సబ్ ఫీచర్

విదూషక పాత్రలో గద్దర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో 16 స్థానా లు గెలుస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు విసిరిన సవాల్‌ను తాను ఛాలెంజ్‌గా తీసుకుంటున్నట్టు ప్రజా గాయకుడు గద్దర్ ఈమధ్య ఓ సన్మాన సభలో ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల వేడి ఇంకా రాజుకోలేదు, కేసీఆర్ అలాంటి సవాల్ విసరనూ లేదు. 16 స్థానాలు గెలుస్తామని సందర్భోచితంగా చెప్పిన దాన్ని ‘విసిరిన సవాల్’గా భావిస్తే ఏమిటి అర్థం? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి ప్రతిపక్షాలు ఇప్పటికీ ఊపిరి తీసుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో గద్దర్ ఇలా అసంబద్ధ ప్రకటన చేయడం విడ్డూరం. కేసీఆర్‌పై గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ఊదరగొట్టిన గద్దర్ ఎన్నికల బరివైపు కనె్నత్తి చూడలేదు. విపక్షాలన్నీ తనను బలపరిస్తేనే పోటీచేస్తానని మెలిక పెట్టడంలోనే ఆయన గాంభీర్యమేమిటో తేటతెల్లమైంది. ఇలా విదూషకుని పాత్రలో ఒదిగిపోయి ప్రకటనలు చేస్తూ పొద్దుపుచ్చడం గద్దర్‌కు వెన్నతో పెట్టిన విద్య. ‘సీరియస్‌నెస్’ లేని వ్యవహారాలు నడపడం ఆయన నైజం. తాజాగా కేసీఆర్ సవాల్‌ను స్వీకరిస్తున్నట్టు గద్దర్ చేసిన ప్రకటన సైతం ఆ బాపతే!
గద్దర్ ఏ రాజకీయ పార్టీకీ ప్రాతినిధ్యం వహించడం లేదు. రాజకీయ పార్టీ పెడతానని అసెంబ్లీ ఎన్నికల ముందు చాలా ఊరించాడు. గతంలోనూ ఆ ప్రయత్నం తీవ్రంగా చేసినా సాధ్యం కాలేదు. దాంతో గాయకుడిగానే కొనసాగుతూ, విదూషకుని పాత్రను పోషిస్తున్నాడు. కేసీఆర్ విసరని సవాల్‌ను స్వీకరిస్తానని ప్రకటించడం వెనకాల గద్దర్ మానసిక స్థితి ఎలాంటిదో వెల్లడవుతోంది. తనకుతాను ఎక్కువగా ఊహించుకునే మానసిక వైక్లభ్యంతో ఆయన బాధపడుతున్న వైనం స్పష్టంగా అవగతమవుతోంది. గజ్వేల్‌లో పోటీచేస్తానన్న విషయాన్ని గాని, 16 ఎంపీ సీట్లు తెరాస సొంతమన్న మాటపై స్పందనను గాని పరిశీలిస్తే ఆయన అత్యుత్సాహం, అత్యాశ స్పష్టంగా వెల్లడవుతోంది. ఏ రాజకీయ పార్టీతో అనుబంధం లేకుండా, తనకంటూ ఓ పార్టీ లేకుండా సవాల్ స్వీకరించే స్థాయి ఎలా సాధ్యమో ఆయనకే తెలియాలి. ఆయన ‘సత్తా’ఏమిటో ఇటీవలి ఎన్నికల్లో తేలిపోయాక ఇప్పుడు ఇలా సవాల్ విసరడమంటే- విదూషకుని వ్యవహారంగాక ఏమవుతుంది? ఓ బాధ్యతాయుత పౌరునిగా ఇలా సమాజంలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించడం భావ్యమా? తానేమిటో, తన సత్తా ఏమిటో, స్థాయి ఏమిటో గుర్తెరిగి వ్యవహరించడంలోనే ఎవరికైనా శోభనిస్తుంది. అలాగాక హనుమంతుని కుప్పిగంతుల మాదిరి గెంతితే ఎవరికి ఉపయోగం? ఎప్పుడో ఓసారి అలా జరిగితే ఎవరైనా అర్థం చేసుకునే వీలుంటుంది. ఆ వైఖరి జీవన విధానంగా మారితే ఎలా అర్ధం చేసుకుంటారు? విదూషకుడిగానే పరిగణిస్తారు!
తన సన్మాన సభలోనే మావోయిస్టుల నినాదమైన ‘సామాజిక తెలంగాణ’ నినాదాన్ని గద్దర్ వినిపించారు. రూపం లేని, అమూర్తమైన ఆ నినాదంతో ఇప్పటికీ సమాజంలో గందరగోళం సృష్టించేందుకు పూనుకుంటే ఎలా? ఏ సమాజంలోనైనా ప్రజలందరూ ‘పెత్తనం’ చెలాయించరు. అది సాధ్యం కాదు. కాని అలా జరగాలని కోరుకోవడంలో గల ‘ఉన్మత్తత’ ఎలాంటిదో విశే్లషించుకుంటే తేటతెల్లమవుతుంది. ఆ పూటకు ఆకర్షణీయ నినాదాలు ఇచ్చి పది మంది ‘చప్పట్లు’ కొట్టగానే రెచ్చిపోయి ప్రకటనలు గుప్పిస్తే గొప్ప సమాజం వైపు అడుగులు వేసినట్టు అవదు. నిర్మాణాత్మక రీతిలో ప్రయాణం కొనసాగినప్పుడే పది మంది ప్రశంసిస్తారు. పేదలకు అది ఉపకరిస్తుంది. పేదల పేర ఇలా పచ్చి అవకాశవాద వ్యవహారాలు నడపడం ఏ మాత్రం శోభనివ్వదు. దశాబ్దాలుగా గద్దర్ శైలి, నడక, గాలివాటు వ్యవహారం అందరూ గమనిస్తూనే ఉన్నారు. కాసేపు నవ్వించి, నాలుగు ‘పంచ్’లు వేయడం, అదే దార్శనికత అని భావించడం భావ దారిద్య్రం కాదా?
అదేరోజు ఆయన ‘సేవ్ కాన్‌స్టిట్యూషన్, సేవ్ డెమొక్రసీ’ నినాదంతో త్వరలో పల్లెపల్లెలో తిరుగుతానని, ముఖ్యంగా యువత తనకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వేల చేపల్ని మింగిన పిల్లి శాంతి జపం చేసినట్టుగా ఉంది ఈ వ్యవహారం. నిన్న మొన్నటివరకు రాజ్యాంగంపై విశ్వాసం లేదని, వ్యవస్థను కూకటి వేళ్ళతో కూలదోయాలని పిలుపునిచ్చిన వ్యక్తి ఇప్పుడు రాజ్యాంగ ప్రతిని పట్టుకుని ‘సేవ్ కాన్‌స్టిట్యూషన్... సేవ్ డెమూక్రసీ...’ అంటూ పల్లెలు తిరుగుతాడట! ఇది విదూషకుని వ్యవహారంగాక ఇంకేమిటి? పార్లమెంట్ ఓ పందుల దొడ్డి అని అభివర్ణించిన వ్యక్తి ఇప్పుడు సేవ్ డెమొక్రసీ అంటూ యాత్ర చేస్తాడట. మావోయిస్టుల్లో ఒకడిగా సాయుధ మార్గంలో పాలనా వ్యవస్థను, పార్లమెంటరీ వ్యవస్థను కూల్చివేయాలని పిలుపునిచ్చిన వ్యక్తి ఆ నోటితోనే ఆ పార్లమెంట్‌ను, ఈ వ్యవస్థను నడుపుతున్న రాజ్యాంగాన్ని కాపాడండి అంటూ ఊరేగడం వింతల్లోకెల్ల వింతగాక ఏమవుతుంది?
సమాజాన్ని సమూలంగా కూల్చేందుకు తాను పదివేల మందిని అడవుల్లోకి పంపానని స్వయంగా, గర్వంగా చెప్పుకున్న వ్యక్తి అలా పంపినవారిప్పుడు దండకారణ్యంలో తుపాకులతో భద్రతా బలగాలపై విరుచుకుపడుతూ, మందుపాతరలతో వాహనాలను పేల్చేస్తూ, ఆదివాసీలను ఇన్‌ఫార్మర్ల పేర కాల్చి చంపుతూ ఉంటే ఇక్కడ గద్దర్ ‘సేవ్ డెమొక్రసీ’ అని ఊరేగుతాడట. ఇది ఎంతటి హాస్యాస్పదం? ఇది విదూషకుని వ్యవహారం కాదా? సమాజానికి నష్టదాయకమైనదిగాక ఉపయుక్తమైనదవుతుందా?
సమాజంలో సంస్కరణలు తీసుకువచ్చేవారి మానసిక స్థితి ఎంతో ఆరోగ్యవంతంగా ఉండాలి. వర్తమాన ప్రపంచ స్థితిగతులపై సరైన అవగాహన, అంచనా ఉండాలి. క్రమశిక్షణతో మెలగాలి, త్యాగాలకు సిద్ధంగా ఉండాలి. గద్దర్‌లో ఇవేవీ కాగడా పెట్టి వెతికినా కనిపించవు. మావోల భావజాలం ‘నీడ’లో తానో ‘దూది శిఖరం’గా నిలవాలన్న తాపత్రయం తప్ప అందులో నిజాయితీ ఇసుమంత కనిపించదు. ఆ నిజాయితీ ఉంటే ఎన్నికల ముందు ఇన్ని కుప్పిగంతులు వేసి ఉండేవాడు కాదు. పూటకో మాట, పుత్ర వాత్సల్యంతో ఎక్కేగుమ్మం.. దిగే గుమ్మంగా తిరిగేవాడు కాదు. ఆఖరికి చంద్రబాబు కడుపులో తలపెట్టేవాడే కాదు. ఇదంతా దేన్ని స్ఫురింప జేస్తుంది? నిస్సందేహంగా విదూషకుని అవతారానే్న...
21వ శతాబ్దంలో విదూషకుల మాటలకు విలువలేదు. జ్ఞానదారులు విస్తృతమవుతున్నాయి. ఆ దారుల వెంట అశేష ప్రజల ప్రస్థానం కొనసాగుతోంది. వారికి స్ఫూర్తినిచ్చే గాయకుడే నిజమైన గాయకుడు... వారిని ముందుకు నడిపేవాడే నిజమైన నాయకుడు. గద్దర్ విదూషకుని పాత్రను విసర్జించి ఈ రకమైన పాత్రను ఇకనైనా పోషిస్తాడా..?

-వుప్పల నరసింహం 99857 81799