సబ్ ఫీచర్

అంతరించిన అసలు చదువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కకన్యాశుల్కం నాటకంలో కరటక శాస్ర్తీ శిష్యునికి పాఠం చెబుతూ చదువన్నది ఎందుకు? అని ప్రశ్నించగా పొట్టపోసుకునేందుకు అని జవాబు చెప్పి తన సంస్కృత చదువు నిష్ప్రయోచనమైనదని ఇంగ్లీషు చదువు ఘనమైనదని అంటాడు. సుమారు వంద ఏళ్ల క్రితమే చదువుయొక్క ధ్యేయం ఇలా వివరింపబడింది. అదే అభిప్రాయం నేడు ఇంకా బలపడిపోయింది. చదువుకి కొలబద్దలు డిగ్రీలు. నేటి విద్యాలయాలలో చదువులు పరీక్షల నిర్వహణ ఒక ప్రహసనంగా మారాయి. మాస్ కాపీయింగులు పేపరు లీకేజీలు దొంగ సర్ట్ఫికెట్లు మితిమీరిపోయాయి. ఇటీవల ద్రవిడియన్ విశ్వవిద్యాలయం వారిచే ఈయబడిన ఎంఫిల్ మరియు పిహెచ్‌డి పట్టాల విషయంలో అక్రమాలు జరిగాయి. దానిపై సిఐటి విచారణకు ఆదేశాలీయబడినాయి. చదువు ఎంత పతనావస్థకు చేరిందో ఈ ఒక్క ఉదాహరణ చాలును.
వివిధ విశ్వవిద్యాలయాల తాలూకు డిగ్రీలు తయారుచేసి విక్రయిస్తున్నారు. ఏది నిజమైనదో ఏది బూటకమో ఎలా తెలుస్తుంది? వీటిని తయారుచేసిన వారికి కొన్నవారికి శిక్షలుండవు. వీటి ద్వారా కొందరు ప్రమోషన్లు పొం దారు. కొందరు ఉద్యోగాలు సంపాదించారు. ఇప్పుడు ప్రతి కోర్సుకి ప్రవేశపరీక్షలు మితిమీరిపోతున్నాయి. ఈ పరీక్షలు ఎందుకు? మొదటిది విశ్వవిద్యాలయాలు ఇచ్చిన డిగ్రీలపై నమ్మకం లేకపోవడం. రెండవది వడబోతకు. నేను ఏం చదువుతే మీకెందుకు? అటువంటప్పుడు మీరు పెట్టిన ప్రవేశపరీక్ష వ్రాస్తాను అని ఎవరైనా కోరితే ఎందుకు అంగీకరించరు? అంగీకరించాల్సిందే. నేటి న్యాయస్థానాలు హైందవ సనాతన ఆచారాలు మార్చమని ఆజ్ఞాపిస్తాయి. ఏ చదువు ఎవరు ఎలా చెప్పాలో నిర్ణయిస్తాయి. ఏ పరీక్షలు ఏ విధంగా నిర్వహించాలో ఆజ్ఞలు ఇస్తాయి. ఇటీవల ప్రకాశం బ్యారేజిపై బరువైన వాహనాలను పోనీయరాదని ఒకరు వ్యాజ్యం వేశారుట. ఈ విషయం ఇంజనీర్లు చెప్పాలా? న్యాయమూర్తులు చెప్పాలా? చదువు అంటే ఇప్పుడు ప్రచారమయం అయిపోయింది. ఈ ప్రచారం ప్రైవేటు విద్యాసంస్థలు విపరీతంగా చేస్తున్నాయి. ఎవరు ఎన్నిమార్కులు పొంది ఉత్తీర్ణులయినది ఫొటోలతో సహా ప్రకటిస్తాయి. వీరందరికి దాదాపు తొంభై శాతం మార్కులుంటాయి. ఇది ఒక మార్కుల మాయాజాలం. ఇన్ని మార్కులు ఎలా వస్తాయి? పరీక్షా ఫలితాలు వెలువడగానే ఆత్మహత్యల ప్రకరణం ప్రారంభమవుతుంది. చదువు పేరుతో ఆత్మహత్యలా? ఎంత దారుణం. పరీక్షలో ఫెయిల్ అవుతాము అనే భయంతో కొందరు ముందే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మన సంప్రదాయ విద్యావిధానంలో ఫెయిల్ అనే మాట లేదు. ఆనాటి విద్యార్థి ధ్యేయం తాను ఎన్నుకున్న విద్యను కూలంకషంగా అధ్యయనం చేయడమే. అది ఏదో శాస్త్రం కావచ్చు. సంగీతం కావచ్చు వైద్యం కావచ్చు శిల్పంకావచ్చు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఐఎఎస్ మరియు ఐపిఎస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీటికి ప్రత్యేక కోచింగులు ఉంటాయి. ఇవి పెద్దపెద్ద పట్టణవాసులకే అందుబాటులో ఉంటాయి. ఈ పరీక్షా ఫలితాలు ర్యాంకులు వివిధ ప్రచార సాధనాలు ప్రకటిస్తాయి. ఇలాంటి అవకాశాలు తమ పిల్లలకు రావడం లేదని కొందరు తల్లిదండ్రులు వ్యధ చెందుతారు.
ఈ పరీక్షలలో యక్ష ప్రశ్నల మాదిరి ప్రశ్నలుంటాయి. వాటి జవాబులకి అభ్యర్థి చేయబోయే ఉద్యోగానికి సంబంధం ఉండదు. ఎన్నిక చేయడానికి ఏదో ఒక కొలబద్ద ఉండాలి గదా. అందుకే ఈ పరీక్షలు. ఐఎఎస్ సాధించిన వారిచే గ్రామ కరణం స్థాయినుండి కలెక్టరు ఆఫీసు వరకు జరిగే కార్యకలాపాలు పరిశీలింపజేస్తారు. అలాగే ఐపిఎస్ సాధించిన వారిచే ఐస్‌ఐ స్థాయి నుండి జిల్లా స్థాయివరకు గల ఆఫీసు వ్యవహారాలు పరిశీలింపజేస్తారు. అనంతరం వారు ఉద్యోగం ప్రారంభిస్తారు. ఇలాటి ఉద్యోగాలకి విశేషమైన అనుభవం అవసరం. అనుభవంగల వారు క్రింది స్థాయి ఉద్యోగానికే పరిమితమైపోతున్నారు.
ఇప్పుడు ఏ వృత్తిలో ప్రవేశిస్తే లాభం ఉంటుందో దానిలో ప్రవేశిస్తున్నారు. కుల వృత్తులు అంతరించిపోయాయి. రానురాను విద్యకోసం శ్రద్ధ చూపేవారి సంఖ్య తగ్గిపోతోంది. అన్నిరకాల ఉద్యోగాలకి ఇప్పుడు ప్రవేశపరీక్షలుంటున్నాయి గనుక కోచింగ్ సెంటర్లు ఎక్కువయినాయి. యువత దృష్టి ఎల్లవేళల మంచి ఉద్యోగాల వైపే ఉంటుంది. ఇంగ్లీషులో వీటిని వైట్‌కాలర్ జాబ్స్ అంటారు. అనగా ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ రంగాలలో గల ఇతర ఉద్యోగాలు. వీటికి ఇబ్బడిముబ్బడిగా రాయితీలుంటాయి. ఉద్యోగ భద్రత ఉంటుంది. ఉద్యోగి మరణిస్తే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం. దానితోపాటు భార్యకు పెన్షన్ లభిస్తాయి. అందువలననే నేడు రిజర్వేషన్ పోరాటాలు దినదినాభివృద్ధి చెందుతున్నాయి. ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించడానికి శిక్షణ ఇస్తున్నారు. ఉద్యోగం చేయడానికి ఈ శిక్షణ చాలదా? తిరిగి వారికి పరీక్షలెందుకు? ఈ శిక్షణపై నమ్మకం లేకపోవడం కాబోలు. వైద్య విద్యలో ప్రవేశించడానికి లక్షలాది రూపాయలు ఖర్చుచేస్తున్నారు. అందులో పోస్టుగ్రాడ్యుయేట్ సీటు సంపాదించడానికి ఇంకా ఖర్చవుతుంది. ఈ ఖర్చు ఎందుకు చేస్తున్నారు. ఇంకా ముందు సంపాదనకే కదా. ఇందులో స్పెషలిస్టులు ఉంటారు. వారి వైద్యం సామాన్యులకి అందుబాటులో ఉండదు. వైద్య విద్య పూర్తిచేసి వృత్తిలో ప్రవేశించే ముందు వారిచే ప్రతిజ్ఞ చేయిస్తారుట. ఆ ప్రతిజ్ఞ ప్రకారం వారివద్దకు వచ్చిన వ్యక్తికి ప్రతిఫలం ఆశించకుండా వైద్యం చేయాలి. ఆచరణలో ఇలా జరగడం లేదు.
ఏ విద్య అభ్యసించినా దానిపై శ్రద్ధ చూపాలి. కేవలం ధనార్జనే ప్రధానం కాదు. విద్యార్థులకు శీలం ఎంతో ప్రాధాన్యమైనది. నేటి చదువులు అన్నీ ధనంతో ముడిపడి ఉన్నాయి. వైద్యం మరియు విద్య వ్యాపారమై పోయినాయి. ఈ విధానం ఎంతో కొంత మారాలని ఆశిద్దాం. అందుకు ప్రభుత్వం విద్యావేత్తలు ఆలోచించి విద్యావిధానాన్ని సక్రమ మార్గంలో నడిపించే కృషిచేస్తారని కోరుకుందాం. చివరగా ఒక మాట. పదవ తరగతిలో మంచి మార్కులు వచ్చినవారికి కొన్నిచోట్ల ధనం బహుమతిగా ఈయబడుతుంది. ఈ విధానం మంచిది కాదు. నేటి విద్యావిధానంలో మార్కులు ర్యాంకులు బహుమానాలు మితిమిరిపోతున్నాయి. ఇవి రాని పిల్లల తలిదండ్రులు ఎంతో వ్యధ చెందుతున్నారు. విద్యార్థి తనకు నచ్చిన చదువు ఎంపిక చేసుకోవాలి. అప్పుడే దానిపై శ్రద్ధ కలుగుతుంది. పూర్వం ఐదోఫారంలో విద్యార్థి తనకిష్టమైన ఒక విషయం ఎంపిక చేసుకుని దానిని చదివేవారు. అదిపై చదువులకు ఉపయోగపడేది. ఆ విధానం పునరుద్ధరించడం మంచిది.

- వేదుల సత్యనారాయణ