సబ్ ఫీచర్

చేయి చేయి కలిపి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుల్వామా జిల్లాలో తీవ్రవాదుల దాడికి బలైన అమరవీరుల కుటుంబాలకు అందరూ తమ వంతు సాయంగా విరాలాలను సేకరిస్తున్నారు. యోధులంతా వీరమరణం పొందారు. ఎంత డబ్బు ఇచ్చినా మరణించిన వారిని తిరిగి తేలేం.. బాధితుల కుటుంబాలకు సాయంగా మేమున్నామని చెప్పేందుకు, సాయం చేయాలనుకున్నవారిలో స్ఫూర్తిని నింపేందుకు అందరూ చేరుూ చేరుూ కలుపుతున్నారు.
పెళ్లివిందు రద్దు చేసి..
పుల్వామా వద్ద ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్‌పీఎఫ్ జవాన్ల కుటుంబ సభ్యులకు అండగా నిలిచేందుకు దేశం యావత్తూ స్పందిస్తుండగా, సూరత్ (మహారాష్ట్ర)లో రెండు కుటుంబాలకు చెందిన వారు పెళ్లివిందును రద్దు చేసుకొని అందరి ప్రశంసలను అందుకొన్నారు. సూరత్‌లో సేథ్, సంఘ్వీ కుటుంబాలకు చెందిన వధూవరులు అమీ, మీత్‌లకు సంప్రదాయబద్ధంగా వివాహం జరిగింది. అదే సమయంలో భారీ సంఖ్యలో సీఆర్‌పీఎఫ్ జవాన్లు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోవడం వధూవరుల కుటుంబ సభ్యులను కలచివేసింది. దీంతో వారు పెళ్లివిందును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. విందుకోసం ఖర్చు చేయాలనుకొన్న డబ్బులో 5 లక్షల రూపాయలను సైనిక సంక్షేమానికి, 11 లక్షల రూపాయలను అమరులైన జవాన్ల కుటుంబాలకు పంపుతున్నట్టు ఉభయ కుటుంబాల వారు ప్రకటించారు. పెళ్లివిందు రద్దయినా తనకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వనక్కర్లేదని కేటరింగ్ యజమాని సైతం అంగీకరించాడు. ఘనంగా జరగాల్సిన పెళ్లివిందును రద్దు చేసుకొని, దేశభక్తిని చాటుకున్న వధూవరుల కుటుంబాలను బంధుమిత్రులు మనసారా కొనియాడారు.
పెళ్లియాత్రలో నివాళులు..
అందంగా అలంకరించిన పల్లకీలో కూర్చుని వధూవరులు వీధుల్లో ఊరేగుతుండగా.. అక్కడ పెళ్లివారి కోలాహలం బదులు- ‘అమర సైనికులకు జోహార్లు.. కుటిల పాకిస్తాన్‌కు బుద్ధి చెబుదాం..’ అనే నినాదాలు మార్మోగాయి. కశ్మీర్‌లో ఉగ్రవాదుల దుశ్చర్యకు భారీ సంఖ్యలో మన సీఆర్‌పీఎఫ్ జవాన్లు అమరులు కావడం ఓ పెళ్లివారి ఇంట అందరినీ ఆందోళనకు గురిచేసింది. వధూవరుల ఊరేగింపుప్రారంభం కావడానికి ముందు జవాన్ల వీర మరణం గురించి అందరికీ తెలిసింది. గుజరాత్‌లోని వదోదర పట్టణంలో వధూవరుల ఊరేగింపులో అమర జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. ఈ ఊరేగింపులో వధూవరులు పట్టుకొన్న ‘ప్లకార్డు’ అందరి దృష్టినీ ఆకట్టుకొంది. ‘ఎవరు చెప్పారు మన దేశంలో 1427 సింహాలే ఉన్నాయని..? మన సరిహద్దుల వెంబడి 13 లక్షల సింహాలు (జవాన్లు) దేశరక్షణ కోసం కాపలాగా ఉన్నాయి..’ అంటూ వధూవరులు ప్రదర్శించిన ‘ప్లకార్డు’ను చూసి పెళ్లి ఊరేగింపులో పాల్గొన్న వారంతా ‘అమర సైనికుల త్యాగాలు వృథా కావు.. పాకిస్తాన్‌కు తగిన గుణపాఠం చెబుతాం..’ అని నినాదాలు చేశారు. వీర సైనికులకు నివాళిగా సాగిన పెళ్లి ఊరేగింపులో స్థానికులు సైతం స్వచ్ఛందంగా పాల్గొన్నారు.
‘చిన్నా’రి సాయం..
పుల్వామా జిల్లాలో తీవ్రవాదుల దాడికి గురై మృతి చెందిన సైనికుల కుటుంబాలకు సాయం చేయడానికి పదకొండు సంవత్సరాల ఓ చిన్నారి ముందుకొచ్చింది. చేసేది గొప్ప సాయం కాకపోయినా.. చనిపోయిన సైనిక కుటుంబాలకు ఏదో చేయాలన్న ఆతృతతో ముందడుగు వేసింది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన మస్కాన్ అహివార్.. తన పిగ్గీబ్యాంకులో పుట్టినరోజు కోసం దాచుకున్న 680 రూపాయలు, అలాగే మిగిలిన పిల్లల నుంచి సేకరించిన 1,100 రూపాయలు కలిపి డిస్ట్రిక్ట్ సైనిక్ కల్యాణ్ ఆఫీసులో జమచేసింది. ‘ఇంతమంది దేశాన్ని కాపాడే సైనికులు చనిపోతే.. నేనెలా నా పుట్టినరోజును జరుపుకుంటాను. అందుకే నేను దాచుకున్నది వారికే ఇచ్చేశాను’ అని చెబుతోంది ఈ చిన్నారి. ఈ చిన్నారి 2015 నుంచి మురికివాడ పిల్లల కోసం ఓ చిన్నపాటి గ్రంథాలయాన్ని కూడా నడుపుతోంది. ఇందుకోసం ఆమెకు చాలా బహుమతులు కూడా వచ్చాయి.

ఇద్దరు ఆడపిల్లలను దత్తత తీసుకుని..
బిహార్‌లోని షేక్‌పురా జిల్లా కలెక్టర్ ఇనాయత్ ఖాన్.. వీరమరణం పొందిన జవానుల పిల్లల్లోని ఇద్దరు ఆడపిల్లలను దత్తత తీసుకుంటున్నట్లు తెలిపారు. వీరమరణం పొందిన రతన్‌కుమార్ ఠాకూర్, సంజయ్ కునార్ సిన్హాల ఆడపిల్లలను ఆమె దత్తత తీసుకుంటున్నట్లు చెప్పారు. వారి విద్య, వైద్య, ఇతర ఖర్చులన్నింటినీ తానే భరిస్తానని తెలిపారు ఆమె. అలాగే తన నెలవారీ వేతనం నుండి రెండు రోజుల వేతనాన్ని సిఆర్‌పిఎఫ్ ట్రస్ట్‌కు అందజేశారు. తమ జిల్లాలోని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఒకరోజు వేతనాన్ని సైనికుల కుటుంబాల కోసం ఈ ట్రస్టుకు అందజేయాల్సిందిగా కోరారు.