సబ్ ఫీచర్

ఊహించని కలయిక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ జనతాపార్టీ చేసిన మిత్రద్రోహానికి రగిలిపోతున్న తెలు గుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు ఇరవై ఏళ్ల క్రితం జాతీయ రాజకీయాల్లో పోషించిన పాత్రలోకి మళ్ళీ ఇపుడు ప్రవేశించారు. జాతీయ పార్టీ అండ లేకుండా రాజకీయ కూటములు మనలేవని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం నెలకొల్పటంలో కీలక పాత్ర పోషించిన చంద్రబాబుకి తెలియనిది కాదు. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడో ఫ్రంట్ కడతానని ఆర్భాటం చేసినా తెదేపా వంటి ప్రాంతీయ పార్టీలు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఆ విషయంలో అనుభవం ఉన్న చంద్రబాబు ముందుగా కాంగ్రెస్ తలుపు తట్టారు. ఈ అవకాశం కోసమే ఎదురుచూస్తున్న కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు రూపంలో తమ తలుపు తట్టిన అదృష్ట్టాన్ని కాలదన్నుకోకుండా స్నేహ హస్తం చాచింది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే- ఈ దేశంలో ఎన్నో పార్టీలు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక పునాదుల మీద నిర్మించబడ్డాయి. వాటిలో చాలా వరకు మళ్ళీ కాంగ్రెస్‌లోనే కలిసిపోయాయి, మరికొన్ని కాంగ్రెస్ తోనే మళ్లీ అంట కాగుతున్నాయి. దానికి కారణం- కాంగ్రెస్‌కి అందరూ వ్యతిరేకమే కాని , కాంగ్రెస్ మాత్రం ఏ పార్టీ కి వ్యతిరేకం కాదు. అందుకే ఎంతమంది తమని తిట్టినా అన్నీ మర్చిపోయి తమలో ఇము డ్చుకోగలిగినంత విశాలమైన హృదయం దానిది. కానీ, 35 ఏళ్ల పాటు కాంగ్రెస్‌కి ఎదురు నిలబడ్డ పార్టీ తెదేపా మాత్రమే. అన్నిటి మించి ఇప్పుడు సుసుప్తావస్థ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కి చంద్రబాబు తెదేపా రూపంలో ఆక్సిజన్ అందించారు. భాజపా వ్యతిరేక శక్తులన్నిటినీ ఏకం చేసి ‘సేవ్ ది నేషన్’ అనే మంచి ఉద్దేశంతో నిర్వీర్యమైపోతున్న ఈ దేశ వ్యవస్థల్ని గాడిలో పెట్టటానికి భాజపా వ్యతిరేకులంతా ఒక్కటి కావాలనే ఉద్దేశంతో మొదటి అడుగు వేసిన చంద్రబాబుతో మరెంతమందో అడుగులు వేసే రోజు ఇంకెంతో దూరంలో లేదు.
ఒక వేళ కేవలం ప్రాంతీయ పార్టీలన్నీ ఫ్రంట్ కట్టినా అందరూ ఏక గ్రీవంగా ఒప్పుకునే ప్రధాని అభ్యర్థి చంద్రబాబు మాత్రమే అన్న అభిప్రాయం ఉంది. ‘మీరు ప్రధాని కావాలి..’ అని కొందరు అడిగినా, ఈ పరిస్థితుల్లో రాష్టమ్రే ముఖ్యం అని ఆయన ఒక్క మాటలో తేల్చేశారు. కాబట్టి మూడో ఫ్రంట్ ప్రధాని అభ్యర్థి చంద్రబాబు అనేది అసంభవం. ఈ ఒక్క కారణం వల్లనే ఏదో ఒక జాతీయ పార్టీ లేకుండా మూడో ఫ్రంట్ అనేది అసాధ్యం అని తెలుస్తుంది. 2019 లో మోదీ అనుకూలురు, మోదీ వ్యతిరేకుల మధ్య జరిగే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ మాత్రమే. ఈ సమయంలో తెదేపా మద్దతు లేకుండా కేంద్రంలో కాంగ్రెస్ కూటమి విజయం సాధించటం అసాధ్యం. ఆ కలయిక అసంభవం కాదని కొద్ది రోజులుగా మేధావుల్లో నలుగుతున్న చర్చ. ఆ చర్చకి రాహుల్ గాంధీని కలవటం ద్వారా చంద్రబాబు ముగింపు ఇచ్చారు. ఈ మధ్య మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్‌లో తిరిగి చేరినపుడు కూడా- ‘మన టార్గెట్ జగన్ మాత్రమే’ అని రాహుల్ గాంధీ చెప్పటం ద్వారా తాము తెదేపాకి అనుకూలమనే సంకేతాన్నిచ్చారు. వ్యక్తిగతంగా చంద్రబాబు అంటే రాహుల్‌కి ఎంతో గౌరవం. రాజకీయంగా కూడా ఎప్పుడూ బాబుని ఆయన విమర్శించిన దాఖలాల్లేవు.
ఇక, ఏపీ విషయానికొస్తే 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ని గెలిపించాలన్న ఉద్దేశం లేకున్నా అప్పటికి పదేళ్ల పాటు అధికారంలో ఉన్న తెదేపాపై వ్యతిరేకతతో ప్రజలు ఓట్లేశారు. మళ్ళీ 2014లో ఏపీకి చేసిన ద్రోహానికి ప్రతీకారంగా కాంగ్రెస్‌ని ఓడించాలనే కసితో జనం తెదేపాకి ఓట్లేశారు. చంద్రబాబు అధికారంలోకి రావాలనే ఆశ కంటే కాంగ్రెస్ మీదున్న కోపాన్ని తీర్చుకోవాలని తటస్థులంతా ఓట్లు వేసిన ఎన్నికలు అవి. ప్రజల భావోద్వేగాలను ఏ మాత్రం ఖాతరు చెయ్యకుండా కాంగ్రెస్ వారు రాష్ట్రాన్ని విభజించేశారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు , శాశ్వత శత్రువులు ఉండరు అనేది పార్టీల మధ్య తరచూ వినిపించే మాట. అలాగే ప్రజలకి కూడా కలకాలం ఏ పార్టీ కూడా శాశ్వత శత్రువు కాదు.
మొన్నటి వరకు కనీసం ఆంధ్రలో కొనఊపిరి కూడా లేని కాంగ్రెస్ మళ్ళీ బతికి బట్టకడుతుందని ఎవరికీ ఆశల్లేవు. కానీ కాంగ్రెస్ కి ఇదేమి కొత్త కాదు, నూట పాతికేళ్ల పార్టీ ఇలాంటివెన్నో చూసింది. ఆంధ్రలో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఆ పార్టీ కి తెలుసు, మనకి కూడా తెలుసు. కానీ మనకి తెలియనిది, కాంగ్రెస్ పార్టీకి తెలిసింది ఏంటంటే కొనే్నళ్ల తర్వాత పరిస్థితులు మారతాయని, ప్రజల మనోభావాలెప్పుడూ ఒకేలా ఉండవని. కాకపోతే అవి ఇంత త్వరగా మారతాయని వారు కూడా అనుకోలేదు. ఇది కచ్చితంగా మోదీ పుణ్యమే. ఒకప్పుడు రాహుల్ గాంధీని ‘పప్పు’ అనుకునే వారంతా- ఇపుడు ఆయన పట్ల స్వరం మార్చారు. రాహుల్ తెలివిగల వాడు కాకపోయినా మోదీ లాంటివాడు మాత్రం కాదు అనే భావన వచ్చింది. ఇది కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో మాత్రమే కాదు- తెదేపా శ్రేణుల్లోనూ, సామాన్యుల్లోనూ కలుగుతున్న ఆలోచన. విభజన వల్ల కలిగిన గాయాలు కేవలం ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వానికే ఇబ్బందిగా పరిణ మించాయి తప్ప, ఆంధ్రలో వివసించే సామాన్యుడికి కాదు.
ఒకరకంగా చెప్పాలంటే కాంగ్రెస్ చేసిన విభజన వల్ల తెలంగాణ కంటే ఆంధ్ర కే ఎక్కువ మేలు జరిగింది. ఒకప్పుడు అసలు యువకులే కనిపించని పల్లెటూర్లన్నీ ఇప్పుడు కళ కళ లాడుతున్నాయి. కేవలం హైద్రాబాదులోనే పెట్టుబడి పెట్టే ఎన్‌ఆర్‌ఐలు అంతా ఇపుడు తమ పెట్టుబడుల్ని అమరావతికి, తాము జన్మించిన గ్రామాలకి , టూ టైర్ పట్టణాలకు మార్చారు. సొంత ప్రాంతం అంటే ప్రేమ పెరిగింది. ఒకప్పుడు ఆంధ్రలో 50 శాతం కూడా ఆక్యుపెన్సీ లేని ఇంజినీరింగ్ కళాశాలలన్నీ స్థానిక విద్యార్థులతో నిండిపోతున్నాయి. చదువుకున్న వాళ్ళకి వ్యవసాయం అన్నా, పండు గలన్నా ఇంతకుముందు కంటే ఇప్పుడు ప్రేమ పెరిగింది. విమానాల రాకపోకలు పెరిగాయి. ఒకప్పుడు హైద్రాబాదులో ఉద్యోగం చేస్తేనే సొంత వూరిలో విలువ ఇచ్చేవారు. ఇప్పుడు సొంత ప్రాంతంలో ఉద్యోగం అంటే గౌరవం. ఎక్కడ పనిచేస్తున్నావ్ అంటే ఏ శ్రీసిటీ లోనో , మంగళగిరి ఐటీ పార్కులో అని చెప్పే కుర్రకారు పెరిగారు. భూముల ధరలు ఆకాశాన్నంటాయి. బెజవాడలో దొరకని వస్తువు లేదంటే నమ్మగలమా? ఇవన్నీ విభజన వల్ల జరిగిన మేళలు. ఇవన్నీ ఆలోచించినప్పుడు కేంద్రంలో రాహుల్‌ని ప్రధాని అభ్యర్థిగా ఎందుకు సమర్ధించకూడదనే ఆలోచన చాలామందిలో ఇప్పుడిప్పుడే బలపడుతోంది.
తాము అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రం ఇస్తాం అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, తాను చెప్పినట్లుగానే ఇచ్చింది. అలాగే- తాము అధికారంలోకి వస్తే ఆంధ్రకి ప్రత్యేక హోదా ఇస్తాం అని చెప్పిన మాటని మనం ఎందుకు విశ్వసించకూడదు? ఆంధ్రకి అన్యాయం చేశామనే పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న పార్టీ ఇంకా ఎక్కువ కమిట్మెంట్‌తో ఉంటుందని మనం ఎందుకు నమ్మకూడదనేది ఇప్పుడిప్పుడే ఆంధ్రుల మదిలో పురుడుపోసుకుంటున్న ఆలోచన. అదీ కాకుండా భాజపా చేసిన ద్రోహానికి కడుపు రగిలిపోతున్న ఆంధ్రులంతా ఇపుడు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే చంద్రబాబు వారి ఆశలకి అనుగుణంగా అడుగులు కదిపారు. తన స్థాయి ఏమిటో రాష్ట్రంలో ప్రత్యర్దులకి మరొక్కసారి తెలిసేట్లు చేశారు. 20 ఏళ్ల క్రితం చంద్రబాబు అంటే ఏమిటో ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న కొత్తవారికి తెలియకపోవచ్చు. ఇప్పుడు కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారు అసలు అప్పటికి పుట్టి ఉండకపోవచ్చు. ఏది ఏమైనా భారత దేశ రాజకీయాల్లో ఇదొక సంచలన కలయిక. ఎవరూ ఊహించని కలయిక. అవును మరి, చంద్రబాబు అన్నట్లు ఇది- రాజకీయ అనివార్యత.

-రాజేశ్ వేమూరి vemuriexpress@gmail.com