సబ్ ఫీచర్

తమిళ నాట తెలుగు నిలిపిన ఘనుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మ ప్రాంతాల తెలుగును ఇతరులు ఈసడించినా, తాము తెలుగు వాళ్ళమని, తమ భాషను పరిరక్షించుకోవడం తమ కర్తవ్యమని దక్షిణ భారతంలోని ముఖ్యంగా తమిళనాడులోని తెలుగువారు ఆరు దశాబ్దాల క్రిందటే భావించారు. సాధు వరదరాజం పంతులుగారి అకుంఠిత దీక్షవల్ల తమిళనాడులో కొడిగట్టుతున్న తెలుగుదీపం స్నేహప్రాప్తిని పొంది మళ్ళీ వెలుగుతూంది.
వరదరాజం పంతులుగారు తిరునల్వేలి జిల్లాలోని వీరరాఘవపురంలో 1889 ఆగస్టు 20న జన్మించారు. వీరి తండ్రి సాధు రామకృష్ణయ్య పంతులుగారు వివిధ ప్రభుత్వోద్యోగాలలోను, ఎట్టియాపురం సంస్థానంలో దివాన్‌గారు పనిచేశారు. ఎట్టియాపురం తెలుగురాజులు తెలుగు సంగీత సాహిత్యాలను పోషించినవారు. ఆంధ్ర మహాభారతాన్ని తమిళ భాషలో వచన రూపంగా అనువదింపజేసి ప్రకటించారు. సాధు వరదరాజం పంతులు తమిళం బాగా అభ్యసించారు. పట్ట్భద్రులయిన తర్వాత మద్రాసు విశ్వవిద్యాలయంవారి ఘౄజ జళనజష్యశ (తమిళ శబ్దకోశం) కార్యాలయంలో ఒక చిన్న గుమాస్తాగా చేరి ఆఫీసు మేనేజరుగా చాలాకాలం పనిచేసి రిటైర్ అయ్యారు. తమిళ నిఘంటు కార్యాలయంలో పనిచేస్తున్నప్పుడు ఆయనకు తెలుగు మీద అభిమానం ఏర్పడింది. తెలుగు మాట్లాడడం వచ్చినా వ్రాయడం, చదవడం రాదు. తెలుగు సాహిత్యంతో పరిచయం లేదు. ఈ లోపాలకు ఆయన సిగ్గుపడి తెలుగు లిపి నేర్చుకున్నాడు. తెలుగు శతకాలు, భాస్కర, రామాయణం, పోతన భాగవతం, వీరేశలింగంగారి రచనలు, ఆంధ్రపత్రిక దినం దినం చదివారు. తన యింట్లోవాళ్ళకు తెలుగు నేర్పారు. వరదరాజం పంతులుగారి భార్య జయలక్ష్మమ్మ, కుమారుడు శివ సుబ్రహ్మణ్యం తెలుగులో ప్రావీణ్యం సంపాదించారు. వరదరాజం పంతులుగారి ఉద్యమానికి తోడ్పడ్డారు. ఆయన తమిళనాడులోని తెలుగువారిలో క్షీణిస్తున్న తెలుగుకు ప్రాణంపోశారు. పనిగట్టుకొని స్వంత ఖర్చులతో ఊరూరు ఎక్కే గుమ్మం, దిగే గుమ్మంగా పర్యటించి తరతరాల తెలుగును ఎగసన తోశారు.
తమిళనాడులోని తెలుగువాళ్ళకు చాలామందికి తెలుగు లిపి తెలియదు. భాషావ్యాప్తికి లిపి అడ్డం రాకూడదు. తంజావూరులో మహారాష్ట్ర రాజులు తెలుగు కావ్యాలను నాగదలిలో వ్రాయించుకొని చదివారు. ఆంగ్లేయులు సంస్కృతాన్ని రోమన్ లిపిలో ముద్రించుకొన్నారు. నేడు కూడా సైన్యంలో హిందూస్తానీకి లిపి రోమన్ లిపే. సింధులో అరబ్బీ లిపిలో సంస్కృత గ్రంథాలున్నాయి. సాధు వరదరాజం పంతులుగారు తమిళనాడులో తెలుగు ప్రచారానికి తమిళ లిపిలో తెలుగు రచనలను అచ్చువేయించారు. ‘‘దక్షిణాంధ్ర పత్రిక’’ అనే ఒక పత్రికను పెట్టి ఉచితంగా ప్రతులను పంపారు.
వరదరాజం పంతులుగారి పుణ్యమా అని తమిళనాడులోని తెలుగువారు తమ భాషకు, యాసకు సిగ్గుపడడం మానేశారు. ఆయనకు ‘దక్షిణాంధ్ర పితామహ’, ‘్భషోద్ధారక’ అనే బిరుదులు ఇచ్చి గౌరవించారు. వరదరాజం పంతులుగారు ‘‘దయచేసి తెలుగును కాపాడుడు’’ అనే పెద్ద బ్యానరును భుజానికి తగిలించుకొని కాలికి బలపం కట్టుకొని తమిళ దేశమంతా తిరిగారు. ఆయన ఉద్యమం ఫలించింది. ఈ విధంగా తెలుగు వ్యాప్తికి, పరిరక్షణకు జీవితం వెచ్చించి ధన్యులైన వరదరాజం పంతులుగారు 1972లో 83వ ఏట కాలధర్మం చెందారు.
*
(డా. నాగసూరి వేణుగోపాల్
సంపాదకత్వంలో వెలువడిన
‘దక్షిణాంధ్ర దారిదీపాలు’ పుస్తకం నుంచి...)
*

- తిరుమల రామచంద్ర