సబ్ ఫీచర్

బౌద్ధం భాగ్యవంతమైనదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల ‘ప్రజాగాయకుడు’ గద్దర్ ప్రారంభించిన ‘సేవ్ కాన్‌స్టిట్యూషన్ ఫోరం’పై నేను రాసిన వ్యాసంలో ‘బౌద్ధం -బుద్ధుడు’పై’ చేసిన వ్యాఖ్యలకు గుంటూరు నుంచి ఓ బౌద్ధ ప్రేమికుడు ఫోన్‌చేసి అసహనాన్ని వ్యక్తం చేశాడు. గౌతమ బుద్ధుడు భగవంతునితో సమానం కాబట్టి విమర్శించరాదన్న భావన చాలామందిలో కనిపిస్తుంది. అలాంటి వారిలో ఆయనొకరు. విమర్శకు అతీతమైనది ఏదీ లేదన్నది అందరం అర్థం చేసుకోవలసిన ప్రాథమిక అంశం. ఇక్కడి ప్రశ్న ప్రపంచాన్ని ఉన్నతీకరిస్తున్న ఉపాధి అంశం అని గుర్తించాలి.
లుంబినిలో పుట్టిన సిద్ధార్థుని కథ అందరికి తెలిసిందే! శుద్ధోదనుడి అతి ప్రేమ, వాత్సల్యం, రాజ్యవిస్తరణ కాంక్ష తదితర అంశాలు అనంతరం సిద్ధార్థుడి ‘శోధన’కు కారకాలయ్యాయి. రాజ్యంలోని, సమాజంలోని వేదన-జరామరణాల సంగతి తెలియనంత ‘గోప్యం’గా సిద్ధార్థను పెంచడం విడ్డూరం. రాజభవనంలోనైనా జరామరణాల ఉనికి కనిపించాలి. అందరూ ఆ రాజభవనంలో యవ్వనులే కనిపంచారా సిద్ధార్థునికి? అదే నిజమనుకోమని బుద్ధుని అభిమానులు మనకు చెబుతున్నారు. ఇది నమ్మశక్యంగా లేదు. ‘్భగవంతుడిని ప్రశ్నించడమా?..’ అన్న ఒక భావన అందరినీ కప్పేసినట్టుంది. వాస్తవమయితే అదికాదని ప్రతి మనిషి ‘‘అంతర్గత జ్ఞానం’’(సిక్స్త్‌సెన్స్) చెబుతోంది. రాజప్రాసాదంలో వృద్ధులు, జ్వర పీడితులు, రకరకాల కష్టాలతో ముఖంలో బాధ వ్యక్తమయ్యే ఉద్యోగులు, దాసదాసీలు, పరిచారికలు, భటులు (ఒకరిద్దరైనా) ఉండరా?
సరే, ప్రచారంలో ఉన్న (కట్టు)కథనే నిజమని భావించినా సిద్ధార్థునికి పెళ్ళయి, రాహుల్ జన్మించే వరకు రాజభవనాన్ని వీడి వాహ్యాళికిగాని, వేటకుగాని, బంధువుల ఇంటికి గాని, పురంలో జరిగే ఉత్సవాలకు గాని, ఇతర రాజుల ఆహ్వానాలపై గాని బయటకు వెళ్ళలేదనుకోవాలా? వెళ్ళినా ఏమీ కనిపించలేదనడం విడ్డూరం. తనకు పాతిక సంవత్సరాలు దాటిన తరువాతనే, రాహుల్ జన్మించాకనే రథంపై నగరంలో వాహ్యాళికి వెళ్ళడం.. అలా వెళ్ళిన సాయంత్రమే ఒక వృద్ధుడు, ఒక రోగి, ఒక శవయాత్ర వెంటవెంటనే కనిపించడం సినిమాలో జరిగినట్టుగా ఉంటుంది! ఆ ‘మూడు దృశ్యాలు’ సిద్ధార్థుని చిత్తాన్ని మధించాయి. ఆలోచనలకు.. తీవ్ర ఆలోచనలకు హేతువయ్యాయి. తన అందమైన భార్య, యువరాణి రాహుల్‌కు జన్మనిచ్చినప్పుడు పడిన నొప్పులు, బాధ, భయంకరమైన యాతన గూర్చి చూచాయగనైనా సిద్ధార్థునికి తెలియదనుకోవాలా? అసలు శిశువు జననం గూర్చిన అవగాహన ఆయనకు-వృద్ధుడు, రోగి, శవయాత్ర దృశ్యాలు చూడకముందు ఉన్నట్టు అనిపించదు. కనీసం తన తల్లి మాయాదేవి మరణం గూర్చిన విషయం తనకు రాహుల్ పుట్టాక కూడా తెలియదనుకోవాలా? తల్లి మరణవార్తను రహస్యంగా ఉంచారా? మాయాదేవి మరణం గూర్చిన సమాచారం తప్పక ముందే తెలిసుండాలి.. అలాగే రాజప్రాసాదంలో అనేకమంది వైద్యులు ఉంటారు. వారి విధులేమిటో తెలియకుండానే సిద్ధార్థుడు పాతిక ఏళ్లు గడిపాడా?.. జనన మరణాల సందర్భంగా బాధ.. వేదనను గ్రహించలేని మంద‘బుద్ధి’ గలవాడా? సిద్ధార్థుని బాల్యంలోని సేవకులు, దాసీలు తదితర సహాయకులు పాతిక సంవత్సరాల అనంతరం వృద్ధాప్యంలోకి జారకుండా ఉండి ఉంటారా? ఆ సేవకులకు, సహాయకులకు, స్నేహితులకు ఎప్పుడైనా ఆరోగ్యం పాడవలేదా?... వారు రోగగ్రస్తులు కాలేదా?...
ఇట్లా సవాలక్ష ప్రశ్నలు సిద్ధార్థుని బాల్యంపైనే ఉన్నాయి. వీటన్నింటిని బుద్ధుని అభిమానులు, ఆరాధకులు తమ సౌకర్యార్థం ప్రశ్నించకూడదనుకుంటే ఎలా?... అది భావ్యంగా ఉంటుందా?... బుద్ధ భగవంతుడిని ప్రశ్నిస్తారా?... కళ్లుపోతాయని విమర్శకులపై కళ్ళురిమిచూస్తే ఎలా?...
సిద్ధార్థుడు పాతికేళ్లుదాటాక తన ముద్దుల కొడుకు రాహుల్‌ను, అప్సరసలాంటి భార్యను వీడలేక.. వీడలేక ఓ రాత్రి రాజభవనాన్ని వదిలాడు. ఆ సన్నివేశంలో సిద్ధార్థుడు అనేక మోహపాశాలకు వశుడైన ఓ సాధారణ యువరాజు అని ఆ ‘‘పాత్ర చిత్రణ’’ స్పష్టం చేస్తోంది. పాతికేళ్ళ యువరాజులో అరిషడ్వర్గాలు సహజసిద్ధంగానే ఉన్నాయి. ఈ ప్రాథమిక అంశాలు అతనిలో ఉన్నప్పుడు ఒక సాయంత్రం ‘‘మూడు దృశ్యాలు’’ తన మనసును కలిచివేయడం విడ్డూరంగాక ఏమవుతుంది? మోహపాశాలు, అరిషడ్వర్గాలు దండిగాఉన్న యువరాజు ఒకేపూట వీధిలో దృశ్యాలు చూసి ‘దిగ్భ్రమ’కు గురికావడం ఆశ్చర్యం! సరే ఆ ‘కథ’నే నిజమనుకుందాం..
రాజభవనం వీడాక సిద్ధార్థుడి ‘అనే్వషణ’ప్రారంభమైంది. తనను కలిచివేసిన మూడు దృశ్యాల వెనుకగల ఆంతర్యం...రహస్యం ఏమిటని తెలుసుకోవాలన్నది ఆ అనే్వషణ వౌలికాంశం. ఇక్కడే సిద్ధార్థుడు తప్పటడుగు వేశాడు. ఈమాట అంటే ఆయన అభిమానులకు అసలే నచ్చదు. అలాగని సత్యాన్ని సమాధి చేయరాదు కదా?
జరామరణాలకు, క్లేశానికి పరిష్కారం యోగాలోనో, ధ్యానంలోనో మరో ఆసనాల పాఠశాలలోనో లభించదు. దానికి హేతువయిన అంశం లోతుల్లోకి సిద్ధార్థ వెళ్ళాలనుకున్నాడని చెబుతారు. సిద్ధార్థుని ఈ అనే్వషణ ఆరంభానికిముందు వేల సంవత్సరాల మానవ నాగరికత, జనపదాల పాలన, రాజుల యుద్ధాలు, యుద్ధనైపుణ్యాలతోబాటు జీవన నైపుణ్యాలున్నాయి. జీవితంలోని అన్ని పార్శ్వాలను గూర్చిన లోతైన పరిశోధన-పరిశీలన జరిగింది. వీటి ఆధారంగా అసంఖ్యాక అధ్యయన సంస్థలు, యోగాసంస్థలు పీఠాలు అప్పటికే ఉన్నాయి. ఆయా పీఠాధిపతులు తమతమ భాష్యాలను యోగంపై, జీవనవిధానంపై, జనన మరణాల చక్రంపైలోతుగానే చెబుతున్నారు. అనేకమంది శిష్యులు, సాధకులు ఉన్నారు. ఇతర రాజ్యాలకు చెందినవారూ కనిపిస్తారు. ఇవేవీ సిద్ధార్థుడిని సంతృప్తిపరచలేదని చెబుతారు. వాస్తవానికి.. జరా మరణాలు, వేదన...క్లేశం లాంటి రుగ్మతలను తొలగించేందుకు లేదా ఉపశమనం కలిగించేందుకు అవసరమైన అంశాలు యోగసాధనలో, అభ్యాసంలో, తపస్సులో, జ్ఞాన అనే్వషణలో కనిపించవు. యోగ... సాధన... అభ్యాసం... జ్ఞానతృష్ణ... ఇవన్నీ మనిషి మనసుకు, అంతర్లోకాలకు చెందినవి, రోగం, వృద్ధాప్యం, మరణం భౌతిక శరీరానికి సంబంధించిన అంశాలు. మనసు-శరీరం ఒకటేనని కొందరు భావించినా అది సత్యం కాదు. మూడు దృశ్యాలకు పరిష్కారం భౌతికాంశాలపై ఆధారపడి ఉందన్న సత్యాన్నికాదని మనిషి అంతర్లోకానానికి, మనసు, చైతన్యంలోని మూలానికివెళ్ళి పరిష్కారం కనుగొనచూడటం అంత ఆహ్వానించదగ్గదిగా కనిపించదు. రోగం ఒకచోట ఉంటే మందు మరోచోట పూసిన చందంగానే ఉంటుంది ఈ వ్యవహారం. భౌతిక అంశాల వైక్లభ్యానికి భౌతికపరమైన పరిష్కారాలు వెతకాలి గాని- యోగం... ధ్యానం... తపస్సుతో పరిష్కార మార్గం కనుగొంటానని సుదీర్ఘకాలం ‘యాత్ర’ చేస్తే ఏమిటి ప్రయోజనం? చివరికి పరిష్కారం లభించిందా?... తిరిగి పలాయనవాదం మరోరూపంలో వెలుగుచూసింది. అంతకుమించిన ‘అద్భుతం’ ఏదీ జరగలేదు.
మనిషికి కలిగే తృప్తి, సంతోషం, ఉత్సాహం... సాపేక్షికాంశాలు. అవి అంగట్లో దొరకవు... ఒకరికి రెండు పూటలా భోజనం లభిస్తే తృప్తి కలగవచ్చు... మరొకరు మూడవ పూటకోసం ఆరాటపడవచ్చు. ఈ వౌలిక మానవ ఆకాంక్షలు బుద్ధునికి ముందు, బుద్ధుని కాలంలో... వర్తమానంలోనూ కనిపిస్తాయి. ఈ వౌలిక సాపేక్షికాంశాల వెలుతురులో మానవునికి బాధల నుంచి ముక్తి.. విముక్తి.. లభిస్తాయా? సంపూర్ణ సంతోషం లాంటి మాటలకు అర్ధం కనిపిస్తుందా?.. మానవ జీవితానికి అవి అన్వయమవని పదాలు.. మాటలు. అయినా బుద్ధునికి బోధివృక్షం కింద ‘జ్ఞానోదయం’ కలిగింది. అది మానవాళికి స్వర్గాన్ని అందిస్తున్నది. గొప్ప ‘మార్గాన్ని’ బుద్ధుడు చూపాడు అని అప్పుడు.. ఇప్పుడు అనడంలో ఏమైనా అర్థం ఉందా? మనిషి ఆవరణంలో లేని అంశాల గూర్చి బోధించడం, మనిషి పురోగమనానికి, ముందడుగు వేసేందుకు ఉపకరించని నిర్వాణ విధానం బోధిస్తూ... ఇంతకుమించిన అద్భుత ‘విముక్తి మార్గం’ మరొకటి లేదని వాదించడం విడ్డూరం గాక ఏమవుతుంది? ఈ వౌలిక విబేధాల కారణంగానే బౌద్ధం 18 పాయలుగా చీలింది.
గుంటూరుకు దగ్గరలోని అమరావతిలో ఇప్పటికీ బౌద్ధ మ్యూజియం ఉంది. కొన్ని సంవత్సరాలక్రితం అక్కడ ‘కాలచక్ర’అనే క్రతువును బౌద్ధమతస్తులు నిర్వహించారు. మంత్ర-తంత్రాలు-బలులతో ఆ క్రతువును భారీఎత్తున రోజుల తరబడి నిర్వహించారు. చిరకాలంగా ఇలాంటి అనేక క్రతువులు కొనసాగుతున్నాయి. ‘బుద్ధం శరణం గచ్ఛామి’అన్న మాటలోనే భౌతిక-హేతువాదం ఉందని ఘంటాపథగాచెప్పే బౌద్ధప్రేమికులు ప్రేమ-కరుణ- అహింసలను చాటే బౌద్ధం పవిత్రమైనదని తలిచే బౌద్ధ ఆరాధకులు ఈ బలులు,మంత్రాలు, ముగ్గులు, తాంత్రిక విద్యలు, క్షుద్ర పూజలు దేనికి చిహ్నమో చెప్పగలరా?
బౌద్ధాన్ని నిలబెట్టేందుకు బంగారాన్ని, అందమైన స్ర్తిలను బౌద్ధ గురువులు ‘ఎర’వేశారు. అలా తమ మతాన్ని కాపాడుకోవాలని శతాబ్దులపాటు చూశారు. వీటినే గొప్ప విలువలని భావించాలా?... సత్యం- ధర్మం-ప్రేమ-కరుణ లాంటి పదాలకు వాస్తవ అర్థం బౌద్ధం విస్తరణలో లుప్తమైందని దాచేస్తే దాగని సత్యం. అలాంటి అనైతిక విలువలు, వ్ఢ్యౌభావనలు, అర్ధసత్యాలు, అధర్మాలు ఈ సాంకేతిక విప్లవం పురివిప్పిన ఈ సందర్భంలో ఉత్ప్రేరకంగా నిలుస్తాయా?

-వుప్పల నరసింహం 99857 81799