సబ్ ఫీచర్

ముంగిళ్లలో ముగ్గులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శుచిత్వం, ఆచారం, అలంకార ప్రియత్వం, కళా ప్రదర్శనం, ఆరాధనా విధానానికి సంకేతాలు రంగవల్లులు. శుభ్రంగా ఊడ్చి, కళ్ళాపు చల్లి, ముంగులతో అలంకృతాలయ్యే తెలుగునాట ముంగిళ్ళు తరతరాల వారసత్వ సంస్కృతులకు ప్రతిబింబాలు. తెలుగు సీమల్లో ప్రతి ఇంటి లోగిళ్లలో ముగ్గులు వేయడం అనాదిగా వస్తున్న సాంప్రదాయాలు. అయితే ధనుర్మాస యుక్త సంక్రాంతి సంబంధిత పర్వదినాలలో వేసే ముగ్గులు పలువిధ ప్రత్యేకాలు. చుక్కలు పెట్టి, హద్దులు ఏర్పరచి, గీతలను సున్నితంగా కలపడంలో, మెలికలు తిప్పడంలో కళానైపుణ్యాలు ప్రదర్శితాలవుతాయి. సర్వ సంపదలకూ అధిష్ఠాన దేవతయైన అష్టలక్ష్మికి ఇంటి తల వాకిట పీఠం వేయబడుతుంది. కనుమనాడు వాకిళ్ళను మూసేసే ముగ్గు కూడా వేసి, లక్ష్మీదేవిని బయటకు వెళ్ళనీయకుండా వాకిళ్ళను మూసివేసే ముగ్గులు పెడతారు. నెమళ్ళు, హంసలు, రామచిలుకలు, గరుత్మంతులు, మత్స్య కూర్మాది అవతారాలు అందానికి ప్రయోజకత్వానికి, మెలికలు తిప్పడంలో కళాభిజ్ఞతను తెలియ జేస్తాయి. స్వర్గ ద్వారాలు తెరిచి ఉంచే ముగ్గు, గుమ్మడి పండు ముగ్గు, సూర్య రథాల ముగ్గు, చుక్కల రథాల ముగ్గు ఉత్తరాయణంలో ప్రత్యక్ష దైవమైన సూర్య గమనాన్ని సూచించే ముగ్గులు. ముగ్గులలో గణిత శాస్త్ర సంబంధిత కోణాలు, త్రిభుజాలు, చతుర్భుజాలు, త్రికోణాలు, దీర్ఘ చతురస్రాలు, అష్ట కోణాలు, సమాంతర రేఖలు చోటు చేసుకుంటాయి. రాళ్లు రప్పలూ లేకుండా ముంగిట అలంక బడిన నేల...మేఘాలు లేని గగనతలం. అందలి చుక్కలు రాత్రి వేళల కానవచ్చే నక్షత్రాలు. చుక్కల చుట్టూ తిరుగుతూ గళ్ళల్లో చుక్కలను పదిలపరిచే ముగ్గులు ఆకాశంలో కనిపించే మార్పులకు సంకేతాలు. ముగ్గు మధ్యలో చుక్క అనాదిగా సూర్య కేంద్రక సిద్దాంతానికి ఆధార భూతమైన సూర్య స్థానానికి సంకేతం. గీతలు స్థిత శక్తికి, చుక్కలు గతి శక్తికి సంకేతాలని, ముగ్గులు శ్రీచక్ర సమర్పణా సంకేతాలని తత్వవేత్తల భావన. విల్లు ధనుర్రాశికి, ప్రతీక అయినట్లు మేక, ఎద్దు, సింహం, పీత, చేప లాంటివి నవగ్రహాలకు గుర్తులుగా ముగ్గులు వేస్తారు. భూమికి ఉన్న దక్షిణ దిక్కులో దక్షిణ ధృవం ఉంటుంది. దానినుండి వచ్చే అయస్కాంత శక్తులనే పిశాచాలు, రాక్షసులు అని ప్రాచీనులు చెప్పేవారు. పాములు కూడా దక్షిణ దిశనే ఎక్కువగా సంచరిస్తుంటాయి. అవి ఇళ్ళల్లోకి ప్రవేశించనీయ కుండా వాకిలి ముందు ముగ్గులు వేయడం, అవి బియ్యపు పిండితో వేయడం అత్యంత ప్రాచీన కాలం నుండి ఉంది. ఇంటి ముందున్న పిండి తిని సూక్ష్యజీవులు ఇళ్ళల్లోకి రాకూడదనే భావన ఇందు ఇమిడి ఉంది. మూడు రోజులు బంధుగణ సమేతులై అనందోత్సాహాలను పంచుకున్న అనంతరం పండగను సాగనంపేందుకే రథం ముగ్గు వేస్తారు. అందరూ ఒకరికొకరు తోడుగా, కలసి మెలసి సహజీవనం గడపాలనేదే ఒక రథం తాడును, పక్క ఇంటి రథం ముగ్గుతో కలిపే రథం ముగ్గు వెనక ఉండే భావం.

-సంగనభట్ల రామకిష్టయ్య 9440595494