సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

236. బాలుని హృదయమందలి ప్రేమ పూర్ణముగను అభిన్నముగను ఉండును. కొన్నాళ్లకు వానికి పెండ్లికాగానే సగము హృదయమైనను భార్యకు అర్చింపబడును, ఇక బిడ్డలు పుట్టినంతనే మఱి పాతిక భాగము వారికిపోవును. మిగిలిన పాతిక భాగమును వాని తల్లిదండ్రులు, గౌరవ మర్యాదలు, వేషభాషలు, అభిమానము మున్నగువానికై పోవును. భగవంతునకు అర్పించుటకై వానియొద్ద ప్రేమానురాగములు మిగులనే మిగులవు. కాబట్టి బాలుడై యుండగా భిన్నముకాని వాని మనస్సును శీఘ్రముగా భగవంతునివైపు త్రిప్పిన యెడల భక్తుడై దైవమును గాంచగల్గును. కాని వయసు చెల్లినవారటుల చేయజాలుట బహు దుర్లభము.
237. సంసారముననే మెలగు జ్ఞానులకును సన్న్యసించు జ్ఞానులకును భేదమేనని మీరు నన్నడిగినయెడల, ఇరువురును సములని చెప్పెదను. ఇరువురకును జ్ఞానము సమానమే. కాని భోగాకర్షణల నడుమ నివసించుట ప్రమాదముతో గూడుకొనియుండుటచే సంసారియై మను జ్ఞానికి ఏ కొలదిగనైనను భయకారణముకలదు. పొగచూరి మసిపారియున్న గదిలో నీవెంట జాగ్రత్తగా మెలగినను ఏ కొంచెమో మసియంటుకొనక తప్పదుగదా!
238. ఒకనితో శ్రీగురుదేవుడిట్లనియెను; ‘‘జీవితమందలి యుత్తమ భాగమును సంసారమున గడపి నీవు ఇపుడు భగవంతుని వెదకవచ్చినావు, మంచిది. భగవంతునిగాంచిన పిమ్మట సంసారివైన పక్షమున ఎట్టి శాంతిని ఆనందమును అనుభవించియుండెడివాడవో కదా!’’
239. సాత్త్విక పూజ, రాజసిక పూజ, తామసిక పూజ- అనగా ఎట్టివి? వీనికి గల భేదమేమి?
ఏ యాడంబరమును డంబమును లేకుండ మనఃపూర్వకముగా భగవంతునారాధించువాడు సాత్త్వికారాధకుడు. మందిరాలంకారములలో విశేష శ్రద్ధగనబఱచుచు, నృత్యగీతములనుగూర్చి పెద్ద కోలాహలముచేయుచు, హెచ్చు ధనము వెచ్చించి, సమారాధనకై అట్టహాసమైన యేర్పాట్లుచేసి, దేవతాపూజార్చనలు జరుపువాడు రాజసిక భక్తుడు. నోరులేని మేకలను గొఱ్ళెలను వందలకొలదిగా బలిపీఠమున నఱికి, మద్యమాంసములతోసహా నైవేద్యముచేసి ఒడలుతెలియకుండ చిందులు ద్రొక్కుచు, పాటలు పాడుచు, పూజలు చేయువాడు తామసిక భక్తుడు.
ఉత్తమ భక్తుల లక్షణములు
240. చెకుముకిరాయి కోట్లకొలది సంవత్సరములు నీటి అడుగున పడియున్నను తనలోని అగ్నిని కోల్పోదు. నీ చిత్తము వచ్చినపుడు దానిని ఉక్కుతో గొట్టుము. తళుక్కున నిప్పురవ్వలను వెలిగ్రక్కును. దృఢ విశ్వాసముగల ఉత్తమ భక్తుడిట్టివాడు. లోకమునందలి సమస్త దోషములను అతని నావరించినను భోగవంతునియందలి తన భక్తి విశ్వాసములను గోల్పోకుండును. భగవన్నామము చెవిని బడినంతనే మహోత్సాహపరవశుడై భక్తిపూరితుడగును.
241. ఒరపిడిఱాతిపై గీయుటచే ఇత్తడికిని బంగారమునకు గల భేదము తెల్లమగునట్లు హింసా దూషణలను ఒరపిడిఱాతి మూలమున కపట సాధువులకును నిజమైన సాధువులకునుగల భేదాము తెలియనగును.
243. బాగుగా బరువులతో నిండిన అనేకమైన రైలు బండ్ల వరుసను ఇంజను సులభముగా లాగుకొనిపోగలదు. అటులనే భగవంతుని ప్రియ సంతానమగు వారు భక్తి విశ్వాసపరులై ఎన్ని కష్టనిష్ఠురములు వచ్చినను భారమనుకొనక జీవయాత్ర సాగింపగలరు. మరియు అనేకులను అట్టివారు తమతో ధర్మమార్గమున భగవంతుని సన్నిధికి గొనిపోగలరు.
243. ఇంద్రియలోలత ఎప్పుడు నశించును? ఎవ్వడు సర్వానందములకును సమస్త సుఖములకును నిలయమో, పరమావధియో, అట్టి పరమాత్ముని ప్రాప్తించునపుడు ఇంద్రియలోలత నశించును. విషయ సుఖమునందలి వ్యామోహము అణిగిపోవును. బ్రహ్మానందము ననుభవించువారికి ఐహిక సుఖములు రసహీనముగా తుచ్ఛముగా గాన్పించును. వారినవి ఆకర్షింపజాలవు.
244. మంచి కలకండను ఒక్కసారి రుచిచూచినవాడు బెల్లవుదెట్టెను తిని ఆనందింపజాలడు. దివ్యమైన రాజసౌధములలో నిద్రించినవాడు అసహ్యమైన గుడిసెలలో పరుండి సంతసింపజాలడు. బ్రహ్మానందమును రుచిచూచినవాడు నీచమగు నైహిక సుఖములలో సంతుష్టిగనజాలడు.
245. ‘రాజును జూచిన మొగమున మగని జూచిన మొత్తబుద్ధో’ యనునట్లు రాజునే తన ప్రియునిగా గల్గిన స్ర్తి ముష్టివానిని జూచి మోహింపదు. భగవంతుని కృపాకటాక్షమును బడసిన నరుడు తుచ్ఛమగు నైహిక భోగములకు ఆశపడడు.
ఇంకావుంది...
*
శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము - సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి