సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైష్ణవ చరణుడు, పద్మలోచనుడు, నారాయణశాస్ర్తీ మున్నగు సుప్రసిద్ధ పండితులు-ఉత్తమ సాధకులు- ఆ యమృతాస్వాదనభాగ్యమును బడసి తన్మయులై శ్రీరామకృష్ణుడు సాక్షాద్భగవదవతారమూర్తియని భావింపసాగిరి.*
శ్రీరామకృష్ణుడు పరమహంసయని- దివ్యపురుషుడని - లోకము గ్రహింపసాగెను. ఆజన్మాంతము మహోత్తమ సమాధిస్థితు లాతనికి తఱచు కలుగుచునేయుండినను ఆతని నిరంతర బ్రహ్మానుభూతి సమాధివంటి ప్రత్యేక మనఃస్థితిపై నాధారపడినది కాదు.
సగుణనిర్గుణ భావములు రెండిటను బ్రహ్మానుభూతి నొందగలుగుచు, ఈ దివ్యానుభవమున కినుమంతయు భంగములేకయే నిత్యకృత్యముల నవలీలగా నెఱవేర్పగలుగునట్టి ‘్భవముఖము’తన మనఃస్థితియని శ్రీరామకృష్ణుడే తెలిపియున్నాడు. పండితం మన్యులగు కొందఱు ప్రకృతి శాస్తజ్ఞ్రులు తలచునట్లాతని సమాధిస్థితులును దివ్యానుభూతులును మనోదౌర్బల్య లక్షణములు కానేరవనుట కాతని నిరుపమానవినిర్మల జీవన విధానమే ప్రబల నిదర్శనము.
ఎట్టి విషయ పరిస్థితులయందైనను అఖండ ప్రశాంతియే యాతని జీవితగాన మాధుర్యమై యొప్ప, నిరంతర బాల్యోత్సాహమే యందలి ప్రధాన స్వరమై విలసిల్లెను. లోకమును పాపపంకిలమున ముంచివేయు కామకాంచనము లాతని లేశమును వ్యామోహితుని జేయజాలక పోయెను. సుశీలవ్రతలైనను, కాకున్నను సమస్త స్ర్తిలును ఆతని కంటికి జగన్మాతృస్వరూపిణులుగనే కన్పట్టిరి.
(్భరవీ బ్రాహ్మణి యించుమించుగా ఈ సమయముననే పండిత మహాసభ జరిపి శ్రీరామకృష్ణుడు భగవదవతారమూర్తియని లోకమునకు బ్రకటించెను.)
అతని కాంచన విజయమో, అత్యద్భుతము, ధనముగాని, తుద కే లోహమును గాని యాతడు ముట్టనే ముట్టజాలడయ్యె, సాధనల కాలమున నాతడొకచేత మట్టిని రెండవచేత కనకమును బట్టుకొని, యైహిక సుఖసంపాదనముకేగాని, ఆత్మసాక్షాత్కారమున కవి రెండును సమానముగనే నిరుపయోగములని నిశ్చియించి రెంటిని గంగలో బాఱవైచును. కాలాంతరమున నాతని ప్రియశిష్యుడగు నరేంద్రుడు (వివేకానందస్వామి) ఒకప్పుడాతని కాంచన విజయమును బరీక్షింపనెంచి యొక వెండి నాణెము నాతని పాన్పుక్రిందబెట్ట నాతడు దానిపై గూర్చుండినంతనే తేలు కుట్టినట్లు శరీరము మంటలెత్త తటాలున పాన్పు దిగెను! లోహస్పర్శనైనను సహింపజాలని యాతని కాంచన విజయమును కన్నులార గాంచి శిష్యులు నిశే్చష్టులైరి. మఱియొకప్పుడొక మార్వాడీభక్తుడు పదివేల రూపాయలను సమర్పింపబోవ, ‘‘శరీరము ఱంపముతో కోయబడినట్లు’’ బాధపడి శ్రీరామకృష్ణుడా కానుకను తృణీకరించెను. ఎట్టి యద్భుత కాంచన విజయమో కదా!
ఇక సంసార విషవృక్షమునకు తల్లి వేరనదగు నహంకారము నున్మూలితమొనర్చుకొనుటకై యాతడు సాగించిన సాధనల నుపమానములు. మలిన ప్రదేశములను శుద్ధిచేయవారల మఱగుదొడ్లను తన పొడుగాటి జడలను చీపురుగా జేసి తుడిచెను! జనులలో- పనులలో- న్యూనతాధిక్యములుగల వను భ్రాంతి నాతడిట్లు నిర్మూలించెను.
***
ఆతని సత్యనిష్ఠయే. సత్యహరిశ్చంద్రాది పురాణవీరులను దలపునకు దెచ్చును. జీవితమందలి విషమతమ సంఘటనములలో సత్యవ్రతమును బరిపాలించుటటుండ, నొకానొక దినమున నొకచోటికి బోవుదునను వాగ్దానమును గాని, యొకని యొద్దనుండి యొక వస్తువును గైకొనుండునను మాటను గాని యాతడెన్నడును జవదాటజాలడయ్యె.
ఇంకా ఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 1121 మహోపదేశములు గల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -సంగ్రహ జీవిత సహితము - అనువాదకుడు: శ్రీ చిరంతనానందస్వామి