సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ రామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల
శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము - సంగ్రహ జీవిత సహితము -
అనువాదకుడు: శ్రీ చిరంతనానందస్వామి
*
సత్త్వగుణ ప్రధానమగు విద్యామాయ శరణుజొచ్చితి మేని మనల నది ధర్మమార్గమున నడిపి భగవంతుని బొందించును. భగవత్సాక్షాత్కారము నొందినవాడే మాయారూపమైన సంసారసాగరమును దాటుచున్నాడు. భగవంతుడే కర్తయనియు స్వయముగా తాను అకర్తననియు అశక్తుడననియు గ్రహించునతడు జీవన్ముక్తుడగుచున్నాడు. అనగా ఈ శరీరమునుండగనే ముక్తుడగుచున్నాడు.
ముక్తునియందలి అహంకారము
129.అహంకారము ఎన్నడును పూర్తిగా నశింపదా? కాలపరిపాకమున కలువరేకులు రాలిపోవును. కాని వాని గురుతులు నిలిచియుండును. అటులనే ఈశ్వర సాక్షాత్కారము పొందునేని నరుని అహంకారము పూర్తిగా తొలగిపోవును, కాని దాని జాడలు మాత్రము నిలిచియుండును. ఐనను దాని వలన నెట్టి హాని గలుగదు.
130.్భగవత్సాక్షాత్కారము నొందినవాడే నిజమైన జ్ఞాని. అతడు పసిబాలుడు బోలును. బాలునికి గూడా నొక వ్యక్తిత్వము ఉన్నటులే తోచును. కాని అది పైకి గాన్పించునదే కాని వాస్తవమైనది కాదు. వయసు వచ్చినవారి వ్యక్తిత్వ భావముతో- అహంకారముతో-బోల్చి చూచినయెడల పసివాని అహంకారము ఒక అహంకారమే కాదు.
131.సప్తమ భూమికను లేదా ఉత్తమమైన సమాధి స్థితిని బొంది బ్రహ్మ భావమున లయముగాంచిన మహాత్ములు కొందరు ఉందురు. వారు లోక శ్రేయముగల్గింప కరుణ కలవారై తమ మహోన్నత స్థితి నుండి దిగివత్తురు. అట్టివారు విద్యారూపమైన అహంకారమును- ఉత్తమాత్మభావమును నిలుపుకొనియే యుందురు. కానీ రుూ అహంకారము పేరునకు మాత్రమే. ఇది నీటిమీద గీచిన గీతను బోలియుండును.
132.తగులబడిన త్రాటికి పూర్వపు ఆకారమున్నను అది దేనిని కట్టుటకు పనికిరాని చందమున జ్ఞానాగ్నిచే దగ్ధమైన అహంకారము (కర్మబంధమును గల్గింపశక్తిలేనిదై) ఉండును.
133.ఎవ్వడో తనను ఖండ ఖండములుగా నరికివేయుటకై వచ్చుచున్నటుల ఒకడు కలగాంచును. అడలిపోయి మేల్కొనును. కన్నులు విప్పి చూడగా గదిలోపల గడియ వేయబడియే యుండును. గదిలో తాను తప్ప మరెవ్వరును ఉండరు. అయినను కొన్ని నిమిషముల వరకు వాని గుండెలు దడదడ కొట్టుకొనుచునే యుండును. అటులనే మన అభిమానము లేదా అహంకారము మనలను వీడి చనునప్పుడు గూడా దాని వడి కొంతవరకు శేషించియే యుండును.
134.సమాధి స్థితిని బొందిన పిమ్మట కూడా భగవత్సేవకుడనను అహంకారముగాని, భగవద్భక్తుడనను అహంకారముగాని కొందరు నిలుపుకొందురు. శంకరాచార్యులు ఇతరులకు బోధించుటకై విద్యా రూపమగు నహంకారమును నిలుపుకొనిరి.
135. హనుమంతుడు భగవంతుని సాకారునిగను నిరాకారునిగను కూడా దర్శించు భాగ్యము పొందెను. ఐనను ఆతడు భగవత్సేవకుడనను అహంకారమును నిలుపుకొనెను. నారద సనక సనత్కుమారుల విషయము కూడా నిట్టిదే.
ఒక భక్తుడు: నారదాదులు బ్రహ్మజ్ఞానము బొందిన వారే. కాని వారు గలగలలాడుచు బ్రవహించు సెలయేటి చందనమున భగవద్గుణానుభవ కథనము స్తోత్రములను సాగించుచువచ్చిరి. తరుణోపాయమగు తత్త్వములను జనులకు బోధించుటకై విద్యారూపమైన రుూ అహంకారమును- వ్యక్తిత్వపు జాడను- భగవంతుని నుండి తాము వేరను స్పృహ గలుగుటకై లేశమైన రుూ అహంతను నిలుపుకొనినవారని తెలియనగును.
ఇంకావుంది...