సబ్ ఫీచర్

ఓషో బోధ -- నిస్వార్థంగా ప్రేమించడమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓషో నవజీవన మార్గదర్శకాలు
అనువాదం: భరత్
============

ఎన్ని సంవత్సరాలైనా మీరు వారితో అలాగే ప్రవర్తించేలా వారు మిమ్మల్ని నిబద్ధీకరిస్తారు. యుగయుగాలుగా అలాగే జరిగింది. కానీ, స్నేహితులను ఎంచుకునేందుకు మీరు ఎలాంటి జాగ్రత్తలు పాటించక్కర్లేదు. ఎందుకంటే, శత్రువుల ప్రభావం మీపై ఉన్నంతగా స్నేహితుల ప్రభావం మీపై ఉండదు.
రష్యా సామ్యవాద విప్లవం 1917లో జరిగింది. అంతకుముందు రష్యాను పాలించిన చక్రవర్తులందరిలోకి అతి ప్రమాదకరమైన చక్రవర్తి జోసఫ్ స్టాలిన్. ఎందుకంటే, జీవితమంతా నియంతలతో జరిపిన నిరంతర పోరాటాల నుంచి నేర్చుకున్న అనేక యుద్ధ తంత్రాలతో నియంతలందరినీ జయించిన అధికార మదంతో అతను అందరికంటె అతి ప్రమాదకరమైన నియంతగా మారాడు. లేకపోతే, అంతమంది నియంతలను జయించడం అతనికి సాధ్యమయ్యేది కాదు. జోసఫ్ స్టాలిన్ ఒక్కడే అంతకుముందున్న నియంతలందరూ కలిసి చేసిన మారణహోమంకన్నా ఎక్కువ చేశాడు.
లెనిన్‌ను విప్లవ నాయకునిగా అనుమానించిన జోసఫ్ స్టాలిన్ మందు పేరుచెప్పి అతనికి విషప్రయోగం చేయించాడు. లెనిన్ బతికుంటే జోసఫ్ స్టలిన్ మూడవ స్థానంలో ఉండేవాడు. రెండవ స్థానంలో ఉన్న వ్యక్తి ‘లియోన్ ట్రోటస్కీ’. అందుకే ముందు లెనిన్‌ను, తరువాత లియోన్ ట్రోటస్కీని అంతమొందించి అధికారాన్ని చేజిక్కించుకున్నాడు జోసఫ్ స్టాలిన్. అలా తన దారికి అడ్డువచ్చిన అందరినీ అంతమొందించి ఎదురులేని నియంతగా ఎదిగాడు జోసఫ్ స్టాలిన్. ప్రపంచంలో జరిగిన విప్లవాలన్నింటిలో ఇలాగే జరిగింది.
ఎంతో అందమైన ప్రపంచం ఎందుకూ పనికిరాని అసమర్థుల చేతుల్లో ఉందని చెప్తున్నానంటే అర్థం వారితో మీరు పోరాడమని కాదు. దయచేసి వారితో చేతులు కలపకుండా ఉంటే చాలు.
నేను తిరుగుబాటును బోధిస్తానే కానీ, విప్లవాన్ని బోధించను. వాటి మధ్య తేడా చాలా ఉంది. విప్లవం రాజకీయం, తిరుగుబాటు ఆధ్యాత్మికం. విప్లవంలో మీకుమీరే ఒక సైనిక దళంగా మారి శత్రువులతో పోరాడతారు. తిరుగుబాటులో మీకు మీరే ఎవరికీ తలవంచని వీరునిగా మారి చెత్తనుంచి బయటపడతారు. అప్పుడు కనీసం మీరైనా ప్రకృతిని నాశనం చెయ్యరు. అలా చాలామంది చెత్తనుంచి బయటపడితే ప్రపంచం బాగుపడుతుంది. రాజకీయం ఏమాత్రం లేని అసలైన ఆధ్యాత్మిక విప్లవం అదే.
అలా అనేకమంది కుళ్ళిన పాత భావాలనుంచి తెగించి బయటపడి, అధికార రాజకీయాలకు, పరువు, ప్రతిష్టలకు ఆశపడకుండా, దురాశలకు దూరంగా ఉంటూ, పేరాశలు లేని ప్రేమికులుగా మారి, ఎవరి జీవితాన్నివారు జీవించగలిగితే సమస్యలన్నీ తొలగిపోయి ప్రపంచం పూర్తిగా బాగుపడుతుంది. అప్పుడు రాజకీయ నాయకుల అవసరం ఎవరికీ ఉండదు. అప్పుడు వారందరూ ఎవరికివారే అదృశ్యమవుతారు. లేకపోతే, మీరు వారితో పోరాడవలసి వస్తుంది. అప్పుడు మీరు కూడా వారిలా తయారవుతారు. దానివల్ల ప్రయోజనముండదు.
కాబట్టి, కుళ్ళిన పాత భావాలనుంచి తెగించి బయటపడి, ఎంతో విలువైన అతిచిన్న జీవితాన్ని అవకాశమున్నంత వరకు అందంగా మలచుకుని, ఆనందంగా వేడుక చేసుకుంటూ ఆస్వాదించండి. అంతేకానీ, ఆరాట, పోరాటాలకు జీవితాన్ని బలిచేయకండి.
రాజకీయ శక్తులను సృష్టించేందుకు నేనేమీ ప్రయత్నించట్లేదు. ఎందుకంటే, రాజకీయ విప్లవాలన్నీ ఘోరంగా విఫలమయ్యాయి. కేవలం గుడ్డివాళ్ళు మాత్రమే వారిని నమ్ముతారు. దార్శనికత ఉన్నవారు మీకు ఎంతోకొంత కొత్తది బోధిస్తారు. నేను చేస్తున్నది అదే. గతంలో అది చాలాకొద్దిగా జరిగింది. ఇప్పుడు మనం దానిని పెద్దఎత్తున చెయ్యాలి. అనేక లక్షల మంది కుళ్ళిన పాత భావాల చెత్తనుంచి బయటపడాలి. అంటే సమాజాన్ని వదిలి కొండలపై జీవించాలని కాదు. మీరు దురాశలకు, పేరాశలకు లోనుకాకుండా, ఎవరినీ ద్వేషించకుండా, అందరినీ ప్రేమిస్తూ, అందరిచేత ప్రేమించబడుతూ సమాజంలో జీవిస్తూనే, ఎవరూ లేనివారుగా జీవించండి. అప్పుడే మీరు అందరితో ఆనందాన్ని పంచుకుంటూ వేడుక చేసుకోగలరు, ఆ పరవశాన్ని అందరికీ పంచగలరు. జరిగిందేదో జరిగింది. ఇప్పుడు మనం సంగీతంతో, నాట్యంతో, ధ్యానంతో, ఆటపాటలతో వేడుక చేసుకుంటూ మొత్తం ప్రపంచాన్ని మార్చాలి. ఆ పని మనం చెయ్యగలం.

--ఇంకావుంది...