సబ్ ఫీచర్

శ్రీ సాయి దివ్య లీలా విలాసం - మహత్త్వ స్వరూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన ఋషులు భగవంతుడు సర్వాంతర్యామి అనే సత్యాన్ని దర్శించారు. జీవకోటితో సహా సమస్త వస్తుజాలము, ప్రకృతి అంతా భగవంతుని రచన అని, అది అంతర్యామి అనగా సర్వమును సృష్టించి పాలించే భగవంతునిచే వ్యాపించబడి ఉన్నదని ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఈ సిద్ధాంతాన్ని నిరూపించటానికి సరైన ఉదాహరణ శ్రీసాయియే. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి అవతారాలు దుష్టశిక్షణ చేస్తారు. దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి అవతారాలు భక్తులను ఆధ్యాత్మి విద్యనందించి ధర్మాన్ని రక్షిస్తారు. సదుర్గువులందరూ వీరి రూపాలే. వీరు పూర్ణ సిద్ధులుగానే అవతరించారు. సద్గురువును సేవించి తరించినట్లు చెప్పి భక్తులకు మార్గదర్శకులౌతారు. సర్వజీవుల శ్రేయస్సుకొరకు తనను తానే (అర్పించుకున్న) దత్తం చేసుకున్న సాయిబాబా కూడా తాను కేవలం ఒక పేద ఫకీరునని భగవంతుని సేవకుడననే చెప్పేవారు. తననాశ్రయించిన భక్తులకు వారు కల్పవృక్షం, కామధేనువు, చింతామణి అయ్యారు. సాయిబాబా నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారంగా అవతరించిన సద్గురువు. సర్వ ధర్మాలకు ఉత్తమ నిదర్శనముగా నిలిచిన సాయి ఏ మతానికి చెందరు. అన్నిమతాలకు చెందినవారు. హిందువులాయనను దత్తాత్రేయుడని, పరమ గురువని ఆరాధిస్తున్నారు. ముస్లింలు ఆయనను గొప్ప ఔలియాగాను, పీర్ - ఓ - ముర్షద్‌గా కీర్తిస్తున్నారు. ఎవరెలా భావించినా సాయి సకల దేవతా స్వరూపుడు. సర్వ ధర్మ స్వరూపుడు. ఎవరే రూపముతో ఆరాధిస్తే అలాగే దర్శనమిచ్చి అనుగ్రహిస్తారు శ్రీ సాయి సద్గురువు. ప్రజలు ఎలా నడుచుకోవాలో ఎలా నడుచుకోరాదో దాన్ని తాము ఆచరించి మార్గదర్శనం చేయటం ఆయన ప్రధాన కర్తవ్యం. నేటి మానవాళికి అత్యవసరమైన వినూత్న విశ్వ దృష్టిని సాయి నాధుడీ లోకానికి అందించారు. ఈ యుగానికి సాయిబాబా అవతారమనవచ్చు. 16 సం.ల బాలుడిగా షిరిడీలో ప్రకటమై 60 సంవత్సరాలు నివసించినా ఆయన పేరేమో, ఊరేమో, తల్లిదండ్రులెవరో, కుల గోత్రాలేమిటో, ఆయన గురించి వివరాలేవీ ఎవరూ చెప్పలేరు. దైవం వలె బాబా నామరహితుడు, సర్వగతమైన చైతన్యమే బాబా నిజతత్త్వమని భక్తులందరూ అనుభవపూర్వకముగా గుర్తించారు. ‘అఖండ విశ్వమే నేను’ అన్నారు బాబా. వారు స్వయంగా భగవంతుడేనని భక్తులెంత నమ్మి సేవించినా, ఏ విధమైన అధికారాన్ని తమపై ఆపాదించుకొనేవారు కాదు. ‘అల్లా భలా కరేగా’, భగవంతుడు మేలు చేస్తాడని ఆశీర్వదించేవారు. తాను అనల్ హక్ భగవంతుని సేవకుడనే అనేవారు. నిర్గుణ నిరాకార పరబ్రహ్మంయొక్క సగుణ, సాకార మూర్తి సాయిబాబా దేహంతో వుండగా అమోఘం, అద్భుతం, అనూహ్యమైన అమర లీలా విలాసాలు ప్రదర్శించారు.
బాబా ప్రతి చర్య ప్రతి మాటా ఆయన ప్రతి అడుగు సాయి చరిత్రలో కనిపించే ప్రతి ఒక్క సంఘటన జీవితాంతం గుర్తుంచుకుని అనుసరించవలసిన ఉపదేశంగా ఉంటుంది. గోధుమలు విసరటం, రోహిల్లా కథ, గౌలిబువా అనుభవం, కాక సాహెబ్ విఠల సాక్షాత్కారం, భగవంతరావు క్షీర సాగరుని కథ, దాసగుణ ప్రయాగ స్నానం, తంబూలీతో కుస్తీ, నీళ్లను నూనెగా మార్చటం, కపట గురువు జౌహర్ అలీ కథ, శ్రీరామనవమి ఉత్సవం, కుష్ఠురోగ భక్తుని సేవ, ప్లేగు వ్యాధి నివారణ, భిక్షాటన, విచిత్ర శయ్య పంచ భూతములపై ఆధిపత్యం మొదలైన అసంఖ్యాకమైన బాబా ఆ లీలలో కొన్నిటిని తెలుసుకుందాం.
బాబా పిలుపే తొలిమెట్టు
‘ఇచ్చట నేను ఉండగా నీకు భయమేల! నన్ను గనుము, వేగన్నుల నిను గందు, విడుము నీ బరువులు నాపై, నేను నిర్వహింతు, శ్రీతుని నేనెప్పుడు నుపేక్షింతునా?’
‘నాపై దృష్టి నిలుపు నీపై నా దృష్టి నిలుపుతాను’-బాబా ఈ మాట చాలా తాత్వికమైనది. బాబా సమత, మమతల ప్రతిరూపం. బాబా అనుగ్రహం ఆయనను పూజించే వారిపైనే కాదు అందరిపైన బాబా కటాక్షమనే అమృతధార వర్షిస్తూనే ఉంది. కానీ అజ్ఞానమనే గొడుగులో వున్న వారా అమృతధారను పొందలేరు. అనుగ్రహించడమే నా పని అన్నారు బాబా. సాయి దృష్టి మనపై ఉందన్న ఎరుకే మనను గురువై రక్షిస్తుంది. నిండు హృదయంతో నావైపు చూడు. నేనూ నీవైపు అల్లానే చూస్తాను. ఇది మసీదు కాదు, ద్వారవతి. ఎవరైతే ఈ మసీదులో కాలు పెడతారో వారి కష్టాలన్నీ తీరి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందుతారు. ముందు మనం ఆయన్ని పూజించటం వలన ఆయన కృపా దృష్టి ప్రసరిస్తోందనుకుంటాం. అది భ్రమ. ‘నా భక్తుని నేనే ఎన్నుకుంటాను’ అన్నారు బాబా. ఆయన కృపా కటాక్షం మనపై లేకపోతే మన దృష్టి ఆయనపై నిలపడమన్నది అసాధ్యం. మన దృష్టి బాబాపై నిలిపితే ఆయన దృష్టి ఎపుడు మనపైనే ఉందని గ్రహించగలం. సప్త ద్వీపాల కావల వున్న నా భక్తుని పిచ్చుక కాలికి తాడు కట్టినట్లు నా వద్దకు చేర్చుకుంటాను. ఈ విధంగా ఎందరినో బాబా తన సన్నిధికి చేరుకున్న ఉదంతాలు సాయి సచ్చరిత్రలో కనిపిస్తాయి. భక్త సాధనకు సంబంధించిన ఏ సందేహానికైనా శ్రద్ధగా వెతికితే సమాధానం బాబా మాటల్లో కనిపిస్తుంది. పరమ శ్రేయస్సును కలిగించే బాబా తత్త్వాన్ని గ్రహించి ఆరాధించినవారు ధన్యులు.
గమ్యం చేర్చే సద్గురువు
‘గురువుకు పగ్గాలు అప్పగించి నిశ్చింతగా ఊరక కూర్చుంటే చాలు, చేయవలసినదంతా నేను చేసి నిన్ను గమ్యం చేరుస్తాను’- ఇది బాబా బోధనాసారం. ఎవరైతే నన్ను శరణాగతి వేడుతారో, భక్తి విశ్వాసాలతో పూజిస్తారో, ననే్న స్మరిస్తారో, నా ఆకారమును మనస్సున నిలుపుతారో వారిని బంధాల నుండి తప్పించుట నా సహజ లక్షణం. భారం భగవంతునిపైన వేసి ఊరక కూర్చోటం తేలికైన విషయం కాదు. వివిధ రకాలైన సందేహాలు, మనోచాపల్యాలు దారి తప్పిస్తాయి. మనసు పగ్గాలు మన చేతిలో వున్నపుడే అది సాధ్యం. అందుకు తీగిన దారి సాయి ప్రబోధాలలోనే కనిపిస్తుంది. నా వద్దకెవరూ వారికై వారే రారు. నేనే అనేక రీతుల వారిని రప్పించుకుంటాను. భక్తులకు ఇహపర శ్రేయస్సు కలిగించటానికి తాను వచ్చానని చెప్పేవారు సాయి. మొదట నా వద్దకు అందరూ కోరికలతోనే వస్తారు. కష్టాలు, కోరికలు తీరు స్థాయి చిక్కాక నన్ను అనుసరించి సన్మార్గానికి వస్తారు. అందుకే బాబా భక్త సులభులు. భక్తులకెట్టి కఠిన నియమాలు విధించక దర్శన, స్మరణలతో ప్రసన్నులౌతారు.
సకల దేవతా స్వరూపం
భగవంతునికి ఎట్టి రూపము, గుణము లేవు కనుక ఆయన మన ఇంద్రియాలకు, మనస్సుకు గోచరించడు. అందువలన తనను తెలుసుకుని తరింపజేసేందుకు కరుణ భావంతో ఆయనే ఈ లోకంలో సద్గురువుగా అవతరిస్తుంటాడు. సామాన్య మానవునిలా ఉన్నా ఆయన శక్తి సామర్థ్యాలు అపారం. సద్గురువు భక్తునికి కూడా దేవతలందరూ ఆధీనులై ఉంటారు. కారణం సద్గురువు సకల దేవతల స్వరూపం. సద్గురువు అనగానే బాబాయే గుర్తువస్తారు. రాముడిగా, కృష్ణుడిగా, శివుడిగా ఎవరే దైవాన్ని ఆరాధించినా ఆ దైవం సాయి రూపంలో దర్శనమిచ్చి అనుభవాలు ఎన్నో సాయి చరిత్రలోచూడవచ్చు. తపోనిష్టులైన మహర్షులకు మాత్రమే ధ్యానంలో గోచరించే భగవంతుడు సామాన్యుల నుద్ధరించడానికి పరిపూర్ణమైన మహనీయుల రూపంలో భూమిపైకి వస్తారు. అందరు మహనీయులుగానూ, ఆ దైవమే సాయిగా ప్రత్యేకించి అవతరించిందని నరసింగ మహరాజ్, వౌల్వీ సాహెబ్, అక్కల్ కోట్ మహారాజ్, గురుఘోలప్ స్వామిమొదలైన వారి చరిత్రలు తెలియజేస్తున్నాయి.
గోధుమల పిండి లీల
సుమారు 60 సం.ల కాలం బాబా షిరిడీలో నివసించారు. అంతకాలం బాబా తిరగలిని విసురుతూనే ఉన్నారు. కానీ వారు విసిరేవి గోధుమలు కావు. భక్తుల పాపాలు, మనోవికారాలు. తిరగలి క్రింది రాయి కర్మ. మీది రాయి భక్తి. తిరగలి పిడి జ్ఞానం. జ్ఞానం పొందాలనుకున్నా, ఆత్మ సాక్షాత్కారం కోరుకున్న మనిషి ముందు తనలోని పాపాలను కోరికలను వదిలివెయ్యాలి. అహంకారాన్ని చంపుకోవాలి. తిరగలి పిడిని (జ్ఞానాన్ని) గట్టిగా పట్టుకో. మనస్సును కేంద్రీకరించు, దూరంగా పోనీయకు. దృష్టిని అంతర్ముఖం చేసి అంతరాత్మని దర్శించు. నీవు తప్పక రక్షింబడెదవు. వేదాంత తత్త్వమే కాక ఊరిలో ప్రబలిన కలరా జాడ్యాన్ని బాబా విసిరి ఊరినుండి తరిమికొట్టిన అద్భుత లీల బాబా తిరగలి విసరటం.
భిక్షాటన మర్మం
తమ కనుసైగతో నిరుపేదను మహారాజుగా మార్చగల సాయిమహారాజ్ జోలి తీసుకుని గడప గడపకు తిరిగి భిక్ష తీసుకొనేవారు. బిచ్చగానివలె ‘అమ్మాయి రొట్టెముక్క పెట్టు’ అంటూ నియమంగా ప్రతీరోజు కొన్ని ఇళ్లకు వెళ్లేవారు. ఒక్కో రోజు ఒక్కసారి, ఒక్కోరోజు చాలాసార్లు తమ ఇచ్ఛానుసారం భిక్ష తెచ్చుకునేవారు. అలా తెచ్చినవన్నీ మసీదులో మట్టి పాత్రలో ఉంచేవారు. ఆకలిగొన్న ఏ జీవి వచ్చి తినిపోయినా అదిలించేవారు కాదు. భక్తుల శ్రేయస్సు కొరకు. పంచ సూనాది పాప నివృత్తికై తమ నిర్యాణ పర్యంతం బాబా భిక్షావృత్తిని అవలంభించారు.