సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధనమును కూడబెట్టరాదు. తేనెపట్టును కట్టుకొనుటకై తేనెటీగ లెంతయో శ్రమపడును. కాని మానవుడు వచ్చి దానిని హరించివేయుచున్నాడు. స్ర్తిని మీరు పూర్తిగా విసర్జింపనక్కఱలేదు, కాని ఒకరిద్దఱు సంతానము కలుగగనే భార్యయు మీరును సోదర భావముతో జీవింపవలయును.(చూ.264.)
262. ప్రశ్న: ఏనాటికానాడు భుక్తికై పాటుపడవలసిన నేను పారమార్థిక సాధనలను ఎట్లు సాగింపగలను?
ఉ.ఎవరికొఱకు నీవు పాటుపడుదువో ఆతడే నీ అక్కఱలను దీర్చును. నిన్నీ లోకమునకు బంపుటకు పూర్వమే భగవంతుడు నీ పోషణకై ఏర్పాటుచేసియున్నాడు.
263. ఇల్లు, కుటుంబము, సంతానము- ఇవి అన్నియు మనకు కొలది కాలమే ఉండునవి- ఇవన్నియు అశాశ్వతములు, తాటిచెట్టే ఉండునది; ఒకటి రెండు పండ్లు చెట్టునుండి క్రిందబడిన, మనము విచారించుటెందులకు?
264. కామినీ కాంచన త్యాగము సన్న్యాసులకు నియమింపబడియున్నది. సన్న్యాసులు స్ర్తిపటమువైపు గూడ చూడదగదు. సంబారములతో గూడిన ఊరుగాయయొక్క తలపే చాలను, నోరు ఊరుటకు. ఇక నట్టి రుచికరములగు పదార్థములయొక్క దర్శనము మాటయు స్పర్శనము మాటయు జెప్పనేల? (తన సన్నిధినున్న గృహస్థశిష్యులను సంబోధించుచు)
ఈ కఠిన నియమము మీవంటి సంసారులకోసముద్దేశింపబడినది కాదు. ఇది కేవలము సన్న్యాసులకు ఉద్దేశింపబడిన నియమము. మీ విషయమో యనిన, మోహరాగములను విడిచి, మనస్సు భగవంతునిపై నిలిపి మీరు స్ర్తిల నడుమ మెలగవచ్చును. మనస్సు అటుల రాగరహితమై భగవంతునిపై నిలుచుటకై మీరప్పుడప్పుడు ఏకాంత వాసముచేయుట మేలు. అట్టి తావు స్ర్తిపురుషులుండుచోటికి చాలదూరమున నుండవలయును. బ్రహ్మజ్ఞానము నిమిత్తము పరితపించుచు మనఃపూర్వకముగా భగవంతుని ప్రార్థించుటకనువగునట్లు అయ్యది ఏకాంతస్థలమై యుండవలయును. అధికముగాకున్న, మూడు దినములైనను, అధవా, ఒక్క దినమైనను మీరచటనుండుట కనుకూలమైన తావై యుండవలయును.
మరియు ఒకరిద్దరు సంతానము గలిగిన తరువాత కేవల సోదర భావముతో మెలగుటయు, పారమార్థికము, ఆత్మనిగ్రహపరమునగు పరిశుద్ధ జీవనము గడుపుటకు వలయు బలము నొసగుమని సదా భగవంతును ప్రార్థించుటయునే గృహస్థులగు మీయొక్క విధ్యుక్తమార్గము. (చూ.261.)
265. సంసారులై యుండుడు, కాని సంసార సాగరమున మునిగిపోకుడు. సామ్యము చెప్పునట్లు కప్పను పాముముందు నాట్యము చేయింపుడు, కాని పాము దానిని మ్రింగకుండ జూడుడు.
266. పడవ నీటిలోనుండవచ్చును, కాని నీరు పడవలోనుండరాదు. సాధకుడు సంసారములో నుండవచ్చును, కాని సంసారము వానిలో నెలకొనరాదు.
267. నీవు గృహస్థుడవైయున్నను మఱేమియు భయములేదు- మీ మనసును మాత్రము భగవంతునిపై నిలుపుము, చాలును. ఒక చేతితో నీ గృహస్థ్ధర్మములను నిర్వర్తించుచు రెండవ చేతితో పరమేశ్వరుని పాదారవిందములను బట్టుకొనుము. గృహకృత్యములు నీకు లేకుండునప్పుడు రెండు చేతులతోడను వాని పాదపద్మములను బట్టుకొని నీ హృదయమునకు అద్దుకొనుము.
268. సంసారమున నుండియు దానియందు రాగము లేకుండు వాని స్థితి యెట్టిది? ఆతడు నీటిలోని తామరాకు వంటివాడు, లేదా బురదలోని చేప వంటివాడు. వీనిలో నేదియు అది నివసించు పదార్థముచే మలినము కాదు. నీరు తామరాకు నంటజాలదు; బురద, అందలి చేపయొక్క నిగనిగలాడు శరీరమును మలినము చేయజాలదు.
269. నీవు గృహస్థుడవైయున్నను, సన్న్యాసివై యున్నను సరియే. సదా మనసు భగవంతునిపై నిలిపి నీ విహితకర్మములను నీవు నిర్వర్తించుచుండుము. ఎటులన, వీపుమీద రాచకురుపుగలవాడు తన మిత్రులతోడను, ఇతరులతోడను మాటలాడుచునే యుండును. తుదకు వ్యవహారములను గూడ చక్కబెట్టుకొనుచుండును. కాని వాని మనసు మాత్రము సదా కురుపువలన సలుపుమీదనే యుండును.
270. వివేక వైరాగ్యములును వీనితోబాటు దృఢమైన భగవద్భక్తియు ఉన్నయెడల సంసారములోనున్నను బాధలేదు.
271. విధివశమున ఈ సంసారములోనుండగా నీవు చేయవలసిన పనియేమి? సమస్తము భగవంతునికి సమర్పించి, వానికి ఆత్మార్పణము చేసికొనుము- ఇక నీకేమియు భగము ఉండదు, బాధయు నుండదు. సమస్తము అల భగవంతుని యిచ్ఛచేతనే జరుగుచున్నదని నీవపుడు గ్రహింపగలవు.
272. గృహస్థులును భగవానుని సాక్షాత్కారమును పొందవచ్చును.
ఇంకావుంది..

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము - సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి