సబ్ ఫీచర్

చదువంటే విజ్ఞానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత రాజ్యాంగం ఏ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రాయబడ్డదో భారత ప్రజానీకానికి అవగాహన కాకుండా చైతన్యాన్ని కలిగించుటకై ప్రతి టీచర్‌కు శిక్షణనివ్వాలి. బిఇడి కోర్సులు చేస్తున్నప్పుడు ఇలాంటి శిక్షణ ఇచ్చినట్లయితే తరగతి గదిలో దీనిని దృష్టిలో పెట్టుకుని తమ పాఠాలను చెప్పే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుల వ్యవస్థ ఎలా వచ్చింది? అది ఎంత హాని చేసింది? అస్పృశ్యత అంటే ఏమిటిది? దానివలన దళితులు, ఆదివాసీలు ఏ విధంగా బాధితులయ్యారు? ఆ విధంగా మొత్తం భారత సమాజమే ఇట్లా వెనుకపడిపోయింది. వెనుకబడిన కులాలు ఎలా వచ్చాయి? ఈ సామాజిక పరిస్థితులను తెలియజేస్తే తరగతి గదిలో బోధన చేసినప్పుడు విద్యార్థి ఎందుకు వెనుకబడిపోతారు? గ్రేడ్‌లు వారికెందుకు రావు. అవి ఉపాధ్యాయునికి తెలిసుండే అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని తరగతి గది మేనేజ్‌మెంట్ చేసే వీలుంటుంది. శిక్షణ ఇచ్చేటప్పుడు ఆ వర్గాలపై ఎంత సానుభూతిని చూపించాల్నో తన విద్యుక్త్ధర్మంగా భావిస్తాడు. ఇది సామాజిక మార్పుకే కాదు, బోధనాసమత్వానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ భావనలను విద్యార్థి సమాజంలోకి తీసుకపోవటమే గాకుండా భవిష్యత్‌లో ఏ ఉద్యోగం చేసినా వీటిని గమనంలోకి తీసుకుంటారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుని పాత్ర అంటే మార్పులతో వర్గీకరణ చేయటం కాదు, తరగతి గదిని ఒక రోడ్‌రోలర్‌గా మార్చాలి. అదే చదువు లక్ష్యం. విద్య జాతీయ లక్ష్యాలకు అనుబంధంగా ఏర్పడితేనే సమాజం మార్పుకు దోహదవౌతుంది.
* * *
మన విద్యావిధానంలో గురువుల పాత్ర ఎంత ఉన్నదో తల్లిదండ్రుల పాత్ర కూడా అంతే ఉంటుంది. కానీ, చాలామంది తల్లిదండ్రులు పాఠశాలలకు వచ్చి చదువుకునే అవకాశం దొరకలేదు. దీంతో తమ పిల్లలకు పాఠశాలల విషయంలో సలహాలిచ్చే విషయంలో స్తోమత లేకపోవటం అన్నది మన విద్యావిధానంలో లోపంగా కనిపిస్తుంది. ఈ లోపాన్ని సరిచేసేందుకై తీవ్రంగా యత్నించాలి.
పిల్లలకు పరీక్షల సమయంలో ‘వందేమాతరం’ లాంటి సంస్థలు కృషిచేస్తున్నాయి. కానీ అది 10వ తరగతి పరీక్షల వరకు ఉపయోగపడుతుంది. పిల్లల్లో అవగాహనశక్తి, కాల్పనిక శక్తి (క్రియేటివ్ థింకింగ్)ను కలిగించాలి. గ్రామాల్లో ఉండే దళిత, బీసీ, గిరిజన, మైనార్టీ సంఘాలు ప్రభుత్వ పాఠశాలల పిల్లల్లో ఉన్న లోపాలను సరిచేసేందుకు కృషిచేయాలి. పేరెంట్స్ చేయాల్సిన చదవుకు సంబంధించిన పనులను ఈ సంఘాలు చేయాలి. ఆ పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరిగి పటిష్టమైన పునాదిగల విద్యార్థులు తయారయ్యే అవకాశం ఉంది. కనీసం ఆ పిల్లల యొక్క ప్రోగ్రెస్‌ను హెడ్‌మాస్టర్‌కైనా చెప్పవచ్చును. అట్టడుగు వర్గాలకు చెందిన సంఘాలు ఈ కార్యక్రమం నిర్వహిస్తే తోటి విద్యార్థులు వెనుకబడి పోకుండ ఉంటారు. దాంతో సహా సామూహిక సంఘాలపైన విశ్వాసం కుదురుతుంది.
* * *
చదువంటే అక్షరం మాత్రమే కాదు, చదువంటే విజ్ఞానం, ఆ విజ్ఞానం బడికి రాకముందే ఎంతో విజ్ఞానాన్ని మూటకట్టుకుని వస్తాడు. ఆ విజ్ఞానాన్ని ఉపయోగించుకునే తన ప్రాథమిక విద్య ఆరంభం కావాలి. ప్రాథమిక విద్య ఒక సిలబస్‌ను కాలమాన పరిస్థితులకనుగుణంగా అన్ని దేశాలూ మార్చుకున్నాయి. ఇప్పటికీ ప్రైమరీ స్కూల్స్ లోపల విద్యార్థుల సంఖ్యనుబట్టి ఉపాధ్యాయులను నియమించటం జరుగుతున్నది. అది అక్షరమే చదువుకు ఆరంభం అనుకునే కాలానికి సంబంధించిన ఆలోచన. తరగతులనుబట్టి ఉపాధ్యాయులను నియమిస్తే ప్రాథమిక విద్య పటిష్టవంతవౌతుంది. భాష అంటే అక్షరాలే కాదు ఈనాడు పాలిటెక్స్ దగ్గర్నుంచి చెప్పాలి. ఉచ్ఛారణ అర్థవంతంగా ఉండాలంటే భాష చెప్పే ఉపాధ్యాయులకు తెలిసి ఉండాలి. తరగతి గదిలోకి ఈనాడు వివిధ వర్గాలనుంచి వస్తున్నారు. వారి పరిసరాలకు అనుగుణమైన ఉచ్ఛారణ వచ్చింది. దానిని మనం హేతుబద్ధం చేయాలి. అనగా పిల్లలతో ఉచ్ఛారణను స్టడీ చేస్తేనే ఆ దశలోపల గ్రంథ పఠనం సరిగా జరుగుతుంది. పుస్తక భాషకున్నూ పరిసరాల భాషకు తేడా ఉంటుంది. దాన్ని మనం తరగతి గది లోపల పిల్లలతో చదివించి దాన్ని క్రమబద్ధీకరణ చేయవచ్చును. ప్రైమరీ స్కూళ్లల్లోపల భాషా పండితులు ఉండాలి. అదే మాదిరిగా ఇంగ్లీషును 3వ తరగతి నుంచి చెబుతున్నాం. ఆ దశలోనే సరైన ఉచ్ఛారణ కలిగించేందుకు సమర్థులైన ఇంగ్లీషు బోధకులను నియమించాలి. అంకెలు నేర్పటం కాదు, అంకెలకన్నాముందు అంకెల ఉపయోగం తెలిసిన పిల్లలు వస్తున్నారు. చిన్న పిల్లలు కొట్టుకువెళ్లి 10 రూపాయల నోటును విడిపించి సామాను కొనుక్కువస్తున్నారు. ఈ విజ్ఞానాన్ని ఉపయోగించి అంకెలకన్నా సమస్య పరిష్కారానికి సంబంధించిన లెక్కలు చెప్పాలి. విద్యార్థులు పరిసరాల నుంచి వస్తున్నారు కాబట్టి ఆ పిల్లలకు ఇంద్రధనుస్సు తెలుసు. ఆ వయసులోనే మూఢాచారాలను తొలగించాలి. ప్రాథమిక విద్య లక్ష్యం మారింది కాబట్టి ప్రాథమిక విద్య నిర్మాణం కూడా మారాలి. ప్రాథమిక చదువు పూర్తయ్యేవరకు 6వ తరగతి వచ్చేవరకు స్పష్టంగా చదవటం, రాయటం, హేతుబద్ధంగా ఆలోచించటం, ఆ ఆలోచన స్థితికి తీసుకురావాలి. 6-10 సంవత్సరాల మధ్యన ఇంద్రియ శిక్షణ కాదు, ప్రాథమిక నైపుణ్యం పిల్లలకు రావాలి. ప్రాథమిక విద్యను సంస్కరించవలసిన సమయం ఆసన్నమైంది. ప్రాథమిక విద్య లక్ష్యాన్ని నిర్దేశించండి.

-చుక్కా రామయ్య