సబ్ ఫీచర్

2.ఓలో ఐశూ..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోబోలో రజనీతో కనిపించి అలరించిన మాజీ ప్రపంచ సుందరి సీక్వెల్‌లోనూ మురిపిస్తుందనే అనుకున్నారు. కాకపోతే, సీన్లోకి అమీజాక్సన్ రావడంతో తరువాత ఆ విషయమే మరుగునపడింది. అయితే, సినిమా విడుదల దగ్గర పడుతున్న టైంలో మళ్లీ ఐశ్వర్య పేరు వినిపిస్తోంది. సీక్వెల్ ప్రాజెక్టులో లేకున్నా -స్క్రీన్ మీద ఐశూ కనిపించడం ఖాయమన్న కథనాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. పార్ట్ వన్‌లో సైంటిస్ట్ వశీకరణ్ (రజనీకాంత్) ప్రియురాలిగా కెమిస్ట్రీని పండించిన ఐశూని, రోబో చిట్టి కూడా లవ్ చేస్తుంది. పార్ట్ వన్‌లో చిధ్రమైపోయిన చిట్టి మళ్లీ ప్రాణం పోసుకుంది కనుక -ఆ బ్రెయిన్ వేవ్స్ సిగ్నల్స్‌లో ఐశూని చూపిస్తాడా? అన్న డౌట్లు తలెత్తుతున్నాయి. సో, ప్రాజెక్టులో ఐశూ లేకున్నా ఆమెను ఉద్దేశించి కొన్ని సన్నివేశాలు 2.ఓలో ఉంటాయన్నది బలంగా వినిపిస్తోన్న మాట.
అలా జరిగిందట: తాజాగా డైరెక్టర్ శంకర్ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. ‘మహాబలిపురం రోడ్డులో షూట్ నడుస్తోంది. ఓ సీన్‌కి షాట్ సిద్ధం చేసిన టైంలో -రజనీ మెట్లపైనుంచి పడిపోయారు. అలాగే సెట్స్‌కు వచ్చి సీన్ రెడీ కదా అంటూ తొందరపెట్టారు. విషయం తెలీని నేను ఆయనకు సీన్ వివరించా. ఆయన మేకప్ రూంకి వెళ్లిపోయారు. తరువాత తెలిసిన విషయం -మెట్లనుంచి రజనీ పడిపోయారని, మోకాలికి గాయమైందని. రజనీ మేనేజర్ చెప్పిన విషయంతో షాక్ తిన్నా. దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్దామన్న మా ప్రయత్నాలను ఆయన అడ్డుకున్నారు. మేంగట్టిగా పట్టుబట్టేసరికి ఒక్క షాట్ చేసి వెళ్దామన్నారు. హాస్పిటల్‌కి వెళ్లిన తరువాత మాకు అందిన వర్తమానం, గాయం పెద్దది కావడంతో నెలపాటు రజనీ విశ్రాంతి తీసుకోవాలని. కానీ రజనీ ఒప్పుకోలేదు. చిత్రీకరణవైపే మొగ్గు చూపించారు. నటిడిగా పనిపట్ల ఆయన నిబద్ధత అదీ’
బాహుబలి-2ని మించి...: దర్శకుడు జక్కన్న సృష్టించిన బాహుబలి అప్పట్లో పెద్ద సెనే్సషన్. బాహుబలని కట్టప్ప ఎందుకు చంపాడు? అన్న ప్రశ్నతో ఆసక్తి రేకెత్తించి పార్ట్-2పై విపరీతమైన అంచనాలు పెంచేసిన జక్కన్న -ఆ చిత్రాన్ని 6.5వేల థియేటర్లలో విడుదల చేసి కోట్లు రాబట్టాడు. అదో సూపర్ సెనే్సషన్. అయితే, ఆ రికార్డును తిరిగరాసేందుకు ఇప్పుడు శంకర్ ‘డిజిటల్’ వర్కౌట్స్ చేస్తున్నాడు.
త్రీడీ, ఫోర్డీ -కాంబినేషన్‌లో వస్తున్న 2.ఓ చిత్రాన్ని 6.8 వేల థియేటర్లలో విడుదల చేసేందుకు లైకా సంస్థ సన్నాహాలు చేసిందట. రికార్డులపరంగా బాహుబలిని మించే ఉద్దేశం ఒక్కపక్క అయితే, విడుదల నుంచే వసూళ్ల వర్షాన్ని కురిపించి క్యాష్ చేసుకునే యోచనలో ఉన్నట్టు సినిమావర్గాల అంచనా. ఓవర్సీస్‌లోనే 4వేల థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేసినట్టు చెబుతున్నారు.
ఇండియన్ కోసం..: ఈనెల 29న అందరూ 2.ఓ చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తుంటే.. దర్శకుడు శంకర్ మాత్రం నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెట్టాడు. ఆయన సీరియస్‌గా ఇండియన్ 2 పనుల్లో యమా బిజీగా ఉన్నాడని టాక్. ఇరవై ఏళ్ళ క్రితం వచ్చిన భారతీయుడుకి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రం స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయిందట. కమల్ ఇప్పుడు రాజకీయ పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఆ కోణంలోనూ ఆలోచించి శంకర్ కొన్ని కీలక మార్పులు చేసుకున్నట్టు సమాచారం. ఇకపోతే ఇందులో ఇంకాచాలా విశేషాలే ఉంటాయట. శంకర్ దీన్ని మలీస్టారర్‌గా మార్చే ఆలోచనలో ఉన్నాడట. ఇందుకోసం ఇప్పటికే శింబుతో చర్చలు జరిపినట్టు వినికిడి. నవాబ్‌లో అద్భుతమైన పెర్‌ఫార్మెన్స్ చూపపించిన శింబుపట్ల శంకర్ స్పెషల్ ఇంటరెస్ట్ చూపిస్తున్నాడు. అంతేకాదు ఫిమేల్ లీడ్ రోల్స్ కోసం నయనతార, కాజల్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయట.
అజయ్‌దేవ్‌గన్‌ను ప్రయత్నిస్తే కాల్‌షీట్ల సమస్యవల్ల నో చెప్పాడట. అందుకే అక్షయ్‌నే తీసుకునే ఆలోచన చేస్తున్నారట. సంగీత బాధ్యతలు ఎ.ఆర్.రెహమాన్‌కే అప్పగించబోతున్నారు. ప్రాజెక్టుకు లైకా సంస్థ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.