సబ్ ఫీచర్

యవ్వనంగా కనిపించాలంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వయసు పెరిగేకొద్దీ చర్మం వదులవుతుంది. యోగా ద్వారా చర్మాన్ని బిగుతుతూ, శరీరాన్ని ఫ్లెక్సిబుల్‌గా చేయవచ్చు. చిన్న చిన్న యోగాసనాల ద్వారా నిత్యయవ్వనంగా కనిపించవచ్చు. అలాంటి యోగాసనాలను ఒకసారి చూద్దామా..
మాలాసన
యోగామ్యాట్‌పై నిటారుగా నిలబడండి. మెల్లిగా పాదాలను ఎడం చేయాలి. రెండు కాళ్ల మధ్య కనీసం మూడు అడుగుల దూరం ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు రెండు చేతులను దగ్గరికి తీసుకొస్తూ దండం పెడుతున్న పొజిషన్‌లోకి రావాలి. ఇప్పుడు మోకాళ్ల దగ్గర వంచి కోర్ భాగాన్ని కిందకు దించాలి నెమ్మదిగా.. ఇలా వీలైనంతగా కిందకు దించాలి. ఇలా మూడు నుండి నాలుగు సెకన్లు ఉండి తిరిగి సాధారణ స్థితిలోకి రావాలి. ఇలా మొదట పదిసార్లు చేయాలి.
ఉత్కటాసన
శరీరంలో వయసురీత్యా సాగిన చర్మాన్ని ఈ ఆసనం బిగుతుగా చేస్తుంది. ముఖ్యంగా పిరుదుల భాగంలో వయస్సుతో పాటు సాగిన చర్మాన్ని బిగుతు చేస్తుంది. యోగా మ్యాట్‌పై నిటారుగా నిలబడాలి. రెండు కాళ్ళను దగ్గరగా ఉంచుతూ నిటారుగా నిలబడాలి. రెండు చేతులతో దండం పెడుతున్న పోజ్‌లో నిలుచుకోవాలి. నెమ్మదిగా చేతులను తలపైకి అలాగే లేపాలి. ఇప్పుడు మెల్లిగా మోకాళ్లను దగ్గరగా వచ్చి శరీరాన్ని కుర్చీ ఆకారంలోకి తీసుకురావాలి. ఇలాగే ఐదు నుంచి ఆరు సెకండ్లు ఉండి తిరిగి మొదటి పొజీషన్‌లోకి వచ్చేయాలి. దీన్ని పది సార్లు చేయాలి.
పుర్వోత్తనాసన
ఈ ఆసనం నిటారుగా నిలబడడానికి దోహదపడుతుంది. యోగామ్యాట్‌పై కాళ్లను విస్తార పరుస్తూ కూర్చోవాలి. రెండు కాళ్లను దగ్గరగా ఉంచాలి. అరిచేతులను రెండు పక్కలా నేలపై ఉంచాలి. ఇప్పుడు మెల్లిగా కూర్చున్న పొజీషన్లో శరీరాన్ని పైకి లేపాలి. బరువంతా చేతులు, హీల్స్‌పై పడేలా శరీరాన్ని ఒకలైన్‌లోకి తీసుకురావాలి. ఇలా ఐదారు సెకండ్లు ఉంచి ఐదు నుండి ఎనిమిది సార్లు పునరావృతం చేయాలి.
చతురంగాసన
శరీరంలో జారిపోతున్న పటుత్వాన్ని ఈ ఆసనం ద్వారా తిరిగి పొందవచ్చు. ఒకరకంగా ఇది ప్లాంక్ వంటి పొజిషన్ అని చెప్పుకోవచ్చు. కానీ కొంచెం నిదానంగా శ్వాసను గమనిస్తూ ఆసనం వేయడం వల్ల ఫలితం ఎక్కువగా ఉంటుంది. ముందు బోర్లా పడుకుని అరిచేతులపై బలం వేస్తూ శరీరాన్ని పైకి లేపాలి. పాదాల చివరల్ని నేలపై ఉంచుతూ శరీరాన్ని విల్లులా ఒకే లైన్‌లో ఉంచుతూ శ్వాసను బిగపట్టి బరువునంతా పొట్టపై వేసుకోవాలి. ఇలా మూడు, నాలుగు సెకన్లు ఉండి తిరిగి మామూలు స్థితికి వచ్చేయాలి.