సబ్ ఫీచర్

సుందరకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తరువాత ఆ తల్లియొక్క దర్శన రూపమైన విద్యను లోకానికి అందించిన వాడు నంది. అందుకనే ఆ తల్లిని గురించి చెప్పే మహావిద్యకు నంది విద్యా అని పేరు. తద్విద్యారూపమైన అమృతాన్ని లోకానికి పంచి అమృత మయముగా లోకాన్ని సంరక్షించిన ఘనత నందీశ్వరునిది.
స్వామి కూడా అట్టి స్థితిలో ఉన్నాడు-
సీతానే్వషణలో ఉన్న వానరులు నిరాశతో దైన్యంతో మృతప్రాయులై ఉండగా- మొట్టమొదట సీతాదర్శనమును తానుచేసి- ఆ తల్లిని గురించి తన జ్ఞాతికి చెప్పి వారిని అమృతులను చేస్తాడు.
ఈ విధంగా జ్ఞాతి దుఃఖాన్ని ఈ జాతి దుఃఖాన్ని పోగొట్టిన స్వరూపం ఆంజనేయస్వామిది. అందుకని ఆయన నందీశ్వరుడు. ఆయన చేసిన సీతా ప్రసంగం నంది విద్య.
నందికి రుద్రునకు అభేదం. అట్టి శివాంశ అయిన స్వామి సీతానే్వషణమునకు బయలుదేరుతున్నాడు.
ఒకప్పుడు శుంభ నిశుంభులనే రాక్షసుల్ని మహాశక్తి సంహరింపవలసి వచ్చింది. ఆ సమయంలో ఆ తల్లి శివుని పిలిచి
దూతస్త్వం గచ్ఛ భగవాన్ పార్శ్వం శుంభ నిశుంభయోః
అని దూతగా పంపించింది. ఆయన వెళ్ళి శంభు నిశుంభలకు పరాశక్తి యొక్క సామర్థ్యాన్ని చెప్పి ఆమె అనుగ్రహాన్ని పొందమని ఉపదేశిస్తాడు. వాళ్ళు ఆరుద్రుణ్ణి కూడా పరిహసిస్తారు. శివుడు తిరిగి వచ్చి ఆ విషయాన్ని ఆమెకు నివేదిస్తాడు.
ఆమె ఎందుకిలా పంపింది అనే రహస్యాన్ని
శివదూతీ స్వరూపేణ హతదైత్య మహాబలే.
అనే స్తుతిలో దేవతలు తెలియజేస్తారు. ఎవరి యందు రుద్రదృష్టి పడుతుందో వాళ్ళు క్షీణిస్తారు. అందుకని రుద్రుని వాళ్ళ దగ్గరకు రాయబారపు వంకగా పంపి వారిని కృశింపచేసింది. అలా కృశించిన వారిని తాను సంహరించింది. ఇప్పుడామెకు ‘‘శివదూతీ’’ అని పేరు.
ఈ లక్షణ: ఆంజనేయస్వామి బయలుదేరడంలో ఉంది. శత్రుకర్శనః అనే మాటకు అర్ధం ఇది. సుగ్రీవుడు సీతానే్వషణానికి పంపితే స్వామి సీతానుజ్ఞతో రావణుని చూడడానికి వెడతాడు.
అందుకని ఆమె శివదూతి.
పెరిగిన స్వరూపంతో హనుమ ఆ పచ్చికబయళ్ళలో ముందుకి వెనక్కి నడుస్తున్నాడు.
ఆ సమయంలో స్వామిని-
అధ వైడూర్య వర్ణేషు శాద్వలేషు మహాబలః
అని మహర్షి చూపెడతారు. ఇక్కడ మహాబలుడు వాయువు కూడాను. ఎరగడానికి సిద్ధమైన స్వామి వాయుతత్వాన్ని పొందేడు. అలా పొందడం వలన పచ్చికబయళ్ళు వైడూర్యాల్లా కనబడుతున్నాయి. ఎందుకని!
వాయో? వైడూర్య సంజ్ఞకం అని
‘‘పంచ సంఖ్యోపచారిణి’’ అయిన పరాశక్తి నీల ముకాఫల కౌస్త్భు వైడూర్య పుష్యరాగాలనే పంచరత్నములచేత సేవింపబడుతూ ఉంటుంది.
ఇంకా ఉంది

- కాశీభొట్ల సత్యనారాయణ