సబ్ ఫీచర్

తెలుగు సాహిత్యంతో ధర్మపురి బాంధవ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షణ వికాస శ్రీ్ధర్మపుర నివాస దుష్టసంహార నరసింహ దురితదూర’’ అనే మకుటంతో భక్తాగ్రేసరుడు, స్థానికుడు శేషాచలదాసు రచించిన నరసింహ శతకంలోని పద్యాల మాధుర్యాన్ని ఆస్వాదించని తెలుగువాడుండడంటే అతిశయోక్తి కాదేమో. కరీంనగరంకు 71 కి.మీ.ల ఉత్తరాన, జిల్లా కేంద్రమైన జగిత్యాలకు 27 కి.మీ.ల ఈశాన్యాన, తెలుగునాట సుప్రసిద్ధ ప్రాచీన పుణ్య క్షేత్రంగా, దక్షిణ కాశిగా, హరిహర క్షేత్రంగా, నవనారసింహ క్షేత్రాలలో నొకటిగా పేరెన్నికగని పవిత్ర గోదావరి తీరాన వెలసిన ధర్మపురి క్షేత్రానికి తెలుగు భాష, సాహిత్యాలతో అవిభక్త బాంధవ్యం ఉంది. బ్రహ్మాండ, స్కాంద పురాణాలలో, బౌద్ధ, జైన వాఙ్మయాలలో, మడికె సింగన పద్మపురాణోత్తర ఖండంలో, చరికొండ ధర్మన చిత్రభారతంలో, కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రింశికలో, ఏకామ్రనాథుని ప్రతాపరుద్ర చరిత్రలో, నృసింహదాసు మైరావణ చరిత్రలో, పింగళి సూరనార్యుని కళాపూర్ణోదయంలో, పోతనామాత్యుని నారాయణ శతకంలో, శేషప్ప విరచిత - నరహరి, నృసింహ, నృకేసరి శతక త్రయంలో, కాకతీయానంతర శాసనాలలో, మధ్యయుగ దానపత్రాలలో, ధర్మపురి క్షేత్ర ప్రాశస్త్యం ప్రశంసింపబడింది. ధర్మపురి క్షేత్రం మొదట జైన, బౌద్ధ యుగములందు ఆర్షవిద్యా ప్రచార కేంద్రమై, విదర్భరాజ్య పోషణలో మున్యాశ్రమంగాయుండి, తర్వాత శాతవాహన, బాదామి చాళుక్య, రాష్టక్రూట, కల్యాణి చాళుక్య, కాకతీయ, రేచర్ల వెలమల మరియు నైజాం రాజుల ఏలుబడిలో అద్వితీయ వైభవాన్ని అనుభవించింది. స్థానిక ప్రాచ్య డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రాచార్యులు డాక్టర్ సంగనభట్ల నర్సయ్య విశేష పరిశోధనలు చేశారు.
బోధన్ వాస్తవ్యులు భవభూతి ఉత్తర రామచరితలో ధర్మపురి గోదావరిని వర్ణించారు. కన్నడ ఆదికవి పంపమహాకవి ఇమ్మడి అరికేసరి ద్వారా ధర్మపురి అగ్రహారాన్ని దానంగా పొందడంతో కన్నడ సాహిత్య చరిత్ర గ్రంథాలలో ధర్మపురి చోటు చేసుకుంది. 1290లో చతుర్వర్గ చింతామణి విరచించిన దేవగిరి యాదవరాజు వద్ద మంత్రిగా పని చేసిన హేమాద్రి ధర్మపురి వాడనని చెప్పుకున్నాడు. రామగిరిని పాలించిన ముప్ప భూపాలుని కొలువున గల కందనామాత్యునికి మడికె సింగన పద్మపురాణం (ఉత్తర ఖండం)ను అంకితమీయగా, కేసన మంత్రి ధర్మపురిలో అన్నసత్రం ప్రారంభించారని, స్వామికి ఉత్సవాలు చేయించారని పేర్కోన్నారు. కాసె సిద్దప్ప రాసిన సిద్దేశ్వర చరిత్రలో ధర్మపురి, నందగిరి రాజ్యాలను సోమేంద్రుడు, విజయార్కుడు పాలించారని పేర్కొన్నారు. ఏకామ్రనాథుడు ప్రతాపరుద్ర చరిత్రలో గోదావరి తీర ధర్మపురిని, సమీప రాజ్యాలను స్పృషించారు. దక్షిణామ్నాయ శృంగేరీ 12వ పీఠాధిపతి, కవి, దర్శన గ్రంథకర్త, విజయనగర సామ్రాజ్య నిర్మాత విద్యారణ్య స్వామి ధర్మపురిలో వేదాధ్యయనం చేసినట్లు, సామ్రాజ్య స్థాపనా సమయాన ధర్మపురి నుండి చతుర్వేద పండితులను తీసుకెళ్ళినట్లు కథనాలున్నాయి. పరమ భాగవతోత్తముడు బమ్మెర పోతన నరసింహునిపై ధర్మపురి లక్ష్మీనాథ నారాయణా అనే మకుటంతో నారాయణ శతకం లిఖించారు.
కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రింశిక కథా ప్రబంధంలో 21వ కథలో ధర్మపురిని పేర్కొన్నారు. ధర్మపురి వాసియైన తొలి ప్రబంధ కర్త చరికొండ ధర్మన్న చిత్ర భారతాన్ని, అందులో ఆశ్వాసాది పద్యాలు ధర్మపురి స్వామిపై రాసారు. పింగళి సూరనామాత్యుడు కల్పిత కావ్యమైన కళాపూర్ణోదయంలో గోదావరీ సరిత్సమీప పరిదృశ్యమాన ధర్మపురీ నామ నగర మని వివరించారు. కాకుస్తం శేషప్ప నరసింహ, నృకేసరి, నరహరి శతకాలను, ధర్మపురి రామాయణ యక్షగానం, ధర్మపరి వాసియైన కాకుత్సం నరసింహదాసు శ్రీకృష్ణ శతకం, మైరావణ చరిత్రలు యావదాంధ్ర దేశ సుప్రసిద్ధాలే. చాత్తాడ జగ్గయ్య ధర్మాంగద బతుకమ్మ పాట జానపద గేయంగా సుపరిచితమే. విశ్వనాథ సత్యనారాయణ తమ మ్రోయు తుమ్మెదలో ధర్మపురి, గుండి రాజన్న శాస్ర్తీలను పేర్కొన్నారు. కోరుట్ల కృష్ణమాచార్యులు ధర్మపురి నారసింహుని సుప్రభాతాలు రాసారు.
వి.ఎల్.ఎన్.శాస్ర్తీ, కొరిడె రామయ్య, కాకెర్ల కిష్టయ్య, సంగనభట్ల రామకిష్టయ్య, జనమంచి నర్సయ్య, గొల్లపెల్లి రాంకిషన్ (రాఖీ), ఒజ్జల నర్సయ్య, గుండి రాంకుమార్ శతకాలు, చెన్నమనేని జగన్నాథరావు ధర్మపురి నృసింహ స్తవం, అనంతయ్య లక్ష్మీనరసింహ చతుశ్శతి, కవి గణపతి రాంచందర్‌రావు లక్ష్మీ నరసింహ మద్యాక్కర శతకం, కొరిడె రాజన్న శాస్ర్తీ సుప్రభాతం ధర్మపురి కీర్తి చంద్రికలను దశదిశలా వ్యాపింప చేశాయి. గుండి శ్రీనివాస్, మాడిశెట్టి శ్రీనివాస్, రాఖీ కవితలు పండిత ప్రశంసాపాత్రతకు నోచుకున్నాయి.

- సంగనభట్ల, 9440595494