సబ్ ఫీచర్

అందరికీ తెలియజేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయులకు సహనం ఎక్కువ. అందువల్లనే బ్రిటిష్‌వారు శతాబ్దాల తరబడి మన దేశాన్ని పాలించే పేరుతో దోచుకొన్నారు. స్వాతంత్య్రంకోసం ఉద్యమిస్తున్న ఎందరినో అతి కిరాతకంగా హత్యలు చేయడంతోపాటు, లక్షలాది మందిని కర్కశంగా చిత్రహింసలకు గురిచేశారు. రెండవ ప్రపంచ యుద్ధంలో తీవ్రంగా నష్టపోయిన తరువాత, తప్పనిసరి పరిస్థితులలో మాత్రమే మన దేశానికి స్వాతంత్య్రం ఇచ్చారు. భారతదేశం అఖండ భారతంగా ఉంటే, అది త్వరలోనే ప్రపంచంలో అగ్రగామి దేశంగా అభివృద్ధిచెందుతుందనే భయం బ్రిటిష్‌వారికి పట్టుకొంది. అదే జరిగితే నిన్న మొన్నటివరకు తమ బానిస దేశంగా (వలస దేశం) ఉన్న భారతదేశం నుంచి అంతర్జాతీయ వ్యవహారాలలో తమకు పోటీ వస్తుందని అఖండ భారతావనిని భారతదేశం, పాకిస్తాన్‌లుగా విభజించారు. ఈ విభజనతోపాటు అప్పటివరకు సోదరభావంతో మెలుగుతున్న హిందువులు, ముస్లింల మధ్య చిచ్చుపెట్టారు. నాడు బ్రిటిష్ ముష్కరులు భారతదేశం, పాకిస్తాన్‌ల మధ్య రగిలించిన చిచ్చు, నేటికీ రావణకాష్ఠంలా రగులుతూనే ఉంది.
ప్రపంచంలో ఉన్న అతి ప్రాచీన మతాలలో హిందూ మతం ఒకటి. హిందూ మతానికి మార్గదర్శకం చేసేవి వేదాలు. వేదాలలో అపరిమితమైనటువంటి విజ్ఞానం నిక్షిప్తమై ఉంది. ఈ విజ్ఞానాన్ని ప్రజలందరికీ అందచేయడానికి తగిన కృషి జరుగుతున్న దాఖలాలు లేవు. వేదాలు విజ్ఞానానికి గనులు వంటివని అభివర్ణించేవారే తప్ప ఆ విజ్ఞానాన్ని వెలికితీసి, వాటికి ఉన్న శాస్ర్తియ ఆధారాలను ప్రజలందరికీ తెలియచెప్పడానికి ప్రయత్నించినవారు బహు తక్కువమంది మాత్రమే ఉన్నారు. వారికి సమాజంనుంచి సరైన సహాయ, సహకారాలు అందకపోవడంతో, వారి ప్రయత్నాలు విజయవంతం కాలేదు. బ్రిటిష్‌వారు మన దేశంలో హిందువులు, ముస్లింల మధ్య చిచ్చుపెట్టడంతోపాటు, క్రైస్తవ మతవ్యాప్తికి ఇతోధికంగా కృషిచేశారు. హిందూ మతంలో ఉన్న కొన్ని అనాచారాలు, నిరక్షరాస్యత, పేదరికం తదితర కారణాల వలన పలువురు క్రైస్తవ మతంను స్వీకరించారు. అదే సమయంలో మత మార్పిడి పొందిన వారికి వివిధ రూపాలలో నజరానాలు కూడ అందచేశారు. అంతేకాకుండా, హిందూ మతానికి సంబంధించిన పురాణ ఇతిహాసాలలో కీలకమైన రామాయణం, మహాభారతంలు పుక్కిట పురాణాలని ప్రచారం చేశారు. రామాయణం, మహాభారతం కల్పిత గాథలని అన్యమతస్థులు ప్రచారం చేశారు.
అయితే, వీరందరి నోళ్ళకు తాళం వేస్తున్నది అమెరికాకు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చి అనే సంస్థ నిర్వహించిన పరిశోధన. హిందూ మతానికి సంబంధించిన పురాణ ఇతిహాసాలకు చెందిన పలు ఆధారాలను శాస్ర్తియంగా ఈ సంస్థ నిరూపించింది. ఇప్పటివరకు శ్రీరామచంద్రుడు అసలులేడని, అది కేవలం ఒక కల్పిత పాత్ర మాత్రమేనని వాదిస్తున్నవారికి, శ్రీరాముడు క్రీ.పూ.1514 జనవరి 10వ తేదీన మధ్యాహ్నం 12.05 గంటలకు జన్మించారని శాస్ర్తియ నిరూపణ ఈ పరిశోధన ఇచ్చింది. ఇటీవల ఢిల్లీలో ‘యూనిక్ ఎగ్జిబిషన్ ఆన్ కల్చరల్ కంటిన్యూటి ఫ్రమ్ రుగ్వేద టు రోబోటిక్స్’అనే అంశంపై నిర్వహించిన ప్రదర్శనలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చి సంస్థ ఫలితాలను ప్రదర్శించారు. మహాభారత యుద్ధం జరిగిన తేదీలను కూడా అందులో పేర్కొన్నారు. దీంతో అసలు మహాభారత యుద్ధమే జరగలేదని వాదించేవారి నోళ్ళలో పచ్చివెలక్కాయ పడ్డట్లు అయింది. అదే విధంగా రామాయణ, మహాభారత గ్రంథాలు కల్పిత కథలు కాదని చెప్పడానికి ఈ పరిశోధనా ఫలితాలు చక్కగా ఉపయోగపడతాయి. అయితే, ఈ పరిశోధనా ఫలితాలను అన్ని భాషలలోకి అనువదించి, ప్రజలందరికీ అవి అందుబాటులోకి వచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనివలన హిందూ మతంపై అన్యమతస్థులు చేస్తున్న దాడిని సమర్ధవంతంగా తిప్పికొట్టడానికి అవకాశం ఉంటుంది.

- పి.భార్గవరామ్