సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాగుడుమూతలాట యందు ఆటకాడు తల్లిని తాకిన యెడల, తఱుముకొని వచ్చువాడు వీనిని దొంగను జేయజాలడు. అట్లే మనము ఒక్కసారి భగవంతుని సాక్షాత్కారమును బొందితిమా, సంసార బంధములు ఇక మనలను బంధింపజాలవు. తల్లిని తాకిన ఆటకాడు ఇతరులు తనను తఱిమి దొంగనుజేయుదురను భయము లేశమును లేకుండ తన యిచ్చ వచ్చినటుల తిరుగాడు చందమున ఒక్కసారి భగవంతుని పాదపద్మములను స్పృశించినవాడు ఈ లోకమను క్రీడారంగమున నిర్భయుడై సంచరింపగలడు. ఆతడు సంసార తాపమునుండి వెంటనే విముక్తుడగును. ఇక వానినేదియు బాధింపజాలదు, బంధింపజాలదు.
280. మొసలి నీటిపై ఈదులాడగోరును. కాని యది పైకి రాగానే వేటకాండ్రు దానిని చంపుటకై గుఱిపెట్టెదరు. కావున అది విధిలేక నీటియడుగుననే యుండి పైకి రాజాలకుండును. ఐనను సురక్షితముగా పైకి వచ్చుటకు అవకాశము చిక్కినప్పుడెల్ల బుస్సలుకొట్టుచు పైకిలేచి ఆనందముతో సాగరమున ఈదులాడును. ఓ నరుడా! సంసార మోహమున జిక్కిన నీవును ఆనందసాగరమున ఈదులాడ వాంఛించు చున్నావు, వేదన పడుచున్నావు. కాని సంసార తాపత్రయము-ళనఆనీకు అవకాశమొసగుట లేథు. ఐనను నిరుత్సాహపడకుము. తీరిక లభించినపుడెల్ల ఆత్రముతో భగవానుని వేడుకొనుము, మనఃపూర్వకముగా ప్రార్థింపుము. నీ దుఃఖములన్నిటిని వానితో జెప్పుకొనుము. సకాలమున నిన్ను అతడు విముక్తుని జేసి సచ్చిదానంద సాగరమునఓలలాడజేయును.
281. మోహనిలయమగుతావునకువిధి లేక నీవు వెడలవలసి వచ్చిన యెడల ఎప్పుడును జగన్మాత యొక్క స్మరణమును నీతో గొనిపొమ్ము. నీ మనస్సున దాగియుండు దుష్టచింతలనుండి సైతము ఆమె నిన్ను కాపాడగలదు. జగజ్జనని సమక్షమున దుష్కార్యములను దుశ్చింతలునునిలువ సిగ్గుపడి పారిపోవును జుమీ!
282. సంసారమునకును భగవంతునికిని సామరస్యమును గుదుర్చుటెట్లు? ఆ వడ్రంగివాని భార్యను చూడుము! ఎన్ని విధములైన పనులను జక్కబెట్టుకొనుచున్నదో! రోటిలో అడుకులు వేసి ఒక చేత రోకలి పూని దంపుచున్నది. రెండవ చేతితో బిడ్డకు పాలిచ్చుచు తోడ్తోడనే అడుకులను కలియబెట్టుచున్నది. ఇటులామె ఇన్ని పనులను జేయుచున్నను రోకలి జారిపడి చేతిని నలుగగొట్టకుండ అతి జాగరూకతతో మెలగుచున్నది. ఈ విధముగా నీవు సంసారము చేయుము. కాని సర్వదా భగవంతుని స్మరించుచుండుము. ధర్మమార్గమునుండి యెన్నడును తొలగి వర్తింపకుము.
*
ఇంకావుంది..
*
శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము - సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి