సబ్ ఫీచర్

అతిథిదేవోభవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతిథులంటే ఈనాడు భయపడతారు. మన ఇంటికి బందువులొస్తున్నారో లేక అతిథులొస్తున్నారో తెలిస్తే కొందరు భయపడతారు. ఏమో.. ఎన్ని రోజులు తిష్టవేస్తారో.. చాలీ చాలని సంసారం.. ఖర్చులు. సామాన్యుల ఇంట వినిపించే సమస్యలు ఇవి అయితే, ఇలా భయపడడం సహజమే కానీ అతిథులు కూడా కాస్త గౌరవంగా మెలగాలి. మర్యాదలు ఇచ్చి పుచ్చుకోవడం మన తెలుగింటి సాంప్రదాయం అని మరచిపోకండి. అతిథులుగా మనం ఇతరుల వద్దకు వెళ్లినపుడు వారిని ఇబ్బంది పెట్టకూడదు. మొహమాటానికి తావివ్వకూడదు. వుండమన్నారు కదా అని వారం రోజులో.. నెల రోజులో తిష్టవేయకూడదు. వారి పరిస్థితి గ్రహించి మసలుకోవాలి. కొందరు మనం అతిథులుగా వచ్చామని అతి మర్యాదకోసం తాపత్రయపడి అప్పులు చేస్తుంటారు. వారి పరిస్థితి గ్రహించాలి.
వీలుంటే మన మనీ పర్సులో డబ్బులు తీసి ఫర్వాలేదు ఏమైనా తెప్పించండి అనాలి. అప్పుడు వారికి ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి ఆత్మీయత పెరుగుతుంది. మనం ఎక్కడకు వెళ్లినా ఎదుటివారిలో ఆత్మీయ భావం, అనురాగం పెంపొందింపజేసుకోవాలి. ఒకటి రెండు రోజులు వుండి ఫర్వాలేదండీ వెళ్లొస్తాం! మీ ఆతిథ్యం అపూర్వం! అమోఘం! అని ప్రశంసించి మరి రావాలి. ఆ కృతజ్ఞతాభావం మీలో వుంటే చాలు, ఎక్కడికివెళ్లినా రాణిస్తారు. ఆదరింపబడతారు. మనం ఇతరులకు భారం కాకూడదు.
ఆ విషయం అలా వుంచితే అసలు అతిథులు సుదూరం నుంచి మన దగ్గరకు వచ్చినపుడు మనం వారిని ఆప్యాయంగా పలకరించి సాదరంగా స్వాగతం పలికితే వారికి అంటే మన ఇంటికి వచ్చిన అతిథులకు ఎంతో ఆనందం కలుగుతుంది. మనపట్ల వారికి మంచి నమ్మకం ఏర్పడుతుంది. పండుగలొస్తే ఇల్లు బంధువులు స్నేహితులతో కళకళలాడుతూ వుంటుంది. అతిథులు రాకపోకలు మన గౌరవభావాన్ని చాటి చెబుతాయి. అతిథులు మన ఇంటినుండి వెళ్లేటపుడు వారి కి సాదర పూర్వకంగా వీడ్కో లు పలకాలి. వీలుంటే మళ్లీ మా ఇంటికి రండి అని చెప్పాలి. ‘అతిథిదేవోభవ’ అన్న పదం మరువరాదు. మన ఇంటికి వచ్చిన అతిథులు దేవతలతో సమానం. కనుక వారిని తగిన రీతిలో ఆదరించడం మన కర్తవ్యం.

- ఎల్.ప్రపుల్ల చంద్ర