Others

అఘాయిత్యానికి బలైన అసీఫాకు అక్షర నీరాజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేజీలు: 237, వెల: రు.150
ప్రతులకు:
భోగరాజు ఉపేందర్‌రావు
ఇం.నెం.11-10-694/5
బురహాన్‌పురం, ఖమ్మం
94947 73969
*
దేశంలో పసిపిల్లలపై... మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై కవులు స్పందిస్తూ.. రాసిన కవితలను ఏర్చి, కూర్చి ‘‘అసిఫాకోసం’’! పేరుతో ఓ కవితా సంకలనాన్ని వెలువరించారు. వురిమళ్ల సునంద సంపాదకత్వంలో వెలుగులోకి వచ్చిన ఈ గ్రంథంలో అత్యాచారాలకు చరమగీతం పాడాలన్న సంకల్పంతో.. సమాజంలో కొంతైనా మార్పురావాలని కాంక్షిస్తూ కవులు తమ కలాలకు పని కల్పించినారు. అసిఫాపై జరిగిన అఘాయిత్య నేపథ్యంలో గ్రంథం ప్రకటింపబడినప్పటికీ.. రోజురోజుకు పసి మొగ్గలపై.. మహిళలపై పెరుగుతున్న అకృత్యాలపై కవులు, కవయిత్రులు స్పందిస్తూ తమ భావాలను వ్యక్తపరిచారు. బాధ్యతాయుతమైన ఉపాధ్యాయ వృత్తిలో వున్న వురిమళ్ల సునంద ఇప్పటి తరాన్ని, రేపటి తరాన్ని జాగృతపరచడానికి ఓ కవితా సంకలనాన్ని వెలువరించడం ఆహ్వానింపదగిన పరిణామం.. సంఘటనను ఆధారం చేసుకుని.. మానవీయతను నిలపాలన్న సంకల్పంతో ఈ గ్రంథాన్ని రూపుదిద్దినప్పటికీ.. కవులు, కవయిత్రులు ప్రకటించిన భావాలు చాలావరకు సంయమనం కోల్పోయి.. నేల విడిచి సాముచేసినట్లు కానవస్తాయి.. పదబంధ ప్రయోగంలో.. పట్టుతప్పిన పంక్తులు ఇందులో మనకు అడుగడుగున దర్శనమిస్తాయి.. సంఘటన తీవ్రతను మనం అర్థం చేసుకోగలం.. కాని శృతిమించి రాగానపడ్డ చందంవలె కొందరు కవులు, కవయిత్రులు తమ కలాలను అదుపులో పెట్టుకోలేకపోయారు.. దుర్మార్గుల దాష్టికానికి అభాగ్యులైన పసిపిల్లలు బలైపోవడాన్ని ఎవ్వరూ సమర్థించరు! కానీ.. అత్యంత గౌరవంగా భావించే మన భారతదేశ చిత్రపటానే్న చిన్నబుచ్చుతూ రాయడం ఔచిత్యం అనిపించుకోదు..
నిజమే అసిఫాపై జరిగిన అకృత్యాన్ని ఎవ్వరూ సమర్ధించరు.. కానీ ఈమధ్య భారతదేశ చిత్రపటం చూస్తున్నప్పుడల్లా.. భయంతో వణికిపోయిన బాలిక అసిఫాలా కనిపిస్తోందని కవి వెనె్నల సత్యం తన కవితలో నొక్కి చెప్పడం.. ముగింపులోని పంక్తులతో కూడా చాలామంది పాఠకులు ఏకీభవించకపోవచ్చు.. తిట్ల దండకం.. అభ్యంతర పదబంధ ప్రయోగం వంటి అంశాలతో అందరం ఏకీభవించక పోయినప్పటికీ... కవయిత్రి ఆవేదనను.. భావావేశాన్ని మనం అర్ధంచేసుకుందాం! డా.పాతురి అన్నపూర్ణ కూడా ‘‘ఎన్నాళ్లిలా?’’ కవితలో.. మరణశిక్షలు.. జైలుశిక్షలు సరిపోవని అభిప్రాయపడ్డారు. కవయిత్రిగా ఆచరణ యోగ్యమైన సలహా, సూచన ఇస్తే బాగుండేది. సామాజిక మార్పుకోసం తమ కలాన్ని సంధిస్తే మరీ బాగుండేదన్న అభిప్రాయం పాఠకుల్లో కలిగే అవకాశం ఉంది.
డా.సమ్మెట విజయ తమ కవిత ద్వారా మకిలి పట్టిన మగతనపు మలినాలు కడగండని పిలుపునిచ్చారు. అమ్మఒడి రత్నమహర్షి కూడా ముందుతరం ‘‘మగాళ్ల’’కు కనువిప్పు కలిగేలా శిక్షలుండాలని అభిలషించారు. కుసమంచి శ్రీదేవి రాసిన ‘చిన్నారి అసీఫా’ కవితలో ఆడతనమన్నది ప్రాణం పోసే అమృతంరా! అని గుర్తుచేశారు. మహిళలపై జరిగే హింస చల్లారేంతవరకు తిరగబడాలి మన సమాజం అంటూ రఘుపతి ముత్యాల పేర్కొన్నారు. నేరం చేసిన వారికి వెంటనే శిక్ష వేసే చట్టం అమలులోకి రావాలని బల్లూరి ఉమాదేవి తమ కవిత ద్వారా అభిలషించారు. అసీఫా నూరేళ్ల జీవితం కాలి బూడిదవడం పట్ల ఎండ్లూరి సుధాకర్ తమ ఆవేదనను వ్యక్తపరిచారు. ఒళ్లూకళ్లూ కానరాని కావరం... విచక్షణ లేని విశృంఖలత... జరగకూడని అన్యాయాన అతివ అవశేషమవుతూనే ఉందని వడలి రాధాకృష్ణ వాపోయారు. మాకు స్వేచ్ఛనివ్వండి.. సీతాకోక చిలుకల్లా ఎగిరిపోతాం.. మీకు జన్మనిచ్చే అమ్మలమవుతామని తిరునగరి సంధ్య పేర్కొంటే.. న్యాయఖడ్గాలై.. నేరం చేసిన వారి అంగాలను కోసి సమాజపు గుమ్మానికి వేలాడదీయండని అఖిలాష పిలుపునిచ్చారు. నేరగాళ్లను శిక్షించేందుకు తక్షణ కఠిన శిక్షలు అవసరమని నెమ్మికంటి యుగంధర్ అభిప్రాయపడ్డారు.
నలిగిన అసిఫా భారతి నన్ను క్షమించు తల్లీ అంటూ ఆంగోతు జయవాసు అభ్యర్థించారు. ఎన్నాళ్లు ఈ ఆవేదనల స్వరం? అని ప్రతాప వెంకట సుబ్బారాయుడు ప్రశ్నించారు.
అసిఫా గుర్తొస్తె ఆర్ద్రమైపోతుంది తన మనసు అంటూ కాళంగి వసంత జెస్సన్ వాపోయారు. సమాజంలో ఆడబిడ్డలను నిర్భయంగా బ్రతకనీయండిరా! అంటూ యాళ్ల సోమురతన్ అరోర అంటే.. ఆడ పిల్లలకు రక్షణ కల్పించుట న్యాయవ్యవస్థ తక్షణ కర్తవ్యమని ఎం.ఎ.ఉమారాణి వివరించారు. ఓ అసిఫా! వేల పాళీల అక్షర యుద్ధం.. నీకై మొదలైన వేళ.. న్యాయం నీవైపే.. నీకే అంటూ పాలకుర్తి నాగజ్యోతి అంటే.. మనిషి ముసుగులో రాక్షసులుంటే.. ఇది నవ నాగరిక సమాజమా? అని కుడికాల ‘సరోజనార్ధన్’ వంశీధర్ ప్రశ్నించారు.
స్ర్తిలకూ మనసుంటుందని, వాళ్లూ మనుష్యులేనన్న సత్యాన్ని ఇకనైనా గ్రహంచండని వి.పి.చందర్‌రావు హితవు పలికారు. మత్తు గోళీలు వేసి.. మానాన్ని దోచుకున్న వాళ్ళూ వీళ్ళూ మగాళ్లేనా? అని ఇ.హేమలత ప్రశ్నించారు. మల్లేశ్వరరావు తన కవితలో బాలికారిష్టాలను ఏకరువు పెట్టారు.
నిజంగా మమ్మల్ని క్షమించు.. వికృతమైన ఈ సమాజంపై ఖాండ్రించి ఉమ్మించు అని కటుకోఝ్వల రమేష్ పిలుపునిచ్చారు. అమ్మా! అసిఫా! నీ బాధకు ఏ రారుూ కరగలేదా? అని పుట్టి గిరిధర్ ప్రశ్నించారు. కవి చొక్కాపు లక్ష్మీనాయుడు రాసిన ‘‘మట్టిలోకం లోంచి’’ కవితలో తమ భావుకతను ప్రకటించారు. ఇక్కడి చట్టాలు కళ్లు మూసుకునే కాపలా కాస్తుంటాయని అభిప్రాయపడ్డారు. ఇది ‘మగ’జాతి కాదు ‘పగ’ జాతి.. క్షమించు అసీఫా అంటూ డాక్టర్ మడత భాస్కర్ తమ కవితను కొనసాగించారు. అబల సబల కావాలని డాక్టర్ దన్నాన అప్పలనాయుడు అంటే.. చెమట చుక్కలు కాగడాలవుతాయి. అశ్రువులు గన్నుకు తూటాలవుతాయని డి.కృష్ణయ్య అన్నారు. మానవత్వం లేని మగ మృగాలను పాతాళంలోకి పాతరేయాలని నీరటి బాలీశ్వర్ పిలుపునిచ్చారు. అసీఫా.. మళ్ళీ జన్మించుమని బాలాత్రిపుర సుందరతేజ అంటే... అబల అసహాయతను నంద్యాల విజయలక్ష్మి తమ కవితలో ఆవిష్కరించారు. విరిసీ విరియని మొగ్గను ఘోరంగా క్రూరంగా నలిపిపడేసిన మానవ మృగం మానవత్వాన్ని మంటగలిపిందని విజయకుమార్ గడియా అభిప్రాయపడితే.. ఆడదానిలో తల్లినీ.. పాపలలో చెల్లినీ చూడమని నేర్పలేని మనం సమాజాన్ని మార్చేదెన్నడు? ఆడపిల్ల రక్షింపబడేదెప్పుడు? అని డాక్టర్ లక్ష్మీ రాఘవ ప్రశ్నించారు. ఆధునికత అద్దాల వెనక దాచేసుకు ఎదురుపడ్డ ప్రతి అవయవాన్నీ చూపుల ఆయుధాలతో ముక్కలుముక్కలు చేస్తూనే ఉంటారని స్వాతి శ్రీపాద అభిప్రాయపడ్డారు. చిగురించే చిన్నారి నవ్వులకు భరోసా కల్పిద్దామని భీంపల్లి శ్రీకాంత్ పిలుపునిచ్చారు. మృగాళ్ల మనసుల్లో రావాలి మార్పురావాలని మాధవీలత ఆకాంక్షించారు. అసీఫాలు అరుంధతులూ ఈ నేల తల్లి బిడ్డలే అని చాటింపు వేయండని నందిగామ నిర్మల అంటే.. స్ర్తి జాతి మేలుకోండి- ఎదుర్కోండి అంటూ వి.శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పసిమొగ్గలను తాకాలంటేనే వెన్నులో వణుకు పుట్టించే చట్టాలు రావాలని యేరవ ఇందిరారెడ్డి ఆకాంక్షించారు.
ఇలా అసీఫా ఘటనకు స్పందిసూత కవులు కవయిత్రులు తమ భావాలకు అక్షర రూపమిచ్చారు. ఆడవాళ్లపై, చిన్నారులపై అఘాయిత్యాలు ఇకనైనా ఆగాలని ఆకాంక్షించారు. సమాజంలో జరుగుతున్న అకృత్యాలపై తమ కలాలను సంధించారు.. స్వతంత్ర భారతంలో స్వేచ్ఛ అదుపు తప్పొద్దనీ.. మహిళలకు, పసి పిల్లలకు భద్రత కల్పించి, భరోసా యివ్వాలని.. అమానవీయతకు ఇకనైనా స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. అసీఫాపై జరిగిన అఘాయిత్యం నేపథ్యంలో.. కవులు, కవయిత్రులు తమ అక్షర సుమాలతో అశ్రు నివాళి సమర్పించారు.

- దాస్యం సేనాధిపతి