సబ్ ఫీచర్

అతినిద్రతో అనర్థాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిద్రపోవడం అంటే ఇష్టంలేనివారు ఎవరూ ఉండరు. సాధారణంగా ఉద్యోగస్తులైతే ఒక్కరోజు సెలవు దొరికితే చాలు, హ్యాపీగా నిద్రపోవాలి, రెస్ట్ తీసుకోవాలి అనుకుంటారు. ప్రతి ఒక్కరికీ నిద్ర చాలా అవసరం. ఎంత అవసరం అంటే ఆరోగ్యానికి మంచి చేసేంతవరకు మాత్రమే. పనులు ఒకే ఒక్కరోజులో పూర్తయ్యేవి కావు. నిద్రమత్తువలన పనులపై సరైన విధంగా ఆసక్తిని చూపడం చాలా కష్టం. నిద్రను దూరం చేసుకోవడంవల్ల కలిగే రోగాలు, నష్టాల గురించి చాలామందికి తెలుసు. నిద్రే రోగంగా మారి పీడిస్తుంటే.. నిద్ర వద్దు బాబోయ్ అని ఎంత పట్టుదలగా వున్నా తెలియకుండానే నిద్రలోకి జారుకుంటే.. ఒకటికాదు రెండు కాదు ఏకంగా రోజుల తరబడి నిద్రలోనే ఉండిపోతే.. పరీక్ష కాలం వచ్చిందంటే చాలు పుస్తకాన్ని పట్టగానే నిద్ర ముంచుకొస్తే.. వాహనం నడుపుతున్నపుడు చిన్న కునికిపాటు.. యాక్సిలేటర్ తొక్కుతున్నామో, బ్రేక్ వేస్తున్నామో తెలియక నియంత్రణ కోల్పోయి రెప్పపాటులోనే జీవితాలు గాల్లో కలిసిపోతే.. వంట చేస్తూ ఉన్నట్లుండి నిద్రపోతే, ఆఫీసులో రాస్తూ రాస్తూ అకస్మాత్తుగా నిద్రపోతే... తింటూ ఉండగానే డైనింగ్ టేబుల్‌పైన వాలిపోతే.. ఏంటీ విచిత్రం అని అనుకుంటున్నారా? అస్సలు నమ్మలేకపోతున్నారా? ఎవరు నమ్మినా నమ్మకపోయినా నిద్ర ఓ సమస్యగా మారి ప్రపంచాన్ని వేధిస్తోంది.
ఆరోగ్యానికి హానికరం..
మంచి ఆరోగ్యానికి రోజుకి కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవాలని మనకు తెలిసిన విషయమే. మంచి నిద్ర ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో.. అతి నిద్ర అంత హాని కూడా చేస్తుందని అమెరికాకు చెందిన న్యూయార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన పరిశోధకుల పరిశోధనల్లో వెల్లడైంది. అతిగా నిద్రపోయేవారికి గుండెపోటు వచ్చే అవకాశాలు 146 శాతం అధికంగా వున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.
మెలకువ వచ్చినా లేవలేరు..
నిద్రపోయినపుడు పిలిస్తే లేసేవాళ్ళు కొందరు, ఒక్కసారి ముట్టుకుంటే చాలు ఉలిక్కిపడి లేచి కూర్చుంటారు మరికొందరు. కానీ అతి తక్కువ శాతం మంది మాత్రం ఎంత పిలిచినా ఉలకరు పలకరు. మెలకువ వచ్చినా లేవలేరు కూడా. నిద్రలేమివల్ల వచ్చే రోగాలతో పాటు నిద్రరోగాలు కూడా ప్రపంచాన్ని, ఈ సమాజాన్ని వేధిస్తున్నాయి.
డిప్రెషన్..
నిద్రలేమివల్ల డిప్రెషన్‌కు గురి అవుతారనేది సాధారణమైన విషయమే అయినప్పటికీ, అధిక నిద్రవల్లకూడా డిప్రెషన్‌కు లోనవుతారని రీసెర్చ్‌లలో తేలింది. రెగ్యులర్ సమయాల్లో నిద్రపోవడం చాలా అవసరం. ఎక్కువగా నిద్రపోవడం లేదా తక్కువగా నిద్రపోవడం లేదా చాలా ఆలస్యంగా పడుకోవడంవల్ల ఊబకాయానికి దారితీస్తుంది. వారాంతంలో లేదా సెలవుల్లో నిద్రించే సమయం కంటే అధిక సమయం నిద్రపోవడంవల్ల మెదడులోని కొన్ని న్యూరోట్రాన్సిమిటర్లవల్ల అధిక తలనొప్పికి దారితీసే ప్రమాదముంది.
కారణాలు ఇవీ..
శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, మనసులో అలజడి, మానసిక ఒత్తిడి మితిమీరిన స్థాయిలో ఆల్కహాల్ ద్రావణాలను తాగుట, పని ఒత్తిడి, రాత్రిపూట ఎక్కువగా సెల్‌ఫోన్‌ను ఉపయోగించడం, కంప్యూటర్, టీవీ ఎక్కువగా చూడటంవల్ల అతినిద్ర సమస్య తలెత్తుతుంది.
నిద్రమత్తును జయించండిలా..
సమయపాలనతో కూడిన నిద్రవలన రోజంతా ఉండే నిద్రమత్తు నుండి ఉపశమనం పొందవచ్చు. ప్రతిరోజు ఒకే సమయంలో నిద్రపోవటానికి ప్రయత్నించండి మరియు రోజూ ఒకే సమయానికి మేల్కొనండి. ఇలా చేయడంవలన శరీరానికి నిద్ర సమయం అలవాటుపడుతుంది.
సరైన సమయంలో పడుకోవాలి
ఎంచుకున్న నిద్ర సమయం సరిపోయేంతలా ఉండాలి. నిద్ర సమయం అనేది ఒక్కొక్కరికీ ఒక్కో రకంగా వుంటుంది. కొంతమంది 8 గంటలపాటు పడుకుంటే రోజంతా హుషారుగా వుంటే, మరొకరికి 5 గంటల నిద్రతో హుషారుగా వుంటారు. కావున ఎంత సమయం పాటూ నిద్ర సరిపోతుందో తెలుసుకొని, దానికి తగిన విధంగా నిద్ర సమయాన్ని కేటాయించుకోవాలి.
ఆల్కహాల్‌కు దూరం
ఆల్కహాల్‌కు దూరంగా వుండే ప్రయత్నం చేయాలి. రోజూ ఉదయాన లేవగానే కాఫీ లేదా టీ తాగటంవలన నిద్రమత్తు నుండి ఉపశమనం పొందుతారు.
ఉదయం వ్యాయామం
ఉదయాన వ్యాయామాలు చేయటంవలన రోజంతా చురుకుగా ఉంటారు. కనీసం అరగంట పాటు చేసే వ్యాయామాలవలన నిద్రమత్తునుండి ఉపశమనం పొంది, రోజులో ఉండే పనులను చురుకుగా నిర్వహిస్తారు.
ఆరోగ్యకరమైన స్నాక్స్...
జంక్‌ఫుడ్‌కు బదులుగా ఆరోగ్యకరమైన స్నాక్స్ తినటంవలన నిద్రమత్తు దరి చేరదు. కూరగాయలు, పండ్లనుండి మన శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. పోషకాలు ఎక్కువగా అందటంవలన శక్తి ఉత్పత్తి త్వరగా జరగడంవలన నిద్రమత్తునుండి కూడా ఉపశమనం పొందుతారు.
ఒత్తిడికి యోగ విరుగుడు..
మానసిక ఒత్తిడిని జయించేలా యోగ, ధ్యానం వంటివి చేయాలి. నిద్రమత్తును తొలగించుకొని, రోజంతా చురుకుగా ఉండవచ్చు.

- డా అట్ల శ్రీనివాస్‌రెడ్డి 97039 35321