సబ్ ఫీచర్

యోగాతో శారీరక పుష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యోగాప్రక్రియలో కాయకల్ప యోగ అత్యంత ప్రశంసనీయమైనది. నాడి, జీవక్రియలను మెరుగుపరచడంతో పాటు శరీరానికి యవ్వనాన్ని తెచ్చిపెట్టడం దీని ప్రత్యేకతలు. ఇది శారీరక పుష్టితో పాటు ఆధ్యాత్మక సిద్ధినీ అందిస్తుంది.
ఈ యోగాన్ని గురువు పర్యవేక్షణలోనే చేయాలి. కాయకల్ప యోగా పలు విధానాల సమ్మేళనం. ముక్కుతో గాలి పీల్చి నెమ్మదిగా నోటితో వదలటం, భస్తిక అంటే.. ముక్కు ఒక రంధ్రం ద్వారా శ్వాస తీసుకుని ఆ రంధ్రాన్ని మూసి వేరే రంధ్రం నుండి శ్వాసను వదలడం, మర్ధన, మూలికా చికిత్సల వంటి పలు సాధనలు ఉన్నాయి.
* కాయకల్ప యోగా జీవితకాలాన్ని పెంచడమేకాక వృద్ధాప్య ఛాయలు రాకుండా చేస్తుంది.
* శరీరపు రోగనిరోధకశక్తిని పెంచుతుంది.
* వ్యసనాలు, అనారోగ్య కారక అలవాట్లను వదిలిపోయేలా చేసేందుకు దోహదపడుతుంది.
* వంశానుగతంగా వచ్చే అనారోగ్య సమస్యల కట్టడి, ప్రతికూల స్వభావాల ప్రభావాన్ని తగ్గిస్తుంది.
* మహిళల ప్రత్యుత్పత్తి వ్యవస్థ బలోపేతమై సంతానం కలుగుతుంది. రుతు సమస్యలు తొలగిపోతాయి.
* ఉబ్బసం, మధుమేహం, ఆర్శమొలలు, చర్మ సంబంధ వ్యాధుల తీవ్రతను తగ్గిస్తుంది.
* నాడీవ్యవస్థ, మెదడు కణాలను చురుకుగా ఉంచి పనితీరు పెరిగేలా చేస్తుంది.
* అతి భావోద్వేగాలను అదుపు చేసి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ఆధ్యాత్మిక భావనలు కలుగజేస్తుంది.
* బరువు అదుపులో ఉండేలా చేస్తుంది.
వృక్షాసనం
ఈ ఆసన స్థితి చెట్టును పోలి ఉంటుంది కనుక దీన్ని వృక్షాసనం అంటారు. రోజూ వృక్షాసన సాధన చేసేవారి ఏకాగ్రత పెరుగుతుంది. కీళ్లనొప్పులు తగ్గుతాయి. మోకాళ్లు, గిలక, అరికాళ్లు, భుజాలు, చేతివేళ్లకు రక్తప్రసరణ మెరుగుపడి వాటి పనితీరులో సానుకూల మార్పులొస్తాయి. శరీర ఆకృతి తగురీతిగా మారుతుంది. అయితే అధిక బరువు, మోకాళ్లనొప్పుడు, శారీరక బలహీనత ఉన్నవారు ఈ వృక్షాసనాన్ని వేయకపోవడమే మంచిది..
ముందుగా పాదాలను దగ్గరగా ఉంచి వెన్నుపూసను నిటారుగా నిలిపి నిలబడాలి. తర్వాత కుడిపాదాన్ని పైకి లేపి ఎడమ తొడకు ఆనించి నిలపాలి. ఇప్పుడు నెమ్మదిగా చేతులను లేపి ఆకాశానికి నమస్కారం చేస్తున్న భంగిమలో ఉంచాలి. ఈ స్థితిలో శరీరాన్ని వీలున్న మేరకు పైకి సాగదీయాలి. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకుని వదులుతూ ఎదురుగా ఉన్న ఏదైనా వస్తువుపై దృష్టిని, మనసును కేంద్రీకరించాలి. ఈ భంగిమలో ఉండగలిగినంతసేపు ఉండి.. తర్వాత చేతులను పక్షి రెక్కలు విప్పినట్లుగా పక్కలకు తీసుకువచ్చి కిందకి తీసుకురావాలి. చివరగా కుడికాలిని దించి రెండు కాళ్లూ పక్కపక్కన బెట్టాలి. ఈసారి ఎడమ అరికాలిని కుడి తొడకు ఆనించి పై విధంగానే చేయాలి. ఇలా ఐదు నుండి ఆరు సార్లు చేయాలి. ఈ దశను సాధన చేసిన తర్వాత రెండో దశను సాధన చేయాలి.
ఈ ఆసనంపై బాగా పట్టువచ్చిన తర్వాత దృష్టిని ఎదురుగా ఉన్న వస్తువులపై గాకుండా తలను పైకెత్తి నమస్కారం చేసిన చేతులను చూడాలి. మరింత సాధన తర్వాత.. అంటే చివరిదశలో ఒక చేత్తో వంచిన కాలి మడమను పట్టుకుని ఒక చేతిని పైకి చాచి, ఆ చేతిపై దృష్టి కేంద్రీకరించాలి.
జలంధర బంధం
గడ్డం భాగాన్ని ముడుచుకునేలా చేసే ఆసనం కనుక దీన్ని జలంధర బంధం అంటారు. ఈ ఆసనం వేసేముందు పద్మాసనంలో కూర్చోవాలి. వెన్ను, మెడ నిటారుగా ఉండాలి. అరచేతులను మడిచిన మోకాళ్లపై ఉంచాలి. ఇప్పుడు నిండుగా శ్వాసను తీసుకోవాలి. ఆ శ్వాసను లోపలే ఆపి తలను కిందికి వచ్చి గెడ్డాన్ని ఛాతీకి అదిమి ఉంచాలి. ఈ స్థితిలో ఉండగలిగినంత సేపు ఉండి తల ఎత్తి యథాస్థితికి రావాలి. తొలిసారి చేసేవాళ్లు ఐదు సెకన్లు నిలిపి సమయాన్ని నెమ్మదిగా పెంచుకోవాలి. ఇలా నాలుగు నుంచి ఐదుసార్లు చేయాలి. గాలి పీల్చి బిగబెట్టినప్పుడు చేతులు కాస్త చాచుకోవచ్చు. శ్వాసను లోపల నింపి చేసినట్లే శ్వాసను బయటకు వదిలి కూడా చేయవచ్చు.
* ఈ ఆసనం వేయడం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగుపడుతుంది.
* జీవక్రియలు వేగం పుంజుకుంటాయి.
* ప్రాణశక్తి వృద్ధి చెందుతుంది.
* గొంతు సమస్యలు రాకుండా చూస్తుంది.
* మనస్సు తేలిక పడుతుంది. కోపం, ఒత్తిడి వదిలిపోతాయి.
* ముఖ కండరాలకు శక్తిని చేకూర్చి అందంగా కనిపించేలా చేస్తుంది.
మెడనొప్పి, తలతిరుగుడు, హైబీపీ, గుండె జబ్బులున్నవారు దీన్ని చేయకూడదు.