సబ్ ఫీచర్

పుట్టగానే పెళ్లి నిశ్చయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశంలో ఒకప్పుడు బాల్యవివాహాలు మా మూలే. పిల్లలు చిన్న వయస్సులో ఉండగానే వారికి పెళ్లిళ్లు చేసేసేవాళ్లు. ఇప్పటికీ కొన్నిచోట్ల బాల్యవివాహాలు జరుగుతూనే ఉన్నాయనుకోండి.. అది వేరే విషయం! మరికొంతమంది అయితే ఆడపిల్ల పుట్టగానే పెళ్లి నిశ్చయించేవారు. కానీ ఇప్పటి పరిస్థితులు వేరు. యువత మేజర్లు అయిన తరువాత ఎవరికి నచ్చినవాళ్లను వారు పెళ్లి చేసుకునే ఆధునిక యుగం ఇది. కానీ కెన్యాలోని ఓ తెగలో ఇప్పటికీ బిడ్డ పుట్టగానే పెళ్లిళ్లు నిశ్చయించే సంప్రదాయం కొనసాగుతోంది. పైగా ఈ సంప్రదాయాన్ని పెద్దయ్యాక ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ అమ్మాయి తప్పకూడదు. ఈ సంప్రదాయం ఏంటో.. అసలు ఇలా ఎందుకు చేస్తారో వివరాల్లోకి వెళితే..
అది కెన్యాలోని ఒరోమో తెగ. ఇక్కడి ప్రజలు బిడ్డ పుట్టగానే ఆ పాపకు పెళ్లి నిశ్చయం చేసేస్తారు. ఈ పద్ధతిని వారు 3దరారా2 సంప్రదాయంగా పిలుస్తారు. ఇలా పాపకు పెళ్లి నిశ్చయమైంది అనే తెలియజేయడానికి గుర్తుగా అబ్బాయి అంటే పెళ్లికొడుకు తండ్రి పాప చేతికి ఓ కంకణాన్ని కడతాడు. ఈ కంకణాన్ని కూడా దరారా అంటారు. ఇలా కడితే పాపకు పెళ్లి నిశ్చయమైందని, దరారాను చూసి ఆ పాపకు మరింకేం సంబంధాలు రావని అక్కడి తెగ ప్రజల నమ్మకం. ఒకవేళ పెద్దయ్యాక తల్లిదండ్రులకు ఏదైనా జరిగినా కూడా ఆ పాప ఈ సంప్రదాయానుసారంగా తల్లిదండ్రులు నిశ్చయించిన అబ్బాయినే పెళ్లిచేసుకోవాలి. బిడ్డ పెద్దయ్యేలోపల తమకు ఏదైనా జరిగితే బిడ్డ భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా ఉండదని తల్లిదండ్రులు నమ్ముతారు. బిడ్డకు పెళ్లి నిశ్చయమైన తరువాత తల్లిదండ్రులకు ఏదైనా జరిగితే ఆ బిడ్డ పెద్దయ్యాక, తెగ పెద్ద దగ్గరుండి తల్లిదండ్రులు నిశ్చయించిన అబ్బాయికే ఇచ్చి పెళ్లి చేస్తాడు. అందుకే తల్లిదండ్రులు బిడ్డ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇటువంటి పెళ్లిళ్లు చేస్తున్నాం అని చెబుతారు అక్కడి వారు.
చిన్నప్పుడే పెళ్లయిన పాప పెద్దయ్యాక కూడా తండ్రి మాటను జవదాటకూడదు. ఒకవేళ ఎవరైనా తండ్రి మాట కాదంటే వారికి పెద్ద పెద్ద శిక్షలు ఉంటాయి. ఎందుకంటే పిల్లలకు ఏది మంచిదో, ఏది కాదో తండ్రులకే కదా తెలుస్తుంది అని ఆ తెగ వారు చెబుతారు. తల్లి ఈ సంప్రదాయం విషయంలో నోరు మెదపదు. ఎందుకంటే కూతురు మేలును తండ్రి కోరుకుంటాడు కదా అని భర్తలను ఎంతగానో నమ్ముతారు అక్కడి ఆడవారు. అందుకే తమ బిడ్డ పెళ్లి విషయంలో వారు నోరు మెదపరు. కనీసం భర్త తమ బిడ్డను ఎవరి చేతిలో పెడుతున్నాడో కూడా అడగరు, వారి మాటకు ఎదురు చెప్పరు. చిన్నప్పుడే పెళ్లి నిశ్చయమైన వారిద్దరూ వయసుకు వచ్చాక దరారా కట్టిన మామ తమ కొడుకును తీసుకుని అమ్మాయి ఇంటికి వస్తాడు. అప్పుడు అబ్బాయి, అమ్మాయి అందచందాలను కానీ, వ్యక్తిత్వాన్ని కానీ చూడకుండా పెళ్లిచేసుకోవాల్సిందే.. అలాగే అమ్మాయి కూడా చేయాలి. పెళ్లివద్దని కానీ, ఆ అమ్మాయో లేదా అబ్బాయో నచ్చలేదని కానీ వారు పెద్దలను ఎదిరించకూడదు. అలా చేస్తే వారికి శిక్షలు ఉంటాయి. ఇలాంటివి జరగకూడదనే అబ్బాయి తల్లిదండ్రులు చిన్న వయసు నుంచే ఆ అబ్బాయికి నీ కాబోయే భార్య అక్కడుంది.. అని చెబుతూ పెంచుతారు. అలాగే అమ్మాయి తల్లిదండ్రులు కూడా నీ భర్త ఫలానా చోట ఉన్నాడు అని చెబుతూ పెంచుతారు. అలా వచ్చిన అబ్బాయికి, అమ్మాయిని ఇచ్చి పెళ్లిచేసి అత్తవారింటికి పంపుతారు ఆడపిల్ల తల్లిదండ్రులు.
కాలంతో పరుగులు పెడుతున్న నేటి ఆధునిక యుగంలో కూడా ఇలాంటి సంప్రదాయాలు ఇంకా కొనసాగుతున్నాయంటే ఆశ్చర్యం కలుగకమానదు.