సబ్ ఫీచర్

మేధోపర అనుకరణ.. కాపీ రచన కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాత, వ్రాత, ఈ పదములలో ఏది ప్రమాణము? అని ప్రశ్నించిన కాలము గడిచిపోయింది. ‘రాత’కు ప్రమాణము అంగీకరింపబడింది. అయినా ‘వ్రాత’కు కూడ అలవాటుపోలేదు. అనుకరణ పదముకూడ కృత్రిమానుకరణ, సహజ అనుకరణగా కలిగించగల అర్థాన్ని, విజ్ఞత పరిశీలనలో కాపీరచన అన్నది ఎంగిలి పదముగ వికృతి. సాహిత్య పరిజ్ఞానములో రాతకు, వ్రాతకు చెరిగిపోయిన దూరములా ప్రతిభ, వ్యుత్పత్తి, పాండిత్యముగల రచన అనుకృతి అనిపించినా సహజ ప్రకృత కవినే చేస్తుంది.
కాగితము మీద పెట్టగలగడమన్నది ప్రతిభ. అప్పుడది విమర్శకావచ్చు. లేదా కవిత అయినాకావచ్చు. అపురూప రచనగ సాహిత్య ప్రయోజనము సాధించగలుగుతోంది. అపౌరుషేయ వేదములు మొదలు పురాణాది ప్రాచీన సాహిత్యము, లలిత కళలు, ఆధునిక రచనా వ్యాసంగముగ నవల, కథానిక, నాటకము మొదలైనవన్నీ వస్తువులుగా సృజనాత్మక సాహిత్యము కోవలోనికి చేరేవే. ప్రక్రియా రచనలుగా వాటి గొప్పతనాన్ని చెప్పగలిగేలా వంద శాతము మూసపోసిన పోలికగాకాక చదివింప జేయగల శక్తివంతమైన రచనలవి. స్వీయమే అయినా అనుకరణ స్వభావము కలిగిన విశ్వసాహిత్య విఖ్యాత రచయితలందరూ సమకాలీన కవులకు న్యూనత కలిగిస్తారనడం తప్పు. సృజనాత్మకతగల రచనలో సమాజహితము ప్రతిఫలిస్తుంది. సందేశమివ్వగల హితమును కవిహృదయము నిక్షిప్తపరుస్తుంది. ఏ భాషలోనయినా సృజనాత్మకతను, కవి హృదయమును గుర్తించి ఆవిష్కరించబడిన పరభాషా రచన ప్రసిద్ధమయినపుడు ఇతర భాషలలోకి అనువదింపబడ్డాయి. గీతాంజలి కావ్యము నోబెలు పురస్కారానికి కారణము సృజనాత్మకత రసాస్వాదనగ లోకానికందడము వలనే! విశ్వసాహిత్య కీర్తి పథ రచనా ప్రశంస నేర్చు అవసరము కనుకనే సమాజహిత అనుకరణ సాహిత్యములో అవసరముంటుంది. ఈ సృజనాత్మకతను చేరువచేయగల స్వీయ రచనలను చదివింప జేసుకోవాలన్న తపన రచయితలదని శిల్పకళతో ముడిపెట్టరాదు.. రచనా ప్రమాణాలకు కొలబద్ద ఇదీ అన్నది పాతకాలపు సాహిత్య చదువుకు మాత్రమే పరిమితముగ కొత్త పోకడలు నిలదొక్కుకున్నాయి. సృజనాత్మకతకు కొదువలేదు. ప్రతి రచయితా ఆశ్రయిస్తున్న 1. ఆర్థిక స్థోమత, 2. రాజకీయ పలుకుబడి 3. ప్రచురణకర్త తలచుకుంటే సాహిత్య రచనాప్రక్రియ వెలుగులోకి వస్తుంది. అందుచేత సమాజహితము పరముగా ఆలోచింపచేయగల ప్రయోజన సాహిత్యములో అనుకరణ ఉంటుంది. అనుసృజన రాణించిందని బిక్కి కృష్ణ తప్పించుకున్నారు. జ్ఞానపీఠ రచయితలుగా కల్పవృక్ష విశ్వనాథ, విశ్వంభర సినారె, పాకుడురాళ్ల రావూరి గొప్పవారే! వారుచేసిన ఇతర రచనలు పూలతో గూడిన దారముగ మెడలో ధరించే హారమువలె ప్రఖ్యాతి వహిస్తాయి. వాటి గొప్పవానికే ఉంటుందన్నది నిరూపించారు. కావ్య విమర్శచేయడానికి నీకేమి అర్హత అని ప్రశ్నించేవారిని కూడ అవసరమైతే నిరుత్తరులను చేయగల పరిజ్ఞానము ఆ రచయితలది.. పోతనది సహజ పాండిత్యము. ఆయన భాగవత రచన సంస్కృత భాగవతానుకరణమే. తెలుగు భావపరిమళ అదృష్టమునకు మురియాలి. తాపట్టిన కుందేటికి మూడేకాళ్ళులా భట్రాజు పొగడ్తో, లేదా అహంకార పూరిత, కువిమర్శ వ్యాప్తి పరిహరించుకోవాలి. లేకపోతే తెలుగు సాహిత్యములో స్వ, పరభాషా రచనానుకృతి ప్రియత్వములోని నిష్పక్షపాత ధోరణి అసహజమై అనుకరణకు తిట్టుకవి పుడతాడు.
ఆధునికాంధ్ర కవిత్వము గ్రంథములో నారాయణరెడ్డి పరిశోధనాత్మక గ్రంథములో చక్కగా వివరించారు. రాలిన ఆకులు స్థానములో క్రొత్త చిగుళ్ళు వచ్చినా అవికూడా రాలిపోక తప్పవు. చెట్టుమూలము మాత్రము నశించకూడదు. మార్పుకోరిన, మార్చుకోదగిన శైలికి కూడ ప్రాచీనత ప్రయోజనము అవసరపడిందని చెప్పినవాడే నిజమైన రచయిత. పాత వాసనలను నిర్దాక్షిణ్యముగా త్రోసివేయబడలేదన్న పరిశీలనాత్మక దృష్టి సహజత్వము, అనుకరణలు కవిసామర్థ్య గుర్తింపుగ కావ్యసృష్టి అనిపించుకున్నాయి. సహజత్వము, కృత్రిమ కల్పన కలిగినది అనుకరణ సాహిత్యములో ఉన్నపుడే కాదు, గొప్ప రచయితల నుంచి అనుకరణ ప్రేరణవలన కూడ మంచి రచనలు పుడతాయి. శైలికతీతముగ ఆధ్యాత్మిక ప్రయోజనమేకాదు, సభ్యసమాజములో అవి ఆదర్శమైన సందేశమివ్వగలగాలి. అందరూ శ్రీరామచంద్రుడు, భరతుని వంటి సోదరప్రేమ ప్రదర్శించకపోవచ్చు. కాని పేర్లుపెట్టుకుందుకు వెనుకాడరు. కైక, మంథరులను సమర్ధించే వారుండవచ్చు, లోకంలో వారిపేర్లు నామధేయముగా ఉన్నవారు అరుదు కాదు, అసలు ఉండకూడదన్నంతగా రామాయణ పాత్రలు ప్రభావితపరిచాయన్న విశే్లషణలు కథానుకరణలలలో సాహిత్యసృష్టి జరిగింది. ధర్మరాజు జూదమాడి ఉండవచ్చు. దుర్యోధనుడు చక్కని రాజుకాదని భారతము చెప్పలేదు. కాని స్ర్తిని వివస్త్ర చేయడము, విషాన్నము పెట్టడము, సజీవగృహదహనము వంటి గుణములు ఆతతాయివి. అవి పాలించే రాజుకున్నప్పుడు శిక్షార్హమేనని సమాజహితముగా పార్థసారధిగా భగవద్గీత అర్జునుని విజయుణ్ణిచేసి ప్రజాహిత రాజధర్మమును సాధించింది. ఆధ్యాత్మిక ప్రబోధమైంది. భారవి కిరాతార్జునీయము దుర్యోధనుడిని చక్కని రాజుగా విశే్లషించడము చూచి రాతగా ప్రచారము తగదు. వాక్యం రసాత్మకం కావ్యమ్. వాటికి అంగములు, ప్రత్యంగములు పేరిట రచయితకు మెరుగులు పెట్టించాలని సూచిస్తూ వెలువడిన గ్రంథములు విమర్శనా సాహిత్యమున రాజ్యమేలాయి. వాటి అవసరము ఇప్పుడూ కాదనలేము. అర్థతాత్పర్యములు, హృదయంగమ శైలి వంటివిగల వాల్మీకాదులను జనహృదయాలకు చేర్చగలిగినవారు నిజమైన విమర్శకులు. ఇప్పుడూ వారి అవసరముంది. అగ్గిపెట్టె, సబ్బుబిళ్ల, కుక్కపిల్ల వంటివి రచనావస్తువులు కావాలన్న సహృదయత అంగీకరించి మెప్పించగలగడము ముఖ్యము. గొప్పకవులు పుట్టారు. చెలామణి పదము వర్తించదు. ఆంధ్ర కవితాపితామహుడు అల్లసాని అల్లిక జిగిబిగి ఏమోగాని ‘‘నలినీ బాంధవ భానుతప్త రవికాంతస్యంద నీహార కందళ చూత్కార పరంపరల్ పయిపయిన్ మధ్యాహ్నముం దెల్పెడిన్..అని వ్రాస్తే, రాసుకున్న పాదలేపము కరిగిపోయిన మంచుప్రదేశములో రాయిని వేడెక్కించిన సూర్యోదయము ప్రశ్నార్థకమయింది. చుయ్, చూంయ్ చూత్కార పరంపరలు వినిపించిన పెద్దన మనుచరిత్ర పద్యమునకు విసుర్లు తప్పవు. ఎమితిని సెపితివి అని శ్రీశ్రీ అనలేకపోయినా ఛందస్సును సంకెలగా భావించి యముని మహిషపు లోహ ఘంటలు భయపెట్టాయన్న శబ్దాడంబరము కవితా ఓ కవితా! అనే నవకవితా వదులుకోలేకపోయింది. చెల్లియొ చెల్లకొ.. అంటూ రాగాలుపోయిన నాటకీయ జానపదము సామాన్యునిది. ఎలకజలమములోన ఎవరివోనంటి సిగ్గొచ్చి నవ్వింది సిలక నాయెంకి.. అన్న చదువుకున్న కవిదీ జానపద హృదయమే! కావాలి ఏటిలోని కెరటాలు ఏరువిడిచిపోవు అన్న సినీ జనగళం బాలమురళి సరిగమల స్వరసమ్రాట్టు కంకితము. అదివో అల్లదివో అని పరుగులుదీయిస్తున్న అన్నమయ్య, హరాదిగురుగుహ తోషితబింబం, హంసధ్వని భూషిత హేరంభం...అని వాతాపి ముత్తుస్వామి దీక్షితారు కీర్తిన... భాష కఠినతను చూడలేదు, సరళతను వద్దనలేదు. ఇవన్నీ పండిత, పామరజన హృదయానికి హత్తుకోబడిన సహృదయతతో నెరసులున్ననంటవు గంగనీటికెపుడు అనునట్లు కావ్యప్రయోజనములో అనుకరణను త్రోసిరాజనని వాడె నిజమైన కవి.
కావ్యము నీతి చెప్పకపోయినా పరవాలేదు. అవినీతి బోధించకూడదన్నది విమర్శకుడు గుర్తించి తీరాలి. అయితే బొంకాడి తప్పించుకున్న హంసవింశతి కథలలోకూడ పరపురుషుని పొందాలనే స్ర్తి ప్రయత్న విరమణ ప్రయత్న ప్రయోజనముందని అభినందించలేము. కాని ఇటీవలి కావ్య ప్రయోజనమై పరిశీలనార్హమవుతున్నాయి.
హంసవింసతిలో కథాసందర్భముగా చెప్పబడిన గ్రామీణ జీవన విధాన విజ్ఞాన సంస్కృతి విస్మరించరానిది. వీరేశలింగముగారు పఠనీయ గ్రంథముగ నిషిద్ధమన్నారు. జనమంచి శేషాద్రిశర్మ పండితుడి సంస్కరణ పీఠికల కావ్యముగ కవిప్రతిభను చాటింది. విశేషగుణములుగల సాహితీ రచనలు అనుకరణను కలిగినా సహజశైలితో లోకానికి అందజేయగలిగాయన్న తృప్తిని కాపీరాయుళ్ళ విఖ్యాతి అనడం కువిమర్శ అని నా అభిప్రాయము.

- డా. జొన్నలగడ్డ మార్కండేయులు