సబ్ ఫీచర్

‘అందాల లోకం’లో అతివ సాహసం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అందరికంటే భిన్నంగా జీవించడం లోనే అసలైన మజా ఉంటుంది..’ అంటోంది ప్రముఖ ట్రావెలర్ బ్లాగర్ రేణుకా సింగ్. పుస్తకాల్లో చదివిన దానికన్నా వివిధ ప్రాంతాలను ఒంటరిగా సందర్శిస్తూ నేర్చుకున్న విషయాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆమె చెబుతోంది. పర్యాటక ప్రాంతాలకు వెళ్లే మహిళలు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి రేణుక తన బ్లాగులో వివరిస్తుంటారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ఎలా ప్రయాణించాలో మెళకువలు బోధిస్తుంది. అందచందాల ప్రకృతిని చూసి ఆస్వాదించడంలోనే నిజమైన ఆనందం దాగుందని, మహిళలు ఒంటరి ప్రయాణాలతో సాహసాలు చేస్తే వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఆమె అంటారు.
ముంబయికి చెందిన రేణుక ఎనిమిదేళ్ల వయసులో రాజస్థాన్‌లో పర్యటించి తన విహారయాత్రలకు శ్రీకారం చుట్టారు. చిన్నతనంలో ప్రయాణించినా అప్పటి అనుభూతులు తనకు ఇప్పటికీ గుర్తున్నాయని చెబుతారు. దేశంలోని విభిన్న ప్రాంతాలను సందర్శించి, అక్కడి సంస్కృతిని తెలుసుకోవడం ఎంతో ఆనందం కలిగిస్తుందని చెబుతుంటారు. ఇటీవల సిక్కిం, డార్జిరింగ్ ప్రాంతాల్లోనూ ఆమె పర్యటించారు. ఏ ప్రాంతానికి వెళ్లివచ్చినా అక్కడి ప్రత్యేకతల గురించి తన బ్లాగులో వ్యాసాలు రాస్తుంటారు. ఆ విశేషాలు ఇతర పర్యాటకులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి.
వివిధ ప్రాంతాల్లో ప్రకృతి రమణీయతను ఆస్వాదించడం, అక్కడి ఆచారాలు, వేషభాషలు, వంటల గురించి తెలుసుకోవడం ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని రేణుక అంటారు. కొత్తవారిని చూడడం, వారితో మాట్లాడడం, కొత్త వాతావరణంలో గడపడం అంటే తనకెంతో ఇష్టమని ఆమె చెబుతోంది. కాగా, మన దేశంలో మహిళలు ఒంటరిగా విహారయాత్రలకు వెళ్లడం కత్తిమీద సాము వంటిదని ఆమె చెబుతుంది. డబ్బు ఖర్చయినా కొన్ని చోట్ల కనీస సౌకర్యాలు ఉండవంటోంది.
చాలా చోట్ల రోడ్లు సరైనవి లేవని, దీనివల్ల ప్రయాణంలో కొన్నిసార్లు విసుగు పుడుతుందని ఆమె అంటోంది. ఎలాంటి సమస్యలు ఎదురైనా తాను సవాల్‌గా తీసుకుని ముందుకు సాగుతానని వివరిస్తోంది.
సిక్కిం ప్రాంతం తనను అమితంగా ఆకట్టుకుందని, అక్కడి ప్రజల జీవన విధానం, సంస్కృతి ఎంతగానో కట్టిపడేశాయని ఆమె గుర్తు చేస్తుంటారు. ఆ ప్రాంతం సహజమైన అందాలతో పర్యాటకులకు ఆహ్వానం పలుకుతుందని అంటారు. కేరళ అందాలు కూడా చెప్పుకోదగ్గవని, అక్కడి సరస్సుల్లో హౌస్‌బోటులో ప్రయాణం చేయడం వింత అనుభూతి కలిగిస్తుందంటారు. కేరళలో వంటకాలను ఒకసారి రుచిచూస్తే వదలబుద్ధి కాదంటారు.
విహార యాత్రలో తాను రెండు ఎస్‌ఎల్‌ఆర్ కెమెరాలు తీసుకెళతానని, వాటితో తన మనసుకు నచ్చిన దృశ్యాలను చిత్రీకరిస్తానని ఆమె చెబుతుంటారు. మన దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ విస్తృతంగా పర్యటించి పల్లెటూళ్ల అందచందాలను ఆస్వాదించాలన్నదే తన లక్ష్యమని రేణుక చెబుతారు. మన మనసుకు నచ్చిన పనిని సమర్థవంతంగా చేయగలిగితే- ఇతరులకు స్ఫూర్తిదాతలుగా నిలుస్తామని ఆమె అంటారు.
-లావణ్య
రేణుకా సింగ్

సిక్కింలో వృద్ధమహిళతో..