సబ్ ఫీచర్

కలెక్టర్ కూతురు అంగన్‌వాడీలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీతులు చెప్పడం వేరు, ఆచరించి చూపడం వేరు. తెలుగు భాష మాధుర్యం, మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి అని చెబుతున్న నేతలు, తమ పిల్లలను లక్షలు పోసి ఇంగ్లీషు మీడియం స్కూళ్లలో చదివిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్ స్కూళ్లకంటే అద్భుతంగా తీర్చిదిద్దామని చెబుతున్న నేతలు తమ వారసులను మాత్రం కార్పొరేట్ స్కూళ్లకే పంపుతున్నారు. అందుకే వారి మాటలను జనం పట్టించుకోవడం లేదు. అయితే అందరూ అలా ఉండరు. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న శిల్ప తన ముద్దుల కూతురిని అంగన్‌వాడీ బడికి పంపుతోంది. ప్రభుత్వ పాఠశాలలంటే ప్రజల్లో ఉన్న చిన్నచూపును తొలగించడానికే ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. అంగన్‌వాడీ బళ్లు కూడా శుభ్రంగానే ఉంటున్నాయని, పిల్లలను పంపాలని ఆమె చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే..
తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలి జిల్లా కలెక్టర్ శిల్పా ప్రభాకర్ సతీశ్ తన కుమార్తెను అంగన్‌వాడీ కేంద్రంలో చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. 2009 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి అయిన శిల్ప తిరునల్వేలి కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును మెరుగుపరిచేందుకు ఎంతగానో కృషిచేస్తున్నారు. పిల్లల జీవితం బాగుండాలని, వారి భవిష్యత్తుకు పునాది వేయాలనే ఉద్దేశ్యంతో ఇప్పుడు పేద, మధ్యతరగతి ప్రజలు కూడా ఖర్చు ఎక్కువైనప్పటికీ కార్పొరేట్ స్కూళ్లలోనే చేరుస్తారు. అలాంటిది ఒక జిల్లాకి కలెక్టర్‌గా ఉండే వ్యక్తి తన పిల్లలను ఎక్కడ చదివిస్తారు? జిల్లాలోనే అత్యుత్తమ పాఠశాలను ఎంపిక చేసి మరీ అక్కడ చేరుస్తారు. కానీ కలెక్టర్ శిల్ప మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. తన కుమార్తెను అంగన్‌వాడీ కేంద్రంలో చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి శిల్ప అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును మెరుగుపరిచేందుకు ఎంతగానో కృషి చేస్తున్నారు. ఆమె శ్రమ ఫలించి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ‘ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలూ ఉన్నాయి. కార్పొరేట్ నర్సరీ స్కూళ్లలో మాదిరిగానే ఇక్కడా అన్ని సదుపాయాలు ఉన్నాయి. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. వారు పిల్లలను ఆడిస్తారు, చదివిస్తారు. ముందు ముందు అంగన్‌వాడీ సెంటర్లను మరింత అభివృద్ధి చేయాలి’ అని శిల్ప చెబుతున్నారు. ఆమె నిర్ణయాన్ని ప్రజలందరూ ఎంతగానో మెచ్చుకుంటున్నారు.