సబ్ ఫీచర్

కొంత స్ఫూర్తినివ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిశ్రమలో బయోపిక్‌ల ట్రెండ్ మాంచి ఊపుమీదుంది. గొప్పోడు అనిపించుకున్నవాడి కథను తెరకెక్కించేందుకు దర్శకులు ఉత్సాహం చూపిస్తేంటే, స్టార్ ఆర్టిస్టులు సైతం ఆలోచించకుండా కాల్షీట్లు కేటాయించేస్తున్నారు. బయోపిక్ అంటే ఇప్పటివరకూ సినిమా తారలు, క్రీడాకారుల జీవితాలే అనుకునే పరిస్థితి ఉండేది. బయోపిక్‌లు ముదిరి పాకానపడటంతో -విజయ సాధకుల కథలేవైనా తెరకెక్కేస్తున్నాయి. అందిరిలోనూ స్ఫూర్తినింపేలా విజయాలు సాధించిన సామాన్యుల కథలను బయోపిక్‌లుగా మలిచే పనిలోపడ్డారు దర్శక నిర్మాతలు.

రియల్ ఐరన్ లేడీ
తమిళనాడు దివంగత సీఎం జయలలిత జీవితం ఆధారంగా తమిళ దర్శకురాలు ప్రియదర్శిని ‘ది ఐరన్ లేడీ’ అనే టైటిల్‌తో బయోపిక్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. జయలలిత పాత్రలో టాలెంటెడ్ హీరోయిన్ నిత్యమీనన్ నటిస్తోంది. కాగా ‘ది ఐరన్ లేడీ’లో నటించడం గురించి మొదటిసారిగా నిత్యామీనన్ మాట్లాడుతూ జయలలితపై ఉన్న అభిమానం, గౌరవమే నన్ను ఆమె పాత్రలో నటించేలా చేసిందని, ఆమె జీవితం గురించి తెలుసుకుంటుంటే ఆమెపై అభిమానం రెట్టింపు అవుతుందని.. నిజంగా రాజకీయాల్లో ఆమె సాధించిన విజయాలు ఇంకెవ్వరివల్ల సాధ్యంకావని నిత్యామీనన్ చెప్పుకొచ్చింది. ఇటీవలే జయలలిత పాత్రలో ఉన్న నిత్యామీనన్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ లుక్‌లో నిత్యామీనన్ అచ్చం జయలలితలాగా ఆకట్టుకుంది. జయలలితలాంటి బలమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించాలంటే నిత్యామీనన్ లాంటి బలమైన నటి అయితేనే పాత్రకు న్యాయం జరుగుతుందని దర్శక నిర్మాతలతో అమ్మ అభిమానులు కూడా భావిస్తున్నారు. మరి జయలలిత పాత్రకు నిత్యమీనన్ ఎంతవరకు న్యాయం చేస్తుందో చూడాలి.

రియల్ హీరోల కథల్ని రీళ్లలోకి మలిచే విషయంలో హాలీవుడ్‌ది అందెవేసిన చేయి. ఇప్పుడిప్పుడే మనవాళ్లూ ఆ గొప్పను అదుకోడానికి బలమైన ప్రయత్నాలే చేస్తున్నారు. అనేక రంగాల్లో అద్భుత విజయాలు సాధించి ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా నిలిచినోళ్ల రియల్ స్టోరీస్ రీల్ స్టోరీలు అవుతున్నాయి. వైవిధ్యమైన కథల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్న దర్శక నిర్మాతలూ బయోపిక్‌లపై మోజు పెంచుకుంటున్నారు. ఆదర్శప్రాయ విజయాలు సాధించిన వ్యక్తులు దేశంలో లెక్కలేనంత మంది. వాళ్లు పదిమంది దృష్టిలో పెడినోళ్లు కావొచ్చు, కాకపోనూ వచ్చు. అలాంటివాళ్ల జీవితాల్లోని ఎత్తుపల్లాలను చూపించి, సినిమా కథగా చెప్పాలన్న ఆసక్తి క్రమంగా పెరుగుతోంది.
**
ఒకప్పుడు -తోమర్, మిల్కా సింగ్, ధోనీలాంటి క్రీడాకారుల కథలు తెరకెక్కి సక్సెస్‌లు అందించాయి. సిల్క్ స్మిత జీవితాన్ని ‘డర్టీ పిక్చర్’గా చూపించినపుడూ -జనం ఆహా అన్నారు. అంతెందుకు ఇటీవలే సావిత్రి జీవితాన్ని ‘మహానటి’గాను, యన్‌టిఆర్ సినీ జీవితాన్ని ‘కథానాయకుడు’గానూ తెరకెక్కిస్తే ఆదరించకపోలేదు. ఇలా బయోపిక్‌ల రుచి చిక్కబడటంతో -వివిధ రంగాల్లోని వ్యక్తుల కథలూ త్వరలోనే తెరపై కనిపించే పరిస్థితి కనిపిస్తోంది. అలాంటి కథలను తెరకెక్కించేందుకు నిర్మాత, దర్శకులు ఉవ్విళ్లూరుతుంటే -ఆయా పాత్రల్లో లీనమయ్యేందుకు స్టార్ ఆర్టిస్టులూ ఆసక్తి చూపుతున్నారు. అలాంటివాటిలో ఇప్పటికే మనకు తెలిసిన కథలను చర్చించుకుంటే -దీపికా పదుకొనే ప్రత్యేకంగా కనిపిస్తోంది. యాసిడ్ దాడికి గురైనప్పటికీ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తోన్న ఢిల్లీవాసి లక్ష్మీ అగర్వాల్ పాత్రలో దీపిక కనిపించనుంది. లక్ష్మీ స్ఫూర్తిని పదిమందికీ చూపించేందుకు దర్శకురాలు మేఘనా గుల్జార్ సిద్ధమైంది. అలాగే -ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌తో శెహబాష్ అనిపించుకున్న మహిళా పైలెట్ గుంజన్ సక్సెనా కథా తెరకెక్కుతోంది. కార్గిల్ యుద్ధ సమయంలో ఆమె ప్రదర్శించిన ధైర్య సాహసాలే ప్రధాన ఇతివృత్తంగా ఆమె కథను తెరకెక్కిస్తుంటే, గుంజన్ పాత్రలో జాన్వీ కఫూర్ కనిపించనుంది. భారతీయ ఖగోళ శాస్తవ్రేత్త రాకేశ్ శర్మ జీవితాన్ని ‘సారే జహాసె అఛ్చా’గా తెరకెక్కించే ప్రయత్నంలో ఆ పాత్రను షారుక్ పోషిస్తుంటే, 1950-63నాటి ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ బయోపిక్‌లో బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గన్ కనిపించబోతున్నాడు. పేద పిల్లల ఫుట్‌బాల్ శిక్షణ కోసం ‘స్లిమ్ సాకర్’ అంటూ స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేసిన విజయ్ బార్సే కథను నాగర్ ముంజాలే తెరకెక్కిస్తుంటే, ఆ పాత్రలో అమితాబ్ ఒదిగిపోనున్నాడు. సిక్కు యోధుడు ఫతేసింగ్ కథకోసం రాజ్‌కుమార్ సంతోషి, వివేకానందుడి వెబ్ సిరీస్ కోసం వివేక్ ఓబెరాయ్‌లు కష్టపడుతున్నారు. ఇక రాజకీయ రంగం, ఆర్థిక రంగం, సామాజికవేత్తల కథలూ బయోపిక్‌లుగా తెరకెక్కించే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.
ఇటీవలి కాలంలో బయోపిక్‌ల పేరిట అవాస్తవాలనూ సైతం సినిమాకు మలిచేసుకుంటున్నారంటూ విమర్శలు, వివాదాలు చెలరేగుతున్న నేపథ్యంలో -వచ్చే చిత్రాలన్నీ వాస్తవికతకు అద్దంపట్టేలా ఉంటాయని ఆశిద్దాం.

-మహా