సబ్ ఫీచర్

పిల్లలకు పోషకాహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్న వయస్సులో పిల్లలకు నేర్పించే ఆహారపుటలవాట్లు భవిష్యత్తులో వారి జీవనశైలిని సరైన మార్గంలో నడిపిస్తాయి. అంతేకాదు వారి ఎదుగుదల కూడా సరిగ్గా ఉంటుంది. భవిష్యత్తులో వారికి ఎలాంటి అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. అందుకని పిల్లలకు చిన్నవయస్సులోనే సరైన ఆహారపుటలవాట్లను నేర్పించాలి.
* పిల్లలు చిన్నప్పటి నుంచీ ఆహారంతో పాటు వ్యాయామానికీ ప్రాధాన్యం ఇచ్చేలా చేయాలి. అలాగని భారీ కసరత్తులు చేయాల్సిన అవసరం లేదు. ఆరు బయట ఆటలు ఆడుకుంటే చాలు.
* పిల్లలకు ఆహార పదార్థాల పట్ల అవగాహన ఇంటి నుంచే మొదలవ్వాలి. దుకాణాల్లో కొనుగోలు చేసే చిప్స్, సోడా, జూస్ వంటివాటిని నియంత్రించి ఇంట్లోనే స్వయంగా చిరుతిళ్లూ, పండ్లరసాలు తయారుచేసి పిల్లలకు ఇవ్వాలి.
* పిల్లలు ఎక్కువగా పాలకన్నా పాల పదార్థాలను ఇష్టపడతారు. అలాంటివి ఎంచుకునే ముందు కొవ్వు పదార్థం లేని వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే పిల్లలకు పంచదార అతిగా వాడకూడదు. దీంతో వారికి చిన్నవయస్సులోనే ఊబకాయం రాకుండా ఉంటుంది.
* మాంసాహారులైతే స్కిన్‌లెస్ చికెన్‌ను మాత్రమే ఆహారంతో అందిస్తే ఆరోగ్యానికి మంచిది.
* పోషక విలువలు, మాంసకృత్తులు అధికంగా ఉండే పప్పు్ధన్యాలను రోజువారీ ఆహారంలో వాడితే వారి ఎదుగుదల బాగుంటుంది. పిజ్జా, బర్గర్ వంటివాటికి దూరంగా ఉంచగలిగితే మేలు.
* శీతల పానీయాలను కూడా చిన్నారులు ఎక్కువగా ఇష్టపడతారు. కానీ వాటిలో వాడే రసాయనాలు, చక్కెర శాతం అనారోగ్యానికి దారితీస్తాయని వివరించాలి. అంతేకాదు.. పెద్దవాళ్లు కూడా వీటిని మానేయగలిగితే పిల్లలు కూడా అదేమార్గంలో నడుస్తారు.
* కాలానుగుణంగా లభ్యమయ్యే అన్ని రకాల పండ్లు, కూరగాయలను అలవాటు చేస్తే భవిష్యత్తులో కూడా వారు వాటిని అలాగే కొనసాగిస్తారు. ఆరోగ్యంగా ఉంటారు.
* ఆహారాన్ని నమిలి మింగితే సునాయాసంగా జీర్ణమవుతుందని చెప్పాలి. అలాగే హడావుడిగా ఆహారాన్ని తీసుకోవడం మంచిది కాదనే విషయాన్నీ వివరించాలి.
* భోజనం చేసే ముందు చిరుతిళ్లను నిరోధించాలి. అలాగే భోజన సమయంలో పిల్లలను టీవీకి దూరంగా ఉంచాలి.