సబ్ ఫీచర్

అభయ ‘హస్తం’ ఎందుకంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశం వేలాది కులాలు, సంస్కృతులు, మతాలు, విశ్వాసాలున్న నేల. అనేక భాషలు, వైవిధ్య భరితమైన వాతావరణం, సామాజిక పరిస్థితులున్న భూమి. మొదటి వలస పాలకులు ఆర్యుల నుండి ముస్లిం రాజులు, ఆంగ్లేయుల పాలనను అనుభవించిన ధరిత్రి. బ్రిటిష్ పాలన నుండి విముక్తమై ఏడు దశాబ్దాలుగా స్వపరిపాలన కొనసాగుతున్న దేశం. అనేక సమస్యలను, సవాళ్ళను ఎదుర్కొని అగ్రరాజ్యాలతో సమానంగా అభివృద్ధి దిశగా పయనించిన దేశం. కాని ఈ దేశంలో బహుళ సంఖ్యలో ఉన్న బహుజనులు మాత్రం పాలితులుగానే ఉంటున్నారు. అందుకే డా. బాబాసాహెబ్ అంబేద్కర్- ‘సవర్ణుల రాజ్యాధికారం బహుజనుల రాజ్యాధికారం కానే కాదు. సవర్ణుల అభివృద్ధే బహుజనుల అభివృద్ధి కాదు. ఈ దేశ మెజారిటీ ప్రజలైన బహుజనులకు రాజ్యాధికారం కావాలి’ అన్నాడు.
ప్రస్తుత 21వ శతాబ్ది బహుజనులది. ఇది బహుజన యుగం. భారతదేశంలో రాజకీయంగా నాలుగు ప్రధాన ధోరణులున్నాయి. ఒకటి మనువాద రాజకీయాలను మోస్తున్న భాజపా తతత్వ ధోరణిని పూర్తి రైటిస్ట్ రాజకీయాలు. కుప్పలు తెప్పలుగా పుట్టుకొచ్చిన ప్రాంతీయ పార్టీలన్నీ భారతీయ జనతాపార్టీకి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మద్దతునిస్తున్నాయి. ఈ పార్టీ పాలనకు సహకరిస్తున్నాయి. రెండవది పూర్తి లెఫ్టిస్ట్ వామపక్ష రాజకీయాల పార్టీలు. సాయుధ పోరాటం ద్వారా కాకుండా పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా సోషలిస్టు సమాజస్థాపన చేయాలనే పార్టీలు సీపీఎం, సీపీఐ లాంటివి. కమ్యూనిస్టు పార్టీలు అగ్రవర్ణ బ్రాహ్మణీయ కులాల ఆధిపత్యంలో ఉంటూ భాజపా లాగే బహుజన కులాల సామాజిక కోణాన్ని విస్మరిస్తున్నాయి. బి.జె.పి. మతవాదాన్ని, అయోధ్య లాంటి అప్రధాన విషయాలను, ప్రజల సెంటిమెంట్లను రెచ్చగొట్టి బహుజనుల ఓట్లను సంపాదించి మనువాద పాలనే కొనసాగిస్తోంది.
ఇక మూడవ విభాగానికి చెందిన పార్టీలు డి.ఎం.కె, ఎస్పీ, ఆర్.జె.డి. లాంటి సామాజిక నేపథ్యమున్న పార్టీలు. ఈ పార్టీలు సోషలిస్టుపార్టీ సిద్ధాంత బలంతో, నాన్ బ్రాహ్మన్ ద్రవిడ నేపథ్యంతో ఉద్భవించి ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి రాగలిగాయి. ఇవి కేవలం బిహార్, ఉత్తరప్రదేశ్, తమిళనాడులకే పరిమితమయ్యాయి. అక్కడ కూడా స్థిరంగా ఉండలేక బ్రాహ్మణీయ మనువాద పార్టీలకు స్థానం కల్పించాయి. ఇవి దేశవ్యాప్తంగా భారత రాజకీయాలను శాసించే స్థితిలోలేవు. కాన్షీరాం నిరంతర కృషి వల్ల పూర్తి బహుజనవాద సిద్ధాంతంతో బహుజన సమాజ్ పార్టీ వచ్చింది. బహుజనులకు రాజ్యాధికారం రావాల్సిన ఆవశ్యకతను దేశవ్యాప్తం చేయగలిగింది.
నాలుగవ విభాగానికి చెందిన పార్టీ కాంగ్రెస్. ఈ పార్టీ మధ్యేమార్గ ఉదారవాద పార్టీ. నెహ్రూ లాంటి సెమీ సోషలిస్టు, సెక్యులరిస్టు ఉదారవాద నాయకుల ఆధీనంలో, పాలనలో చాలాకాలం ఉండటంవల్ల భాజపా, ప్రాంతీయ పార్టీలు, కమ్యూనిస్టు పార్టీల్లా నూటికినూరు పాళ్ళు అగ్రవర్ణాల చేతుల్లోకి పోలేదు కాంగ్రెస్. నెహ్రూ కశ్మీర్ బ్రాహ్మణ కుటుంబం నుంచే వచ్చినా సోషలిస్టు రష్యా ప్రభావం, సెక్యులర్ భావ సంపద, ఉదారవాద ధోరణి అతన్ని కొంతవరకైనా బహుజనుల పక్షం వహించేటట్టు చేసింది. మతతత్వ ధోరణులను ఎదిరించేటట్టు చేసింది. అందువల్ల కాంగ్రెస్‌లో మిగతా పార్టీల్లోకంటె ఎక్కువగా బహుజన కులాల నుంచి నాయకులు ఎదిగారు. కాంగ్రెస్ అవలంబించిన ఉదార విధానాలు, ఇందిరా గాంధీ తీసుకున్న రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీరుూకరణ, గరీబీ హటావో నినాదం వంటివి దేశ మెజారిటీ ప్రజలకెంతో మేలు చేశాయి. కొన్ని రాష్ట్రాల్లో బి.సి, ఎస్సీలను, అణగారిన కులాలను నిర్ణాయక స్థానంలో ఉంచడం వల్ల మిగతా పార్టీల్లోకంటే మేలైన విధంగా బహుజన సమాజం కాంగ్రెస్ వల్ల ఎదిగింది. అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని ఆమోదించడంలోనూ, అంబేద్కర్ సూచించిన అశోక్‌ధర్మ చక్రాన్ని జాతీయ జెండాలో పొందుపరచడంలోనూ నెహ్రూ, కాంగ్రెస్ మద్దతు ఉంది. కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లకు, రాజ్యాంగానికి అనుకూలమైతే బి.జె.పి లాంటి మతతత్వ పార్టీలు వాటికి వ్యతిరేకం.
స్వాతంత్య్రానంతర కాలంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రథమస్థానం లోనూ, కమ్యూనిస్టు పార్టీ ద్వితీయస్థానం లోనూ ఉండేవి. క్రమక్రమంగా బహుజన శక్తులతోపాటు మనువాద భాజపా ఎదిగింది. బాబ్రీ విధ్వంసం, రామమందిర జపం, అద్వానీ రథయాత్రలో భాజపా వాజపేయి నాయకత్వంలో మొదటిసారిగా అధికారంలోకి రాగలిగింది. 1998 నుంచి ఆరేళ్ళపాటు దేశాన్ని పాలించింది. ‘అంతర్లీన’ హిందుత్వ ఎజెండాతో, పొరుగు దేశాలతో యుద్ధ్భయంతో, నూతన ఆర్థికవిధానాల పేరుమీద లక్షలాది మంది ఉద్యోగులను తొలగించారు.
2004లో ఓడిపోయి 2014లో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీసీ కార్డును ముందుబెట్టి భాజపా అధికార పగ్గాలను చేపట్టింది. ఇప్పుడు పూర్తి హిందుత్వ ఎజెండాతో దూసుకుపోతోంది. దళితుల, మైనారిటీ, ప్రగతిశీల శక్తులపై దాడులు, విద్యను కాషారుూకరించడం, దేశాన్ని హిందుత్వ దేశంగా మారుస్తామన్న ప్రకటనలు, వ్యాపం, రాఫెల్ కుంభకోణాలు తప్ప చేసిందేమీ లేదు. నోట్ల రద్దు, జీఎస్టీ, నల్లధనాన్ని బయటకుతీయకపోగా నల్ల కుబేరులకు ఉపయోగపడింది. రాజ్యాంగ సమీక్ష పేరుమీద అంబేద్కర్ రాజ్యాంగానికి బదులు మనువర్ణ శాస్త్రాన్ని అమలుచేసే కుట్ర కొనసాగుతోంది. కేంద్రంలో బి.జె.పి, తెలంగాణలో టీఆర్‌ఎస్ మళ్ళీ గెలిస్తే ఈ దేశంలో, తెలంగాణ రాష్ట్రంలో దళిత, బహుజనుల పరిస్థితి అధోగతే. దేశం, రాష్ట్రం మధ్యయుగం నాటి చీకటి రోజుల్లోకి వెళ్ళాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో అటు బి.జె.పి.ని, ఇటు టీఆర్‌ఎస్‌ను ఓడించడం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం చారిత్రక అవసరం. అయితే- ఆ శక్తిఉన్న పార్టీ ఏది? ఆ మనువాద పార్టీలనోడించి బహుజన ప్రజలకు అండగా నిలబడగలిగే స్థాయిగల పార్టీ ఏది? మనువాద పార్టీలు మళ్ళీగెలిస్తే దళిత బహుజన శక్తులను మరింత బలహీనపరిచి బానిసలుగా మార్చే ప్రమాదముంది.
గత నాలుగున్నరేళ్ళ బి.జె.పి, టిఆర్‌ఎస్ పాలన ఈ విషయాన్ని రుజువుచేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్కో రాష్ట్రానికే పరిమితమైన, బి.జె.పి ఎత్తుగడలతో బలహీనపడిన బహుజన, సామాజిక పార్టీలు బి.జె.పి, టిఆర్‌ఎస్‌లను ఓడించగలవా? కొన్ని ప్రాంతాలకే పరిమితమైన బహుజన, సామాజిక పార్టీలు ఎలాగైనాసరే ప్రధానమంత్రి కావాలనుకోవడం అత్యాశే కదా! అందువల్ల బి.జె.పి, టిఆర్‌ఎస్ లాంటి నిరంకుశ, మతతత్వ, మనువాద పార్టీలనోడించడానికి ఆ పార్టీలు దేశవ్యాప్తంగా వ్యాపించివున్న కాంగ్రెస్‌తో మహాకూటమిగా ఏర్పడటమే మంచిది. బి.జె.పి.ని నిలువరించి ఓడించగల సత్తా ప్రస్తుతానికి ఒక్క కాంగ్రెస్‌కే ఉంది.
రాహుల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన తర్వాత దేశమంతటా పర్యటిస్తూ బి.జె.పి. వైఫల్యాలను ఎండగడుతున్నాడు. దేశ ప్రధాని అయ్యే అన్ని అర్హతలు రాహుల్‌కున్నాయి. తెలంగాణను పాలించగల సామర్థ్యం, హక్కు కాంగ్రెస్‌కున్నాయి. రాహుల్ గాని, కాంగ్రెస్ కాని బహుజన, సామాజిక శక్తుల, ప్రజాస్వామిక ప్రాంతీయ పార్టీల, అవసరమయితే కమ్యూనిస్టులతో పొత్తుపెట్టుకోవాలి. మనువాద, నిరంకుశ శక్తులను చిత్తు చేయాలి. ఆయా పార్టీల పొత్తులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఇదివరకటిలాగే బహుజన, సామాజిక, ప్రగతిశీలశక్తులు ఎదుగుతాయి. ఎదిగే అవకాశమూ ఉంది. లేకుంటే మనువాద శక్తులు మరీ విజృంభించి అన్ని పార్టీలనూ భూస్థాపితం చేసే ప్రమాదముంది. ఈ ప్రమాదాలన్నింటినీ నిలువరించి ప్రజాస్వామ్యాన్ని, దేశ సార్వభౌమత్వాన్ని నిలబెట్టడానికే కాంగ్రెస్ విజయం దోహదపడుతుంది.

-- డా. కాలువ మల్లయ్య 91829 18567