సబ్ ఫీచర్

తర్కవేదిక.. తరగతి గది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తరగతి గదిలో ఉపాధ్యాయుడు తాను చెప్పిందే వేదం అనుకోవద్దని, తను బోధించిన ప్రతి విషయంపైన పూర్వపక్షం చేయిస్తాడు. తరగతి గదిని రెండుగా విభజిస్తాడు. తను చెప్పిన విషయాన్ని సమర్థించేవారు కొంతమంది, దాన్ని పూర్వపక్షం చేసేవాళ్లు కొంతమంది ఉంటారు. ఇది ఉపాధ్యాయుల ఆత్మపరిశీలన. తాను చెప్పేదే ఒప్పుకోవాలని కోరుకోరు. తనను పూర్వపక్షం చేసేవారిని కూడా అంతే ప్రేమిస్తారు. పూర్వపక్షం అంటే తప్పులు వెతకటం. అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన అబ్రహాం లింకన్ ఉపాధ్యాయునికి రాసిన ఉత్తరం ఎంతో హితోపదేశంగా ఉందని, మా సంస్థలో ఐఐటి కోచింగ్ తీసుకున్న విద్యార్థితో చెప్పాను.
‘అది అబ్రహాం లింకన్ ఎత్తుగడ.. వాస్తవంగా అతని లక్ష్యం వేరు ఉన్నద’ని మా విద్యార్థి చెప్పాడు.
‘‘బానిసత్వాన్ని రూపుమాపేందుకు పోరాడిన యోధుడు లింకన్’’ అన్నాను.
ఉత్తర, దక్షిణ అమెరికా ప్రాంతాల మధ్య తీవ్ర ఘర్షణ వచ్చినప్పుడు దేశం చీలిపోతుందేమోనని భయం వేసి దక్షిణ అమెరికాలోనున్న బానిసత్వాన్ని రూపుమాపేందుకు ఒక నినాదంగా ముందుకు వస్తున్నానని లింకన్ చెప్పాడు. దానివల్ల దక్షిణ అమెరికాలో ఆయన ప్రేమను సంపాదించాడు. అదే అమెరికా అస్తిత్వాన్ని నిలబెట్టింది అని విద్యార్థి అర్జున్ నాకు చెప్పాడు. ఈ విషయం నీకెట్లా తెల్సిందన్నాను.
ఐఐటి క్లాస్‌లో ప్రతి అంశాన్ని తులనాత్మకంగా చర్చిస్తాం. దానర్థం ఎదుటివారి వాదనను నిరాకరించటం కాదు. అబ్రహాం లింకన్ జీవితాన్ని తులనాత్మకంగా పరిశోధిస్తాం. ఇది ఐఐటి తరగతి గదిలో నేర్పిన పద్ధతి అని ఆ విద్యార్థి చెప్పాడు. దానివల్ల సమర్థత ఎంత అలవాటు అవుతుందో పూర్వపక్షం కూడా అంతే అలవాటు అవుతుంది. దీనివల్ల ఒక విషయంపై సమగ్రరూపం చూడగలుగుతాం అని ఆ విద్యార్థి విశే్లషించి మరీ చెప్పాడు. అంటే తరగతి గదిలో ఉపాధ్యాయుని ఉపన్యాసాన్ని విశే్లషిస్తాం. ఇందులో రెండు భాగాలు అర్థమవుతాయి. పూర్వపక్షం తెలిసి ఉంటే మొదటి భాగం పైన వాదించేవాని వాదనపై గౌరవం పెరుగుతుంది. లింకన్‌పైన ఏ విధంగా గౌరవం పెరిగిందని మళ్లీ విద్యార్థినడిగాను. లింకన్ బానిసత్వం కన్నా దేశ సమగ్రతే ప్రధానమనుకున్నాడు. ఎదుటిపక్షంలో ఉన్న బానిసత్వాన్ని సమర్థించగలిగితే యుద్ధం నివారించగలుగుతాను. దేశ సమగ్రతను కాపాడుకోగలుగుతానని లింకన్ ఆలోచించాడు. అందుకే ఉపాధ్యాయుడు చెప్పిన ప్రతి విషయాన్ని విమర్శనాత్మకంగా నమ్మితేనే అది తమకు అవగాహన అవుతుందన్నాడు. తరగతి గది ప్రవచన వేదిక కాదు, అది విమర్శనాత్మక వేదిక.
మానవ సంపద...
బాల్యానికి, యవ్వనానికి మధ్యనున్న వయసు చాలా కీలకమైనది. 11 నుంచి 18 ఏళ్ల వయస్సులో పిల్లల తల్లిదండ్రులతో కాకుండా ఉపాధ్యాయులతో గడుపుతున్నారు. ఏది చెబితే అది అతుక్కోబోతది అనగా మెదడు ఆరని అడ్డుకాగితం. అందుకే కొందరు అంటారు- మొత్తం జీవితానికి ఆ వయసు ఇంజన్ లాంటిదని. ఆ దశలో ఏర్పడిన క్యారెక్టరే మొత్తం జీవితాన్ని నిర్థారణ చేస్తుంది. అదే జీవితాన్ని నడిపిస్తుంది. ఆ పిల్లలపై ప్రతి పైసా పెట్టుబడి, ఖర్చుకాదు. దానితో తయారైన విద్యార్థే మానవ సంపద అవుతాడు. మానవ సంపద తరగతి గదిలో ఉన్న ప్రతిక్షణం ఒక పెట్టుబడి. పుస్తకాలే కాదు, ఆట మాట పాట.. అన్ని కూడా అది పిల్లల జీవితాలను నిర్దేశిస్తాయి. పూర్వపు హైదరాబాద్ రాష్ట్రంలో ప్రతి స్కూలులో గ్రౌండ్ ఉండేది. ఆటలో పిల్లల మధ్య పోటీ అనేది ఉండదు. అందులో జట్టుతో కలిసి బతకటం నేర్చుకుంటారు. తమ స్నేహితులను ఎవరేమి అన్నా ఆ దశలో భరించలేరు. ఆ దశలో మనం విద్యార్థికి సమకూర్చే సదుపాయాలు అతని శీలానే్న కాదు దేశం సంపదకు అదే మూలం అవుతుంది. తెలంగాణ ప్రభుత్వం స్కూళ్లు పెట్టటం, ఉపాధ్యాయులను నియమించటమే కాదు, ఆడుకోవటానికి వసతులు మెదడులో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయటానికి కావాల్సిన సమర్థులైన మనుషులను సమకూర్చితేనే బంగారు తెలంగాణకు అది పునాది అవుతుంది. మన పూర్వీకులు వేసిన ఆ మార్గంలో నడుస్తుందని ఆశిస్తాం.
ప్రతిభను గుర్తించాలి...
రాజ్యాంగం అమలులోకి వచ్చిన 50 సంవత్సరాల తర్వాత విద్యను ఒక హక్కుగా మార్చటం సమాజం అదృష్టం. దీంతో ఉపాధ్యాయుల బాధ్యతలు కూడా ఊహించలేనంతగా పెరిగాయి. కొందరు పిల్లలు ప్రతిభావంతులై ఉంటారు. కానీ వాళ్లు అక్షరాలు నేర్చుకోలేరు. బాగా చిత్రాలు గీయగలుగుతారు. బాగా ఆలోచించగలుగుతారు. బాగా పాడ గలుగుతారు. పిల్లల్లో ఎన్నో ప్రజ్ఞలుంటాయి. పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభలలో దేనినైనా వెలికితీసి పోషించగలిగితే ఉత్తమమైన వ్యక్తులవుతారు. పాటపాడే పిల్లలు గిటారు నేర్చుకుంటే అద్భుతమైన సంగీత సాధన చేయగలుగుతారు. మంచి జీవితానికి అది దారితీస్తుంది. కొందరు చదువుకోకపోవచ్చు. అద్భుతమైన నటనాకౌశల్యం ఉంటుంది. ఆ పిల్లలు ఏ చిత్ర రంగంలోనైనా పనిచేయవచ్చును. అక్షరం రానివాళ్లు మోటారుకార్ల మెకానిక్‌లు తదితర టెక్నికల్ కోర్సులలో రాణించారు.
తరగతి గదిలో మనం చెప్పిన పాఠం రానంత మాత్రాన పనికిరాని మనిషి కాడు. ఇతర దేశాల్లోనైతే పిల్లల్లోని అన్నిరకాల ప్రతిభలను పెంపొందించటానికై కావాల్సిన టీచర్లను కూడా ఇస్తున్నారు. ఇటీవల నేను ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు వెళ్లినపుడు అక్కడి పిల్లలు వయొలిన్ వాయిస్తూ స్తోత్రాలను ఆలపిస్తూ ఉర్రూతలూగించారు. డాక్టర్లు, ఇంజనీర్లు అయితేనే భవిష్యత్ ఉందనే కాలం పోయింది. విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికితీయవలసిన బాధ్యత తరగతి గదిలోని ఉపాధ్యాయులపై ఉంది. ప్రతి వ్యక్తి డాక్టరో, ఇంజనీరో అయితేనే బతకగలరన్న భావనను తీసివేస్తేనే యువతలో ఆత్మహత్యలు ఆగుతాయి. ఈనాడు అక్షరజ్ఞానం అన్నది అనేక కిటికీలలో ఒకటి. మారుతున్న యుగంలో విద్యార్థులలో దాగివున్న ప్రతిభను పోషించటమే ఉపాధ్యాయుల బాధ్యత. ప్రతి ఒక్కరు ఏదో ఒక రంగంలో ప్రతిభను కలిగి ఉంటారు.

-చుక్కా రామయ్య