సబ్ ఫీచర్

చలిని పోగొట్టే చక్కటి స్వెట్టర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలానికి తగ్గట్లుగా దుస్తులు ధరించాలి. ఎండాకాలంలో కాటన్ దుస్తులు, పలుచని దుస్తులు వేసుకోవడం ఉత్తమం. వేడి వాతావరణంలో దళసరి దుస్తులు ధరించినట్లయితే ఒంట్లో నుండి బయటికి పోవాల్సిన చెమటను ఆ దుస్తులు పీల్చేస్తాయి. పలుచటి దుస్తులు చెమటను పీల్చుకున్నప్పటికీ అవి తొందరగా ఎండిపోతాయి. దళసరి దుస్తులు చెమటను పీల్చుకొని దుర్వాసన వెదజల్లుతాయి. ఎండ వేళ నలుపు వస్త్రాలు చర్మంపై మంట పుట్టిస్తాయి. వర్షాకాలంలో పలుచటి వస్త్రాలు అయితేనే వానలో తడిసిపోయినప్పటికీ త్వరగా ఎండిపోతాయి. వర్షం పడే సమయంలో జర్కిన్‌లు వేసుకుంటే శరీరం తడిసిపోకుండా ఉంటుంది.
ఎముకలు కొరికే చలిలో దళసరి దుస్తులు మాత్రమే వేసుకుంటాము. చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకూ అన్ని వయసుల వారూ ధరించేందుకు నేడు పలురకాల స్వెట్టర్లు అందుబాటులో ఉన్నాయి. స్వెట్టర్లు మాత్రమే కాకుండా చేతులకు గ్లోవ్స్, తలకు మంకీ క్యాప్, ప్యాంట్లు, జర్కిన్లు, మఫ్లర్లు, ఉన్నితో చేసిన సాక్స్ వంటివి చలికాలంలో వాడుతుండాలి. చలిగాలులు శరీరాన్ని తాకుండా ఉన్ని దుస్తులు వెచ్చగా ఉంచుతాయి. స్వెట్టర్లను వేసుకుంటే శరీరంలో ఉష్ణోగ్రత తగ్గిపోకుండా ఉంటుంది. స్వెట్టర్లు, జర్కిన్లు, గ్లోవ్స్, శాలువలు వంటివి నేపాల్‌లో ఎక్కువగా తయారవుతాయి. ప్రతి సంవత్సరం చలికాలం ఆరంభానికి నెల రోజుల ముందునుండే వీటిని అన్ని ప్రాంతాలలోనూ విక్రయిస్తారు. ఆఫీసులకు, వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లేవారే కాదు, ఇంటిపట్టున ఉండే వృద్ధులు, గృహిణులు చలికాలంలో ఉన్ని దుస్తులను ధరించడం ఉత్తమం.

-శ్రీనివాస్ పర్వతాల 9490625431