సబ్ ఫీచర్

బాలింతలకు శుభవార్త..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరైన శీతలీకరణ వసతులు లేని ప్రాంతాల్లో అంటే అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లోని లక్షలాది మంది మహిళలకు ఇదో శుభవార్త అని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది బాలింతల ప్రాణాలను కాపాడే సామర్థ్యమున్న అత్యద్భుత ఔషధాన్ని గుర్తించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ‘హీట్-స్టేబుల్ కార్మెటోసిన్’గా వ్యవహరిస్తున్న ఈ ఔషధం తీవ్రమైన ఉష్ణోగ్రతలనూ తట్టుకుంటుందని, వెయ్యి రోజుల వరకూ నిల్వ ఉంటుందని డబ్ల్యూహెచ్ ఓ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రసవానంతర రక్తస్రావం కారణంగా సంభవిస్తున్న లక్షల మరణాలను నివారించేందుకు ఇది సాయపడుతుందని చెబుతున్నారు. నిజానికి ఇప్పటికే అలాంటి ప్రసవానంతర మరణాల నివారణకు ఉపయోగపడే మందులు అందుబాటులో ఉన్నాయి. కానీ అవి ఉష్ణోగ్రత, తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సరైన ఫలితాలివ్వడం లేదు. దాంతో మరణాల నివారణ ఆశించిన స్థాయిలో సాధ్యం కావడం లేదు.
ప్రస్తుతం ఏటా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70,000 మంది మహిళలు ప్రసవం తరువాత అధిక రక్తస్రావం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ ప్రభావం నెలలోపు పిల్లల మరణాలు పెరగడానికి కూడా కారణమవుతోంది. ఇన్నాళ్లూ రక్తస్రావం వల్ల సంభవించే మరణాల నివారణ కోసం ప్రసవం (సాధారణ కాన్పు) జరిగిన వెంటనే ప్రతి తల్లికీ ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తూ వచ్చింది. అయితే ఆక్సిటోసిన్‌ను ఉత్పత్తి చేసినప్పటి నుంచి బాలింతకు ఇచ్చేంతవరకు రెండు డిగ్రీల నుంచి ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత మధ్యలోనే నిల్వచేయాల్సి ఉంటుంది. కానీ సరైన శీతలీకరణ వసతులు, విద్యుత్ సదుపాయం సరిగా లేని దేశాల్లో అది సాధ్యం కావడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు అంటున్నారు.
దీనికి సంబంధించిన పరీక్షల్లో భాగంగా పది దేశాల్లో దాదాపు 30,000 మంది బాలింతల్లో కొందరికి ‘హీట్-స్టేబుల్ కార్మెటోసిన్’, మరికొందరికి ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇచ్చారు. ఈ రెండు ఔషధాల ఫలితాలూ ఒకేవిధంగా ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. అయితే నిల్వ ఉండే వాతావరణ పరిస్థితిలో మాత్రమే ఆ ఔషధాల మధ్య తేడా ఉందని తెలిపారు. హీట్-స్టేబుల్ కార్మెటోసిన్ మందు దాదాపు 90 దేశాలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సరైన శీతలీకరణ వసతులు లేని ప్రాంతాల్లోని లక్షలాది మంది మహిళలకు ఇదో శుభవార్త అని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుడు డాక్టర్ మెటిన్ గుల్మెజోగ్లు తెలిపారు. ప్రధానంగా.. ఈ మందుతో ఆర్థికంగా వెనుకబడి ఉన్న దేశాల్లో బాలింతల మరణాలను గణనీయంగా తగ్గించే వీలుంటుందని ఆయన తెలిపారు. తల్లీబిడ్డల ప్రాణాలను కాపాడటంలో ఇది గొప్ప ముందడుగు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ డాక్టర్ టెడ్రోస్ అఢనోమ్ తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పరీక్షలు ఓ కొలుక్కి వచ్చాయని, త్వరలోనే కొన్ని దేశాల్లో ఈ మందును అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ ఓ నిపుణులు చెప్పారు.