సబ్ ఫీచర్

ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్‌గా తొలి మహిళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థలో చీఫ్ ఎకనమిస్ట్‌గా తొలి మహిళ నియమితులయ్యారు. అదీ ఒక భారతీయ మహిళ.. భారతదేశంలోని కర్ణాటకకు చెందిన గీతా గోపీనాథ్‌కు ఆ పదవి దక్కింది. ఐఎంఎఫ్‌లో అత్యున్నత పదవి పొందిన తొలి మహిళగా గీత ఘనత సాధించారు. గీత కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో డిసెంబర్ 8, 1971లో పుట్టారు. ఆమె తల్లిదండ్రులు టి.వి. గోపీనాథ్, విజయలక్ష్మి. వారిది కేరళ రాష్ట్రం. గీతా గోపీనాథ్ భర్త ఇక్బాల్ సింగ్ దలివాల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనమిక్స్‌కు చెందిన సంస్థలకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆమెకు ఒక కొడుకు.. పేరు రోహిల్. గీత స్కూలు విద్య మైసూరులోని నిర్మలా కానె్వంట్‌లో చదివారు. యూనివర్శిటీ ఆఫ్ ఢిల్లీలో డిగ్రీ, యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్‌లో ఎంఏ చదివాక ప్రిన్స్‌టన్ యూనివర్శిటీలో పీహెచ్‌డీ చేశారు. గీత హార్వర్డ్ యూనివర్శిటీలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఐఎంఎఫ్ పరిశోధన విభాగంలో డైరెక్టర్‌గా పనిచేసిన వౌరీ ఆస్టెఫెల్డ్ గత నెల 31న పదవీ విరమణ చేశాక గీతకు చీఫ్ ఎకనమిస్ట్ పదవి దక్కింది. గత ఏడాది అక్టోబర్ ఒకటో తేదీనే గీతా గోపీనాథ్‌ను ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్‌గా నియమించుకుంటున్నట్లు ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టీన్ లగార్డే వెల్లడించారు. ఆమె ప్రపంచంలోని అత్యుత్తమ ఆర్థికవేత్తల్లో ఒకరని ఆయన ప్రశంసించారు. గీతాగోపీనాథ్ ఐఎంఎఫ్‌కు 11వ చీఫ్ ఎకనమిస్ట్. తనకు ఈ పదవి దక్కడం చాలా అరుదైన గౌరవంగా గీత ఆనందిస్తున్నారు. అలాగే ప్రస్తుత ప్రపంచీకరణ నుంచి వెనక్కి తగ్గడం, సుంకాలు పెంపు వంటివి నేడు పెద్ద సవాళ్లుగా మారాయని, ఫలితంగా బహుళ జాతి సంస్థలకు ఇబ్బందులు పెరిగాయని గీత వెల్లడించారు.