సబ్ ఫీచర్

‘మందిర’ నిర్మాణంతో లోక కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశం అంటే హిందూ దేశం. హిందుత్వం సనాతనం. క్రీ.శ. 633 నుండి మన దేశంపై దండయాత్రలు కొనసాగించిన ఇస్లాంలు మొదటిసారిగా క్రీ.శ.712లో విజయం సాధించారు. ఆనాటి నుండి నిరంతరం ఇస్లాం ఆక్రమణదారులు మన దేశంపై దండయాత్రలు కొనసాగించారు. తిరుగులేని రీతిలో వారు రాజ్యాధికారం చేశారు. రాజ్యాధికారం అందిపుచ్చుకొన్న ఇస్లాంలు అంతటితో ఆగకుండా భారతీయ సంస్కృతిని, సాహిత్యాన్ని, భాషలను, దేవాలయాలను ధ్వంసం చేశారు. కూల్చివేసిన దేవాలయాలను మసీదులుగా మార్చారు. మధుర శ్రీకృష్ణ మందిరము, కాశీ విశ్వనాథ మందిరము సహా అనేక ఆలయాలను పాక్షికంగా ధ్వంసం చేసి మసీదులు నిర్మించారు. అయోధ్యలోని రామమందిరాన్ని పూర్తిగా ధ్వంసం చేసి మొగల్‌రాజు బాబర్ పేరున మసీదును నిర్మించారు. పూర్తిగా ధ్వంసం చేయబడిన గుజరాత్‌లోని సోమనాథ్ మందిరాన్ని ‘ఉక్కు మనిషి’ సర్దార్ వల్లభ భాయ్ పటేల్ పట్టుదల వల్ల పునఃనిర్మించారు.
రామజన్మభూమిలో ధ్వంసం చేసిన మందిరంపై మసీదు నిర్మాణం తొలగించడానికి ఐదువందల సంవత్సరాల నుండి చేసిన నిరంతర పోరాటం 1992 డిసెంబర్ 6న ఫలించింది. ఇంత సమయం పట్టడానికి గల కారణం ఇస్లాంల పరిపాలన, బ్రిటన్ వారి పరిపాలన కొనసాగడం. మన దేశంలో స్వాతంత్య్రం సిద్ధించిన అనంతరం స్వపరిపాలన ప్రారంభమైనా, విదేశీ భావజాలంతో ఏర్పాటు చేసిన రాజ్యాంగం, అక్రమంగా చొరబడిన సెక్యులరిజం, విదేశీ సిద్ధాంతాలను పుణికిపుచ్చుకున్న కమ్యూనిస్టుల భావజాలం, బ్రిటన్ తరహా విద్యావిధానం వంటివి కొనసాగుతున్నాయి.
అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణం విషయం రాజకీయ పార్టీల పరంగా చూస్తే భాజపాకు తప్ప దేశంలోని ఏ పార్టీకి పట్టదు. భాజపా సైతం ఏ నిర్ణయం తీసుకోకుండా- సర్వోన్నత న్యాయస్థానం తీర్పుకు ప్రాధాన్యతనిస్తోంది. రామమందిరంపై ఇంతటి జాప్యం జరగడంతో వందల సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న తమ ఆశలు ఫలించక నూరు కోట్ల హిందువులు సంయమనం కోల్పోతున్నారు.
క్రైస్తవ ఫాదరీలు, ఇస్లాం ముల్లాలు వారివారి మతాల విషయాలకే పరిమితం కాకుండా ప్రజాస్వామ్యంలో కూడా ఫలానా పార్టీకే ఓట్లు వేయండని ఫత్వాలు జారీచేస్తుంటారు. అదేమో వారికి వాక్ స్వాతంత్య్రం, మానవ హక్కులు.. కానీ- హిందూ సాధుసంతులేమో రామజన్మభూమిలో భవ్యమైన రామాలయ నిర్మాణం చేపట్టి తీరాలని హిందువులకు ఫత్వా జారీచేయలేరు. అలా చేస్తే అది రాజ్యాంగానికి విరుద్ధం, మానవ హక్కుల ఉల్లంఘన అంటారు. రామాల య నిర్మాణ పరిష్కారం ఎప్పుడు? ఎవరు చే స్తారు? రాజకీయ లబ్ధిపొందేవారేమో ఆర్డినెన్స్ తీసుకురండంటారు. చట్టసభలలో మాత్రం మద్దతు ఇస్తామని హామీ ఇవ్వరు. లోక్‌సభలో భాజపాకు పూర్తి మెజారిటీ ఉంది కదా? ఆర్డినెన్స్ ఎందుకు, నేరుగా చట్టమే తేవచ్చుకదా? అంటారు సామాన్య ప్రజలు. మరి రాజ్యసభలో మెజారిటీ లేదు. ప్రతిపక్షాలేమో మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా లేరన్న విషయం సాధారణ జనానికి పట్టదు.
మన దేశంలో ప్రాంతం, కులం, వర్గం , భాష పేర్లతో ఇంటింటికొక రాజకీయ పార్టీని పెట్టుకుంటారు. కుటుంబ పాలన చేస్తుంటారు. రాజకీయ నాయకులు ఒకరికొకరు తిట్టుకుంటారు. అధికారం కోసం రాజకీయ లబ్ధి కోసం సిద్ధాంతాలను పక్కకుపెట్టి బిజెపియేతర కూటమి పేరిట చెట్టపట్టాలు వేసుకొంటారు. ఇలాంటివారు ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారు? ప్రజలకేం న్యాయం చేస్తారు? వీరిలో ఏ ఒక్క పార్టీ అధినేత రామజన్మభూమిలో రామమందిర నిర్మాణం చేయాలని, నూరు కోట్ల హిందువుల మనోభావాలకు, వందల సంవత్సరాలుగా త్యాగాలు చేస్తున్న త్యాగధనులకు అనుగుణంగా మాట్లాడేవారు లేరు. గుర్తించేవారు కూడా లేరు.
***
సీబీఐ, ఈడీ దాడులతో ప్రధానమంత్రి న రేంద్ర మోదీ దేశ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నాడని ప్రధానిపై ఆరోపణలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ము ఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భాజపాపై జనం తిరగబడాలని పిలుపునిస్తున్నాడు. సీబీఐ, ఈడీ అనే సంస్థలు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాక వచ్చినవి కావుకదా? ఈ సంస్థలు అక్రమార్కుల బండారాన్ని బయటపెట్టేందుకు ఏర్పాటుచేసిన వ్యవస్థలని ప్రజలకు తెలియనిది కాదు కదా! సిబిఐలోని ఒకరిద్దరు అధికారుల అవినీతిని చూపించి ఆ సంస్థను నిర్వీర్యం చేయగలమా? ఇదే దారిన మిగతా సంస్థలను రద్దుచేయగలమా? ప్రధానమంత్రిగా కొనసాగుతున్న సమయంలోనే ఇందిరాగాంధీని ఆమె సంరక్షకులే హత్యచేశారన్న విషయం ప్రపంచ ప్రజలకు తెలిసినదే కదా! అలాగని సెక్యురిటీ వ్యవస్థను రద్దుచేయలేం కదా?
నిజాం పరిపాలన గొప్పది అంటూ కాశీం రజ్వీ దురాగతాలకు పరాకాష్ట అయిన ఎమ్‌ఐఎమ్ పార్టీ తన మిత్రపక్షం అని కేసీఆర్ అంటాడు. తెలంగాణలో ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రతి ముఖ్యమంత్రి తమ చేతిలో కీలుబొమ్మలాగే ఉంటాడని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రగల్భాలు పలుకుతాడు.
దశాబ్దాల తరబడి ప్రత్యేక రాష్ట్ర సాధనకు తెలంగాణ ప్రజలు పోరాటాలు చేసి, వందల మంది ప్రాణత్యాగాలు చేస్తే, దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఒత్తిడిలను భరించలేక రాజకీయ లబ్ధిమేరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వచ్చింది. ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ అంటారు ఉత్తమ్‌కుమార్ రెడ్డి వంటి కాంగ్రెస్ నేతలు. ఆనాడు బిజెపి మద్దతు లేకుంటే, సుష్మాస్వరాజ్ చొరవ లేకుంటే సోనియమ్మ తెలంగాణ ఎట్లిచ్చిందో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు చెప్పరు. ఏ అధికారంతో సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిందో కాంగ్రెస్ నాయకులు చెప్పగలరా? టిఆర్‌ఎస్ అధినాయకుడు చంద్రశేఖర్‌రావుకు అడిగే సోయి లేదు. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిందనడం పార్లమెంటును, ప్రధానమంత్రిని అవమానించడం కాదా?
***
శ్రీరాముడు పధ్నాలుగు సంవత్సరాలు వనవాసం చేసిన సమయంలో తన రాజ్యంలో సమయానుకూల వర్షాలు పడలేదు. పంటలు పండలేదు. సంతానాభివృద్ధి జరుగలేదు. పశుసంపద పెరుగలేదు. ఎలాంటి కళ్యాణ కారకమైన కార్యాలు జరుగలేదనేది ఇతిహాసాల ఉవాచ. అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగనంతవరకు మన దేశంలో పాపకార్యాలను ఎవరూ ఆపలేరు. అధునాతన విజ్ఞానంతో అభివృద్ధి ఎంత జరిగినా అది జన వినాశనానికే తప్ప జన సంరక్షణ కాదనేది ప్రజలు గుర్తించాలి. రామమందిర నిర్మాణానికి హామీ ఇచ్చే పార్టీనే గెలిపించుకోవడం ప్రజల విజ్ఞతకు తార్కాణం.

-బలుసా జగతయ్య 90004 43379