారిటి, కాన్ఫిడెన్స్ అనేవి అన్ని టాస్క్‌లను వొడిలో వేసుకుని కూలబడటంలో కూడబలుక్కుని అవసరమైన వాటిపై దృష్టి పెట్టటంలో ఉండాలి. అప్పుడు సమస్య చిక్కుముడిలా అనిపించదు.. గుమ్మం ముందు పొందికగా పాకిన తీగలా అనిపిస్తుంది.
***
అవును, లీజర్ ట్రిప్‌లో ఆఫీస్ వర్క్‌ని ఇసుమంతైనా కలపకూడదు.. కలిపితే తన మూడ్ మాత్రమే కాదు.. కలిపితే తన మూడ్ మాత్రమే కాదు తన వారయిన అందరి మూడ్ ఖచ్చితంగా పాడవుతుంది.
సో.. ఈ ప్రారంభ ప్రయాణానికే నాకు అర్థమయిందేమిటంటే-
* మన తాత్సారం, ఆలస్యం మనకే కాలపాశాలవుతాయి.. సమయాన్ని మన నుండి దూరం చేస్తాయి.
* మనం అసహాయులం అవుతాం.. తోటివారిని అసహనానికి గురిచేస్తాం.
* ప్లానింగ్‌కు టైమ్ మేనేజ్‌మెంట్ తోడైతే తప్ప ఆచరణ పర్‌ఫెక్ట్ కాదు.
* పని విషయంలో నత్తనడక పనికిరాదు. జింక పరుగే ది బెస్ట్ అవుతుంది.
* సింప్లిఫై అంటే స్లో మోషన్‌లో డీల్ చేయటం అని భ్రమపడకూడదు.
***
దివ్య లాంటి వర్క్‌హాలిక్‌లు చాలామంది తారసపడుతుంటారు.. ఇరవైనాలుగ్గంటలూ కంప్యూటర్‌లో తలదూర్చటం ‘హైపర్ ప్రొడక్టివ్’ అవుతుందే కానీ స్మార్టర్ కాదు. వర్క్ కల్చర్‌ని సింప్లికై చేసుకున్నవారే స్మార్ట్. అందుకే అనేది ‘వర్క్ స్మార్టర్.. నాట్ హార్డర్’ అని.
***
అన్నట్టు, వర్క్ ప్లేస్‌లో మనం రోబోస్‌తో పోటీపడటం, మనం రోబోటిక్‌గా తయారుకావటం ‘స్మార్టర్’ అనిపించుకోదు. సామాన్యంగా, టాస్క్‌ల గురించి మాట్లాడుకుంటూ- రోజంతా టాస్క్‌లతోనే సతమతమైపోతూ స్ట్రెస్ అవుతుండటం చూస్తుంటాం. ఇలా స్క్వీజింగ్ యాజ్ మెనీ టాస్క్స్ యాజ్ పాజిబుల్ స్మార్టర్ కాదు కదా! అది రోబోటిక్ వే అవుతుంది కానీ హ్యూమన్ స్టైల్ కాదు. థాట్‌ఫుల్‌గాను, ఎఫీషియంట్‌గాను సమస్యలను పరిష్కరించుకోవటం స్మార్టర్ వే అవుతుంది. నా ఉద్దేశంలో కాలంతో కొట్టుకుపోతూ నిపుణులం కాలేం.. కాలాన్ని వొడిసిపట్టుకుని, కాలాన్ని మిగుల్చుకోగలిగితేనే నిష్ణాతులం.. అందులో నా తనం ఉంటుంది... జీవితం ఉంటుంది. అంటే, స్మార్టర్‌గా వృత్తి జీవనం గడపటం వల్ల సంసార జీవితం, సామాజిక జీవితం సారవంతమవుతుంది.
ఇట్ ఈజ్ ఎబౌట్ క్లీనింగ్ అవే స్పేస్ ఇన్ యువర్ లైఫ్ టు మేక్ టైమ్ ఫర్ పీపుల్, ప్లే అండ్ రెస్ట్. ఈ సరదా జీవితం అందివచ్చేది సారవంతమైన జీవితం నుండే.
***
స్మార్ట్‌గా పనిచేసేవారికైనా, హార్డర్‌గా రోబోటిక్‌గా డీల్ చేసేవారికైనా రోజుకి ఉండేది ఇరవై నాలుగ్గంటలే! కాలయాపన చేసేవారికి కాలమే యముడవుతుంటుంది. కాలాన్ని వొడిసిపట్టుకున్నవారికి కాలమే బహుమతి అవుతుంటుంది. కాస్తంత రీ అరేంజింగ్‌తో రీ ఇమేజింగ్‌తో. నా ఉద్దేశంలో మనం కాలానికి హోస్ట్ కావాలి కానీ మనమే కాలానికి గెస్ట్ కాకూడదు. హోస్ట్‌లం అయిననాడు మనం బ్లిస్డ్ పర్సన్స్.
ముగించే ముందు మూడు మాటలు-
* టాస్క్స్ హాబిట్యుయల్ కావాలే కానీ స్ట్రెస్‌ఫుల్ కాకూడదు. * టాస్క్‌కి టాస్క్‌కి మధ్యన బఫర్ టైమ్ ఉండాలి. * టాస్క్‌ల విషయంలో ఒన్ టాస్క్ ఎట్ ఎ టైమ్ అండ్ ఒన్ స్టెప్ ఎట్ ఎ టైమ్ అన్నదే టైమ్ మేనేజ్‌మెంట్. సింపుల్‌గా చెప్పుకోవాలంటే..
ది కీ టు ఎఫెక్టివ్ టైమ్ మేనేజ్‌మెంట్ ఈజ్ లిటరల్లీ బీయింగ్ యువర్ ఓన్ బాస్.
దివ్యా! కాలం నీలో వొదిగిపోనీ!

-డా॥ వాసిలి వసంతకుమార్