సబ్ ఫీచర్

హాస్య యోగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరైనా మీ దినచర్యలను గురించి అడిగితే.. అన్నీ చెప్పిన తరువాత మీరు గుర్తించగలిగేది ఏమిటంటే మీ కోసం కొద్ది సమయాన్ని కూడా కేటాయించటం లేదనే విషయం.. అవునా! కష్టపడి పనిచేయవలసిన పరిస్థితి, పోటీ ప్రపంచ వాతావరణం మనల్ని మానసిక ఒత్తిడికి లోనయ్యేలా చేస్తుంది. రోజువారీ జీవనంలో ఏదైనా తక్కువ అయ్యిందనిపిస్తే.. అది తప్పకుండా సంతోషమే అయి ఉంటుంది. ఏది ఏమైనా మనం సంతోషంగా గడపాలంటే స్నేహితులతో కాలక్షేపం చెయ్యడం, గట్టిగా, హాయిగా నవ్వడం చేయాలి. ఇలా చేయడం వల్ల కొన్ని సమస్యలను మనకు తెలియకుండానే మనం పరిష్కరించుకోవచ్చు అన్న విషయం తెలుసుకున్నప్పుడు తప్పకుండా ఆశ్చర్యం కలుగుతుంది. లాఫింగ్ థెరపీ గురించి చెబుతున్నారు.. అనుకుంటున్నారు కదూ.. ఇదీ అలాంటిదే హాస్యపు యోగ. ఇప్పుడు చాలా హాస్య యోగాతో చాలా లాఫింగ్ క్లబ్‌లు ఏర్పడ్డాయ. హాస్యపు యోగా ద్వారా నవ్వే అలవాటును అలవర్చుకోవడం ఆరంభించవచ్చు. ఇలా చేయడం వల్ల మానసిక ఒత్తిడిని దూరం చేయడమే కాకుండా, హాయిగా, ఆనందంగా జీవించవచ్చు. బాగా నవ్వటం వల్ల శారీరకంగా, మానసికంగా మేలు జరుగుతుంది. నవ్వటం వల్ల శరీరాన్ని ఉత్తేజపరిచే హార్మోన్లను విడుదల చేయడం ద్వారా అద్భుతమైన రోగనిరోధక లక్షణాలను కలుగజేస్తుంది. నవ్వు మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది, ఆలోచనాశక్తిని పెంచుతుంది, నిరుత్సాహాన్ని ఎదిరిస్తుంది. మనస్ఫూర్తిగా నవ్వటం సమస్యలన్నింటికీ మంచి పరిహారం అయినప్పటికీ కృత్రిమంగా నవ్వటం వల్ల కూడా శరీరానికి కావలసిన ఉపశమనం పొందడమే కాకుండా మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. ప్రతిరోజూ కొంచెం సేపు సొంతంగా నవ్వటం లేదా సమీపంలో సమాన మనస్తత్వం గల వారితో కలిసి నవ్వటం చేయవచ్చు. పదిమందితో కలిసి నవ్వటం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఎందుకంటే.. మీరు మరికొందరితో కలిసి నవ్వటం వల్ల కృత్రిమ నవ్వును దూరం చేసి మనస్ఫూర్తిగా కడుపుబ్బా నవ్వటం జరుగుతుంది. ఎందుకంటే మీ చుట్టూ ఉన్నవారు మనస్ఫూర్తిగా నవ్వుతుండటం వల్ల ఇలా జరుగుతుంది.
ఓర నవ్వు
ఉన్నట్టుండి అప్పటికప్పుడే నవ్వడం కష్టమనిపిస్తే.. ఓరగా లేదా నిదానంగా నవ్వటం మొదలుపెట్టాలి. ఇలా నవ్వటం ద్వారా మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నిదానంగా లేదా ఓరగా నవ్వటం ఆరంభించి.. తర్వాత ముసిముసిగా.. ఎక్కువ సమయం పాటు నవ్వాలి.
తర్కపు నవ్వు
తర్కం లేదా వాదం అనేది మానసిక స్థితిని చెడగొట్టడమే కాకుండా మనలోని మానసిక ఒత్తిడిని పెంచుతుంది. హాస్యపు యోగా ద్వారా అలాంటి సమస్యలకు సంతోషకరమైన పరిహారాలను పొందవచ్చు. వాదించాలి.. కానీ వాదనలో కూడా హాస్యం ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల వాదనలు లేదా తర్కాలను మనకు తెలియకుండానే ఇష్టపడతాం. పోనుపోను వాదిస్తూ బాగా జోరుగా నవ్వడానికి ప్రయత్నం చేయాలి.
అచ్చుస్వర నవ్వు
ఒకేవిధంగా నవ్వటం కంటే వెరైటీగా ఉండటం కోసం నవ్వులకు అచ్చులను జోడించాలి. ఇలా చేసేటప్పుడు చేస్తున్న శబ్దం వింతగా అనిపించవచ్చు. కానీ దీనివల్ల మీరు బాగా నవ్వడానికి అనుకూలం ఏర్పడుతుంది.
పరిహాసపు నవ్వు
ఇష్టమైన వినోదకర విషయాలను గుర్తుకు తెచ్చుకోవాలి. లేదా చదవాలి. ఇలా చేస్తున్నప్పుడు నవ్వడం ప్రారంభించాలి. ఇలా నవ్వుతున్నప్పుడు మరిన్ని వినోదకరమైన విషయాల గురించి చదవాలి. అప్పుడు బాగా పెద్దగా, గట్టిగా నవ్వాలి.
అలలాంటి నవ్వు
పెద్దగా నవ్వాలి. రెండు చేతులను తలపై ఉంచుకుని, చుట్టూ ఉన్న విషయాల గురించి ఏమాత్రం ఆలోచించకుండా, ఇతర విషయాల గురించి పట్టించుకోకుండా బాగా నవ్వాలి. ఇలా నవ్వుతూనే రెండు చేతులను పాదాల దగ్గరకు తీసుకురావాలి. నవ్వును మాత్రం ఆపకూడదు. తర్వాత పైకి లేస్తూ బాగా గట్టిగా నవ్వాలి.
చప్పట్లు కొడుతూ నవ్వటం
చప్పట్లు కొట్టడం ద్వారా మనకు సంతోషం కలుగుతుంది. మనం ఎప్పుడైనా సంతోషంగా ఉన్నప్పుడు చప్పట్లు కొట్టడం జరుగుతుంది. చప్పట్లు కొడుతూ నవ్వడం వల్ల మనకు కావలసిన విశ్రాంతి, విరామాన్ని పొందవచ్చు.
మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందడానికి ఇలాంటి సాధారణమైన, ప్రయోజనం ఉన్న హాస్యపు యోగా పద్ధతులను అభ్యాసం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల త్వరగానే మానసిక స్థితిలో మార్పును గమనిస్తారు. అలాగే మానసిక ఒత్తిడి నుంచి కూడా బయటపడతారు.