సబ్ ఫీచర్

శాశ్వతమైనదేదో తెలుసుకోవాలి( ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చక్రవర్తిగా మరణించిన వ్యక్తికి మాత్రమే ఆ బంగారు పర్వతంపై స్వయంగా సంతకంచేసే అరుదైన అవకాశం లభిస్తుంది. అలాంటి అరుదైన అవకాశం లభించినందుకు సంబరపడుతున్న ఆ చక్రవర్తి ‘‘తనతోపాటు తన వాళ్ళనుకూడా లోపలకు అనుమతించమని, వారందరూ చూస్తుండగా ఆ పర్వతంపై సంతకం చేస్తానని ’’సుమేరు పర్వత ద్వారపాలకుడిని అడిగాడు. వెంటనే ఆ ద్వారపాలకుడు చక్రవర్తిని ఒక పక్కకు తీసుకెళ్ళి ‘‘మీ మంచికోరి చెప్తున్నాను. ఇప్పుడు మీతోపాటు మీ వాళ్ళను తీసుకెళ్ళినా నాకు ఎలాంటి అభ్యంతరంలేదు. కానీ, తరువాత మీరే బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే, మీ వాళ్ళకు మీ పరిస్థితి తెలిసిపోతుంది. కాబట్టి, నామాట విని ఇప్పుడు మీతోపాటు మీ వాళ్ళను తీసుకెళ్ళకండి. ముందు మీరు వెళ్ళి సంతకంచేసి రండి. తరువాత మీవాళ్ళను తీసుకెళ్ళాలో, వద్దో మీకే తెలుస్తుంది. ఆపైన మీ ఇష్టం’’ అన్నాడు.
ద్వారపాలకుడి సలహాను పాటించడం ఎందుకైనా మంచిదని భావించిన చక్రవర్తి తన వాళ్ళతో ‘ముందు నేను వెళ్ళి సంతకంచేసి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను’అని చెప్పి లోపలకువెళ్ళి బంగారు కాంతులతో ధగధగా మెరిసిపోతున్న సుమేరు పర్వతాన్ని చేరుకుని ఆశ్చర్యపోయాడు.
ఎందుకంటే, సంతకం చేసేందుకు ఆ పర్వతంపై ఎక్కడా అతనికి ఖాళీప్రదేశం కనిపించలేదు. అప్పటికే అనేకమంది సంతకాలతో ఎక్కడా ఏమాత్రం ఖాళీ లేకుండా ఆ పర్వతం నిండిపోయింది. అంతవరకు తానే గొప్ప చక్రవర్తినని గొప్పగా భావిస్తున్న అతనికి అనంతమైన కాలగమనంలో అనేకమంది చక్రవర్తులు గతించారని తెలియడంతోపాటు తానేమిటో తెలిసింది. ఈ పరిస్థితి ఎవరికీ తెలియకూడదనే ద్వారపాలకుడు తనవాళ్ళను ముందుగా తీసుకువెళ్ళొద్దన్నాడని కూడా అర్థమవడంతో తనకు అవమానం జరగకుండా కాపాడిన ద్వారపాలకునిపై మరింత గౌరవాన్ని పెంచుకున్న ఆ చక్రవర్తి అతనిని పక్కకు పిలిచి ‘‘సంతకం చేసేందుకు ఆ పర్వతంపై ఎక్కడా ఖాళీలేదు. ఇప్పుడేం చెయ్యమంటావు’’అన్నాడు. అందుకు ఆ ద్వారపాలకుడు చక్రవర్తితో ‘‘కొన్ని సంతకాలు చెరిపేసి అక్కడ మీరు సంతకంచేసి రండి. ఇక్కడకు వచ్చేవారికి తరతరాలుగా మేము ఇదే సలహా ఇస్తున్నాము. అందరూ అదే పనిచేసి వెళ్తున్నారు. కాబట్టి, మీరు కూడా అదే పనిచేసి కావాలంటే మీవాళ్ళను లోపలకు తీసుకెళ్ళి చూపించండి’’అన్నాడు. వెంటనే చక్రవర్తి ఆ ద్వారపాలకునితో ‘‘అక్కడ ఉన్న పేర్లు చెరిపేసి నేను సంతకం చేసినా, నా లాగే మరొకరు వచ్చి నా పేరు ను చెరిపెయ్యొచ్చు కదా! కాబట్టి, ఆ పని చెయ్యడంలో అర్థం లేదు. అయినా సుమేరు పర్వతంపై సంతకం చెయ్యాలని కలకన్నది, అందుకు జీవితాన్ని పణంగాపెట్టి, అనేక యుద్ధాలుచేసి, రక్తపాతాన్ని సృష్టించినది ఇందుకోసమా? అందుకే నేను సంతకంచెయ్యను, నా వాళ్ళకు చూపించను’’అన్నాడు ఆవేశంగా. వెంటనే ద్వారపాలకుడు నవ్వుతూ ‘‘గతంలో ఇక్కడకు వచ్చిన అనేకమంది చక్రవర్తులు మీరు చెప్పినట్లే చెప్పి వెళ్ళారు. తెలివైనవారెవరైనా అదే పని చేస్తారు’’ అన్నాడు.
ఈ ప్రపంచంలో మీకు దక్కేది, చివరికి మీతోపాటు మీరు తీసుకెళ్ళగలిగేది ఏముంది? మీరు సంపాదించుకున్న డబ్బు, హోదా, అధికారం, గౌరవం, మర్యాద, కీర్తి, ప్రతిష్ఠ, పేరు ప్రఖ్యాతులను మీతో పాటు తీసుకెల్ళగలరా? దేనినీ మీతోపాటు తీసకెళ్ళలేరు. అన్నింటినీ మీరు ఇక్కడే వదిలి వెళ్లాలి. అలా వెళ్ళే క్షణంలో మీ స్వాధీనంలో ఉన్నవేవీ మీవి కావని తెలుస్తుంది. వాస్తవానికి, స్వాధీనతాభావం ఉండడమే తప్పు.

- ఇంకాఉంది

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు
‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్,
ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ పోన్: 9490004261, 9293226169.