సబ్ ఫీచర్

గతం నుంచి నేర్చుకునేదేమిటి?( ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కానీ, తెలియని విషయం ఎప్పుడూ సజీవంగానే ఉంటుంది. కాబట్టి, తెలిసిన దానిని పట్టుకుని వేళ్ళాడడమంటే శవాన్ని పట్టుకుని వేళ్ళాడినట్లే. దేన్నైనా విడిచిపెట్టేందుకు ధైర్యంతో పనిలేదు. నిజానికి, శవాన్ని పట్టుకుని వేళ్ళాడేందుకు ధైర్యం చాలా అవసరం.
‘‘మీకు బాగా తెలిసిన, మీరు చక్కగా జీవించిన వాటినుంచి మీకు లభించినది, మీరు సాధించినది ఏముంది? మీరు ఇంకా చాలా అసంతృప్తితో, అర్థంలేని నిరాశ, నిస్పృహలతో ఉన్నారే కానీ, శూన్యం కాలేదు. సత్యం బయటపడకుండా అనేక అబద్ధాలు సృష్టిస్తూ, ఏదోఒక పనిలో నిమగ్నమై ఉన్నట్లుగా ఎలాగో మీరు నెట్టుకొస్తున్నారు. స్పష్టంగా గమనిస్తే మీకు తెలిసినదంతా ఎప్పుడో గతించిన, శ్మశానంలో భాగమైన సమాధి లాంటి గతానికి సంబంధించినదేనని తెలుస్తుంది. కాబట్టి, ‘‘మీరు జీవించాలనుకుంటున్నారా లేక సమాధిలో ఉండాలనుకుంటున్నారా?’’అనేది ఈనాటి ప్రశ్న మాత్రమేకాదు, రేపు, ఎల్లుండి, అలా మీరు మీ చివరి శ్వాసవరకు వేసుకోవలసిన ప్రశ్న.
చాలా కష్టపడి అనే్వషించి చక్కని సమాచారాన్ని, జ్ఞానాన్ని, అనుభవాన్ని మీరు సంపాదిస్తారు. అయితే ఒకసారి అవి తెలిసిన మరుక్షణం వాటితో మీ పని ముగిసిపోతుంది. ఎందుకంటే, వాటి గురించి మీకు పూర్తిగా తెలిసింది కాబట్టి. అయినా మీరు హాయిగా జీవించేందుకు ప్రతి క్షణం మీకోసం ఎదురుచూస్తున్న పరమానందాన్ని మీకు దక్కకుండాచేస్తూ మీ జీవితాన్ని సర్వనాశనం చేస్తున్న ఎందుకూ పనికిరాని, ఏమాత్రం జీవంలేని, ఆ చెత్త మాటల భారాన్ని మీరు మోస్తూనే ఉంటారు.
కాబట్టి, అవగాహన కలిగిన వ్యక్తి ప్రతి క్షణం గతంలో మరణిస్తూ, భవిష్యత్తుకోసం మళ్ళీ పుడుతూనే ఉంటాడు. అందుకే అతని వర్తమానం ఎప్పుడూ పరిణామంతో కూడుకున్న పునర్జన్మ, పునరుత్థానమే అవుతుంది. కాబట్టి, ఇక్కడ ధైర్యానికి సంబంధించిన ప్రశ్న ఏదీలేదని, ఏది ఏమిటో స్పష్టంగా తెలుసుకోవడమే ఇక్కడ ముఖ్యమని ముందుగా మీరు తెలుసుకోవాలి.
నిజంగా మీకు ధైర్యం అవసరమైనప్పుడు దానిని మీకు ఎవ్వరూ ఇవ్వలేరు. ఎందుకంటే, అది బహుమతిగా ఇచ్చే వస్తువులాంటిది కాదు. అది మీ పుట్టుకతో వచ్చే లక్షణం. అయితే, దాని నోరునొక్కేసిన మీరు దానిని ఎదగనివ్వలేదు.
స్పష్టత, ధైర్యాలతో కూడుకున్నదే అమాయకత్వం. కాబట్టి, మీరు నిజంగా అమాయకులైతే వాటితో మీకు ఎలాంటి అవసరము ఉండదు. ఎందుకంటే, అమాయకత్వంకన్నా అత్యంత స్పష్టమైనది ఏదీ లేదు. కాబట్టి, మీరు మీ అమాయకత్వాన్ని ఎలా రక్షించుకోవాలనేదే అసలు ప్రశ్న.
అయితే, ‘‘అమాయకత్వం’’అనేది నేర్చుకోవడం ద్వారా మరింతగా మెరుగుపరుచుకునే సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం, శిల్పం, నాట్యం లాంటి కళ కాదు. ఎందుకంటే, అది సామర్థ్యానికి చెందిన అంశం కాదు. శ్వాసలా అది పుట్టుకతో వచ్చే గుణం.
అందరూ అమాయకంగానే జన్మిస్తారు. కాబట్టి, అమాయకత్వమే అందరి సహజ గుణం. జన్మించడమంటే అర్థం ‘‘ఏదీ రాయని ఖాళీ పలకలా’’ మీరు చాలా శూన్యంగా ఈ ప్రపంచంలోకి ప్రవేశించారని. అంటే, మీకు కేవలం భవిష్యత్తుమాత్రమే ఉంటుంది కానీ, గతం ఉండదు. అమాయకత్వమంటే అదే. కాబట్టి, ముందుగా మీరు అమాయకత్వం అర్థాలను తెలుసుకునేందుకు ప్రయత్నించండి.
కేవలం భవిష్యత్తు తప్ప గతం ఏమాత్రం లేనిదే అమాయకత్వం. గతం ఎప్పుడూ అనుభవాలు, జ్ఞాపకాలు, ఆశలతో మిమ్మల్ని కలుషితం చేస్తూనే ఉంటుంది. వాటివల్ల మీరు కపటిగా, జిత్తులమారిగా తయారవుతారే కానీ, మేధావి కాలేరు.

- ఇంకాఉంది

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు
‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం.
పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ పోన్: 9490004261, 9293226169.