సబ్ ఫీచర్

దేవాలయ ధ్వంసం - చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవాలయాలు పడగొట్టడం అనే ప్రక్రియ, ఈమధ్య జోరుగా సాగుతోంది రోడ్లు వెడల్పు చేసేటప్పుడు ముఖ్యంగా. దేశంలో రోడ్లువెడల్పు చేయడం అభివృద్ధి కిందే వస్తుంది. దానికి చాలాచోట్ల ఆలయాలు అడ్డంకులే. మంత్రులు, ప్రజాప్రతినిధులు వారికి ఉన్న ఆస్తులు అలా పడగొట్టవలసి ఉంటే, అక్కడ ఎంత పెద్ద రోడ్డయినా ఎన్నో వంపులు తిప్పి వెళ్ళడం అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఎవరూ కాదనలేరు. ఒక ఆలయం పడగొట్టాలంటే, ముందుగా ఆలయానికి సంబంధించిన వారిని సంప్రదించి, తగువిధంగా ఒప్పించి, తిరిగి తామేవిధంగా సదరు దేవాలయాన్ని పునరుద్ధరించదలచుకున్నారో లేదా దేవాలయ పాలక మండలికో, ధర్మకర్తలకో, ప్రజలకో మరే విధంగా తిరిగి కావాలో నిర్ణయించి దానికి తగిన స్థలం, ధనం కేటాయించితే ఎవరూ కాదనలేని సత్యమని విశాఖలో గత కొన్ని సంవత్సరాలుగా నిర్మాణమవుతూనే ఉన్న రహదారులు, పక్కకి జరిపి కట్టుకున్న దేవాలయాలూ చెప్పకనే చెపుతున్నాయి.
అయితే విజయవాడలో పడగొట్టిన దేవాలయాల చరిత్ర ఇందుకు భిన్నంగా ఉందని మాత్రం తెలుస్తోంది. ఎవరికీ చెప్పకుండా అర్ధరాత్రి వీటిని పడగొట్టడం వెనుక అనేక మతలబులున్నాయని తెలుస్తోంది. తీరా పడగొట్టాక సారీ అనీ, శాస్త్రోక్తంగా పడగొట్టలేకపోయామనీ విచారాలు ప్రకటించడం కాకుండా నిజానికి మనస్ఫూర్తిగా బాధపడినవారు కనపడలేదు. ఒక ప్రజాప్రతినిధి అయితే దేవాలయాల గురించి తీవ్రంగా మాట్లాడారు. వారి వ్యాపారానికి రోడ్లే కావాలి మరి. వారి వాహనాలలో కూడా దేవుని పటాలు ఉంటాయి. వారిని మనమేమీ అనక్కరలేదు. ఈ తప్పిదం అంతా వారిని ఎన్నుకున్న ప్రజలదే అని రేపు వారే అనినా అనవచ్చు.
దేవాలయాలలో, గ్రామదేవతలకూ జరిగే అనేక సంబరాలలో ముందర ఉండేది అక్కడి స్థానిక నాయకులే అన్నది జగమెరిగిన సత్యం. దీనికి ప్రచారంగా అమ్మవారి ఫొటో ఒకటి చిన్నది వేసి, నాయకుల, అనుచరుల ఫొటోలు బ్యానర్ నిండావేసుకుని ప్రచార ప్రయోజనాలకు వాడుకుంటున్నా మన నాయకులు. అంటే దేవాలయాలు ప్రజలకంటే కూడా నాయకులకే ఎక్కువ ఉపయోగంగా ఉన్నాయన్నది కాదనలేని సత్యం. అంతా జరిగి ప్రజల గగ్గోలు మొదలయ్యాక సానుభూతి ప్రకటనలు వెలువడడం కంటితుడుపు చర్య మాత్రమే.
ఇటువంటి చారిత్రక తప్పిదాలు, ఇంతకుముందు అనేకం జరిగాయి. వాటి ఫలితాలు అప్పటికప్పుడో, తరువాతనో అప్పటికి నాయకులుగా ఉన్న వారిపై ప్రభావం చూపించిన విషయం ఎవరూ కాదనలేనిది. కనీసం ఆ విషయాలు గుర్తుపెట్టుకుని ఉండి ఉంటే, ఇప్పటి నాయకుల ప్రవర్తన వేరే విధంగా ఉండి ఉండేదేమో?
ఇప్పటికైనా దేవాలయాలు, మసీదులు, చర్చిలు వంటివి పడగొట్టడం, తిరిగి కట్టడం వంటివాటితో ఒక చట్టం రూపుదిద్దుకుంటే మంచిది. అందరూ హిందూ మతం పాలిస్తోందని మాజీ నాయకత్వంలోని వారు గొంతు చించుకుని అరుస్తున్న సమయంలో ఈ సంఘటన జరగడం ప్రతిపక్షాల దురదృష్టకరం. ప్రజలకు కూడా దురదృష్టంకాదని అనలేరెవరూ. విషయమేమంటే న్యూదిల్లీ నించి ప్రజలని ఈ విషయంలో ఓదార్చడానికి ఇంకా ఎవరూ రాకపోవడం.
ప్రభుత్వం తక్కిన ఇతర మతస్థుల వలె, హిందూ దేవాలయాలని కూడా వారి వారి మత పెద్దలకి అప్పగించి తప్పుకోవడం ఉత్తమమైన మార్గం. అప్పుడే రాజ్యాంగంలోని సెక్యులర్ పాలన నడిచినట్టు. జరిగిన సంఘటన హిందు మతాన్ని ఏకంచేసే సంఘటనగా మిగలాలని ఆశిస్తున్నాను.

- కె.వి.సుబ్రహ్మణ్యం, విశాఖపట్నం